Just In
Don't Miss!
- News
మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికలు: తెలంగాణలో కలుస్తామన్నవారే సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలుపు
- Finance
బంగారం ధర పెరిగింది, కానీ ఆ మార్క్‌కు దిగువనే: రూ.66,300 వద్ద వెండి ధరలు
- Sports
శెభాష్ సిరాజ్.. నీ ఆటను చూసి మీ తండ్రి గర్వపడుతాడు: మంత్రి కేటీఆర్
- Automobiles
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
- Lifestyle
ప్రతిరోజూ ఒక చెంచా బొప్పాయి గింజలను తింటే ఏమవుతుందో తెలుసా? ... వెంటనే తినడం ప్రారంభించండి ...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అభిజీత్ గెలుపును చెప్పకనే చెప్పిన బిగ్ బాస్.. తెలుగులో ఏ కంటెస్టెంట్‌కూ ఇలా జరగలేదు
తెలుగులో పలు సినిమాల్లో నటించినా అంతగా గుర్తింపును అందుకోలేకపోయినా.. బిగ్ బాస్ షోలో పాల్గొనడం ద్వారా ఊహించని విధంగా పాపులారిటీని అందుకున్నాడు అభిజీత్. అద్భుతమైన ఆట తీరుతో పాటు లవ్ ట్రాకులతో ఫుల్ ఫేమస్ అయిపోయాడు. దీంతో అతడికి ఎన్నోసార్లు అండగా నిలిచి నామినేషన్స్ నుంచి కాపాడారు ప్రేక్షకులు. ఈ క్రమంలోనే ఫినాలే వరకు చేరువ అవడంతో పాటు టైటిల్ రేసులో ముందున్నాడు. ఈ నేపథ్యంలో షో చరిత్రలోనే మొదటిసారి ఓ కంటెస్టెంట్ గెలుపును చెప్పకనే చెప్పేశాడు బిగ్ బాస్. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

ఇద్దరమ్మాయిలతో ట్రాకులు నడిపి ఫేమస్
బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడే అభిజీత్‌ను లవర్ బాయ్ అనుకున్నారంతా. స్టేజ్ మీదే ఆడిన ఓ గేమ్‌లో మోనాల్ గజ్జర్‌ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అందుకు తగ్గట్లుగానే ఆ తర్వాత గేమ్‌లో కూడా ఆమెతో క్లోజ్‌గా ఉన్నాడు. కొద్ది రోజులకు ఆమె అఖిల్ సార్థక్‌కు దగ్గరవడంతో అభిజీత్.. దేత్తడి హారికతో చనువుగా ఉన్నాడు. ఇలా ఇద్దరమ్మాయిల వల్ల బాగా ఫేమస్ అయ్యాడు.

11 సార్లు నామినేషన్స్ తప్పించుకున్నాడు
బిగ్ బాస్ షోలో అభిజీత్ కూడా అందరితో పాటే గేమ్స్ ఆడాడు. కొంత మంది ఎక్కువగా హైలైట్ అవడం వల్ల అతడికి స్కోప్ లభించలేదు. ఈ కారణంగానే టాస్కులు సరిగా ఆడలేడని అతడిని ఏకంగా 11 సార్లు నామినేట్ చేశాడు ఇంటి సభ్యులు. అయినా తన ధైర్యం కోల్పోకుండా ప్రతి టాస్కులోనూ ఆడుతూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని అన్ని సార్లు సేఫ్ అవుతూ వచ్చాడు.

ఫినాలేలో చోటు.. టైటిల్ రేసులో దూకుడు
నాలుగో సీజన్ ప్రథమార్ధంలోనే బిగ్ బాస్ విజేత అభిజీత్ అన్న టాక్ వచ్చేసింది. అందుకు అనుగుణంగానే ఆరియానా గ్లోరీ, అఖిల్ సార్థక్, దేత్తడి హారిక, సయ్యద్ సోహెల్ రియాన్‌లతో కలిసి ఫినాలేలో అడుగు పెట్టాడతను. అంతేకాదు, గత ఆదివారం నుంచే జరుగుతోన్న ఓటింగ్‌లో దూకుడు చూపిస్తూ టాప్ పొజిషన్‌లో కొనసాగుతున్నాడు. దీంతో టైటిల్‌కు చేరువయ్యాడు.

స్పెషల్ గెస్టులు.. కంటెస్టెంట్లకు సర్‌ప్రైజ్‌లు
ప్రస్తుతం బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో ఫినాలే వీక్ జరుగుతోంది. ఇప్పటి వరకూ టాస్కులతో కొట్టుకున్న కంటెస్టెంట్లు.. మిగిలిన కొద్ది రోజులను సంతోషంగా గడుపుతున్నారు. ఈ సమయంలోనే గత ఎపిసోడ్‌లో స్పెషల్ గెస్టులను తీసుకొచ్చిన బిగ్ బాస్... బుధవారం నుంచి కంటెస్టెంట్ల జర్నీ వీడియోలను ప్రసారం చేస్తున్నారు. అదే సమయంలో వాళ్లపై అభిప్రాయాలను వెల్లడిస్తున్నాడు.

అభిజీత్‌ను బాగా ఎలివేట్ చేసిన బిగ్ బాస్
అభిజీత్ జర్నీ వీడియో సందర్భంగా బిగ్ బాస్ మాట్లాడుతూ ‘యంగ్ చార్మింగ్ బాయ్‌లా వచ్చిన మీరు.. ఎన్నో ప్రశంసలు అందుకుంటూ మెచ్యూర్డ్ మ్యాన్ ఇన్ ది హౌస్ అనే టైటిల్ కూడా సాధించారు. ఈ చిన్న ప్రయాణంలో ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొన్ని మరెన్నో బంధాలను ఏర్పరచుకున్నారు. కష్టాలను దాచుకుని బాధపడ్డారు' అంటూ అతడిని బాగా ఎలివేట్ చేశారు.

గెలుపును చెప్పకనే చెప్పి.. ఇదే తొలిసారి
అభిజీత్‌పై గురించి చెబుతూ ‘మీరు మీకంటే ఎక్కువగా వేరే వాళ్ల గురించి ఆలోచించి.. వాళ్లకి మర్యాద ఇచ్చారు.. తిరిగి తీసుకున్నారు. అందరికీ ఆశ్చర్యం కలిగించేలా.. నిలకడ కోల్పోకుండా షో మొత్తం కొనసాగించారు. నీలాంటి పరపక్వత కలిగిన తెలివైన కంటెస్టెంట్ హౌస్‌లో ఉన్నందుకు బిగ్ బాస్ చాలా గర్వపడుతున్నారు' అని తొలిసారి ఓ కంటెస్టెంట్‌పై ఈ విధమైన కామెంట్స్ చేశాడు.