Bigg Boss: బిగ్‌బాస్ కంటెస్టెంట్‌కు జైలు శిక్ష.. ఆ కేసులో కోర్ట్ తీర్పు, ఏం జరిగిందంటే?
వెండితెర, బుల్లితెర నటులు ఈ మధ్య కాలంలో కేసులలో ఎక్కువగా చిక్కుకుంటున్నారు. ఏ ఇండస్ట్రీ చూసినా ఎక్కడో ఒక చోట ఇలాంటివి తగులుతూ పరిశ్రమ పరువు తీస్తున్నారు. వీరిలో హత్యలు, కిడ్నాప్‌లు, అత్యాచారం వంటి తీవ్ర నేరాలు చేసిన వారు కూడా ఉన్నారు. నిన్నటి నిన్న మలయాళ స్టార్ హీరోయిన్ లక్ష్మీమీనన్ ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ని కిడ్నాప్ చేసిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. హైకోర్టును ఆశ్రయించి ఆ నటి అరెస్ట్ కాకుండా రక్షణ పొందింది.
బిగ్‌బాస్ తెలుగు 9కి ఏర్పాట్లు
ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న బిగ్‌బాస్ తెలుగు 9 మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. దీంతో కంటెస్టెంట్స్ ఎవరు? వారి పేర్లు ఏంటీ? అనే వివరాలు తెలుసుకునేందుకు జనం ఆసక్తి చూపిస్తున్నారు. కామన్‌మెన్లను హౌస్‌లోకి పంపేందుకు నిర్వహిస్తున్న బిగ్‌బాస్ అగ్నిపరీక్ష కారణంగా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో బిగ్‌బాస్ మేనియా నెలకొంది. ఇలాంటి పరిస్ధితుల్లో బిగ్‌బాస్ తెలుగు మాజీ కంటెస్టెంట్ ఒకరికి కోర్ట్ జరిమానా విధించడం కలకలం రేపుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

వెరైటీ వస్త్రధారణతో ఫేమ్‌లోకి
యాంకర్‌గా, ఆర్జేగా యువతలో గుర్తింపు తెచ్చుకున్నారు లోబో.. ఈ పాపులారిటీతో బిగ్‌బాస్ తెలుగు 5లో కంటెస్టెంట్‌గా అవకాశం దక్కించుకున్నాడు. లోబో అంటే చిన్నారుల నుంచి పెద్దవాళ్ల వరకు ఎంతో ఇష్టం. చిత్ర విచిత్రమైన డ్రెస్‌లలో కనిపించడం, డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో ఆయన అందరినీ ఆకట్టుకున్నారు. మనసులో ఉన్నది ఉన్నట్లుగా ఓపెన్‌గా మాట్లాడటం లోబో స్టైల్. ఈ ముక్కుసూటితనం పలుమార్లు వివాదాలు తెచ్చిపెట్టగా.. అంతే పాపులారిటీ కూడా తెచ్చింది.
బిగ్‌బాస్‌లో ఛాన్స్
హైదరాబాద్‌కు చెందిన లోబో అసలు పేరు మహమ్మద్ ఖయ్యూం. దొంగతనం కారణంగా 9వ తరగతిలోనే అతనికి టీసీ ఇచ్చి పంపేశారు. ఓ టాటూ షాపులో పనిచేస్తున్న సమయంలో ఓ రష్యన్ యువతి అతనికి లోబో అని పేరు పెట్టింది. ఆ తర్వాత డీజేగా, ఆర్జేగా చేస్తూ వచ్చిన లోబోకి మా మ్యూజిక్‌లో యాంకర్‌గా అవకాశం రావడంతో అతని దశ మారిపోయింది. అతని యాంకరింగ్‌కు యువత ఫిదా కాగా.. నెమ్మదిగా సినిమాల్లో అవకాశాలు కూడా వచ్చాయి. బిగ్‌బాస్ 5లోనూ తన మైండ్ గేమ్, వ్యక్తిత్వంలో అభిమానులను సంపాదించుకున్న లోబో 8 వారాల పాటు హౌస్‌లో ఉన్నాడు. రోజుకు 25 వేల చొప్పున.. 8 వారాలకు గాను 15 లక్షలకు పైగా సంపాదించాడు.
ఏడేళ్ల నాటి కేసు
బిగ్‌బాస్ నుంచి బయటికొచ్చాక యాంకరింగ్, కొన్ని సినిమాలు, కార్యక్రమాలు చేస్తూ బిజీ అయ్యాడు. ఈ దశలో 2018 మే 21వ తేదీన వరంగల్‌లో షూటింగ్ పూర్తి చేసుకుని తన బృందంతో కలిసి హైదరాబాద్‌కు కారులో బయల్దేరాడు లోబో. ఈ దశలో లోబో నడుపుతున్నకారు రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద ఆటోని వేగంగా ఢీకొట్టింది. ఈ ఘనటలో పెంబర్తి మణెమ్మ, మేడె కుమార్ అనే ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో లోబో నడుపుతున్న కారు కూడా అదుపుతప్పడంతో అందులోని వారు కూడా గాయపడ్డారు. రంగంలోకి దిగిన పోలీసులు 7 ఏళ్ల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపి చివరికి ఛార్జిషీట్ దాఖలు చేశారు. లోబో నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని నిర్ధారించిన జనగామ కోర్ట్.. అతనికి ఏడాది జైలు శిక్షతో పాటు 12,500 రూపాయల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తుది తీర్పు చెప్పారు.


Click it and Unblock the Notifications











