పెళ్లి కాకుండా సహజీవనం చేస్తే తప్పేంటీ? బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్

Bigg Boss: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి ఇటీవల ఎలిమినేట్ అయిన నటి ఫ్లోరా షైనీ ( Flora Saini) ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. హౌస్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ తన వ్యక్తిగత జీవితం, అనుభవాలు, ఆలోచనలు ప్రేక్షకులతో పంచుకుంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఫ్లోరా చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లోనే కాదు, సోషల్ మీడియాలోనూ పెద్ద చర్చకు దారితీశాయి. ఇంతకీ ఏమన్నారు? ఎందుకు అలాంటి బోల్డ్ కామెంట్స్ చేయాల్సి వచ్చింది? అనే వివరాల్లోకెళ్లే..

తాజాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 బ్యూటీ, హీరోయిన్ ఫ్లోరా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను ప్రస్తుతం లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నానని, పెళ్లిపై ఆసక్తి లేదని స్పష్టంగా వెల్లడించింది. అనంతరం యాంకర్ ఆమెను "ఫ్రీ బర్డ్" వివాదం గురించి ప్రశ్నించగా.. ఫ్లోరా స్పందిస్తూ "ప్రస్తుతం నేను లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నాను. మీరు గూగుల్ చేస్తే కనిపించే సమాచారం పాతది. ఆ బంధం ఎప్పుడో ముగిసిపోయింది. కానీ, గత ఏడు సంవత్సరాలుగా ఓ వ్యక్తితో సహజీవనం చేస్తూ సంతోషంగా జీవిస్తున్నాను. ఈ విషయాన్ని సంజనకు కూడా చెప్పాను. అయినా ఆమె నన్ను 'ఫ్రీ బర్డ్' అంటూ కామెంట్ చేసింది. రిలేషన్‌షిప్‌లో ఉన్న నేను ఎలా ఫ్రీ బర్డ్ అవుతాను?" అంటూ ప్రశ్నించింది.

Bigg Boss Flora Saini s Bold Statement Live-in Relationship is Better Than Marriage

అంతేకాదు, ఆమె 'బ్యాక్ బ్లీచింగ్' వివాదంపై కూడా స్పందిస్తూ "ఫ్రీ బర్డ్ అనేది తప్పు పదం కాకపోతే, బ్యాక్ బ్లీచింగ్ ఎందుకు తప్పు అవుతుంది?" అని చెప్పి తన ఆలోచన విధానాన్ని వివరించే ప్రయత్నం చేసింది. తదుపరి "రిలేషన్‌లో ఉన్నా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏమిటి?" అని యాంకర్ ప్రశ్నించగా..
"మ్యారేజ్ పై నాకు ఎప్పటినుంచో ఆసక్తి లేదు. ముంబైలో జీవితం చాలా ఫార్వర్డ్‌గా ఉంది. నేను చూసిన చాలా జంటలు పెళ్లయిన తర్వాత రెండు, మూడు సంవత్సరాలకే విడిపోతున్నారు. అలాంటి ఉదాహరణలు చూసి నేను ఆలోచించాను. మ్యారేజ్ అనేది కేవలం పేపర్‌పై రాసుకున్న అగ్రిమెంట్‌లాంటిది. కానీ లివింగ్ రిలేషన్‌షిప్ మాత్రం ఆ అగ్రిమెంట్ లేకుండా సత్యమైన బంధం. అయినా పెళ్లి చేసుకోకుండా లివింగ్ రిలేషన్ కొనసాగిస్తే తప్పేంటి?" అని ప్రశ్నించింది.

ఫ్లోరా "నా చుట్టూ చాలా మంది పెళ్లి చేసుకొని విడిపోయారు. పెళ్లి చేసుకున్న వారు కూడా కూడా నిజాయితీగా ఉండలేకపోతున్నారు. అందుకే నేను పెళ్లి కంటే సహజీవనాన్నే బెటర్ అనిపించింది. గత ఏడు సంవత్సరాలుగా సంతోషంగా జీవిస్తున్నాను," అంటూ చెప్పింది. యాంకర్ అంతటితో ఆగకుండా.. 'మీ తల్లిదండ్రులు పెళ్లి చేసుకొని సంతోషంగా జీవిస్తున్నారు కదా, వాళ్ల బంధం చాలా బలంగా ఉంది కదా, అలాంటప్పుడు ఇలా మాట్లాడటం ఎలా?' అని ప్రశ్నించగా.. 'ప్రస్తుత కాలంలో జీవన విధానం పూర్తిగా మారిపోయింది. రేపు ఏమి జరుగుతుందో చెప్పలేం. 20-25 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్న జంటలు కూడా ఇప్పుడు విడిపోతున్నారు. అలాంటి పరిస్థితులు చూసిన తర్వాత నాకు సహజీవనం మ్యారేజ్ కంటే బెస్ట్ అని అనిపించింది," అని సహజీవనంపై క్లారిటీ ఇచ్చింది.

"మీ పార్ట్నర్ ఎవరు? ఎప్పుడు పరిచయం చేస్తారు?" అని యాంకర్ ప్రశ్నించగా.. ఫ్లోరా నవ్వుతూ "చాలా త్వరలోనే పరిచయం చేస్తాను" అంటూ బదులిచ్చింది. ప్రస్తుతం ఫ్లోరా షైనీ ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొంతమంది నెటిజన్లు ఆమె బోల్డ్ ఆలోచనలను అభినందిస్తుండగా, మరికొందరు మాత్రం "సాంప్రదాయ విలువలను విస్మరిస్తోంది" అంటూ విమర్శిస్తున్నారు. ఏదేమైనా, "పెళ్లి కంటే సహజీవనమే బెస్ట్" అంటూ ఫ్లోరా చేసిన వ్యాఖ్యలు బిగ్ బాస్ సీజన్ 9 తర్వాత ఇప్పుడు కొత్త హాట్ టాపిక్‌గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X