Bigg Boss: బిగ్ బాస్ రీస్టార్ .. తిరిగి వచ్చిన కంటెస్టెంట్లు.. అసలేం జరిగిందంటే?

Bigg Boss Kannada: ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్. ఈ షో కేవలం కేవలం హిందీ, తెలుగులోనే కాదు.. కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో ఎంతగానో ఆదరణ పొందింది. ఇలాంటి ఫేమ్ సొంతం చేసుకున్న కన్నడ బిగ్ బాస్ తాజాగా వివాదంలో నిలిచిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా కన్నడ బిగ్‌బాస్ షోకు ఎదురైన పెద్ద అడ్డంకి ఇప్పుడు తొలగిపోయింది. దీంతో బిగ్ బాస్ షో తిరిగి ప్రారంభమైంది. కంటెస్టెంట్లు రీ ఎంట్రీ ఇచ్చారు. అసలేం జరిగిందంటే?

కన్నడ బిగ్ బాస్ షో బెంగళూరులోని బిడది ప్రాంతంలోని జోలీవుడ్ స్టూడియోలో షో జరుగుతుంది. ఈ సమయంలో కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలు పాటించడం లేదని ఫిర్యాదులు వచ్చాయి. ఈ స్టూడియో నుంచి ప్రతిరోజూ 2.5 లక్షల లీటర్ల శుద్ధి చేయని నీరు బయటకు వస్తోందని ఆరోపణలు రావడంతో, కాలుష్య నియంత్రణ బోర్డు నోటీసులు జారీ చేసింది. అయితే, షో నిర్వాహకులు ఈ నోటీసులను పట్టించుకోకపోవడంతో తహసీల్దార్ తేజస్విని నేతృత్వంలో స్టూడియోకు సీజ్ చేశారు. దీంతో బిగ్ బాస్ షో నిలిపివేయబడింది.

Bigg Boss Kannada Reopens Contestants Return After Studio Seizure Controversy

ఈ పరిణామాల కారణంగా బిగ్ బాస్ షూటింగ్ తాత్కాలికంగా నిలిచిపోయింది. హౌస్‌లో ఉన్న 17 మంది కంటెస్టెంట్లను తాత్కాలికంగా ఈగిల్టన్ రిసార్ట్‌లోకి తరలించారు. ఈ సమయంలో షో హోస్ట్ కిచ్చా సుదీప్ జోక్యం చేసుకోవడంతో పరిస్థితి మారింది. ఈ వివాదాన్ని గమనించిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందిస్తూ.. స్టూడియోకు మరో అవకాశం ఇవ్వాలని బెంగళూరు సౌత్ డిప్యూటీ కమిషనర్‌కు ఆదేశించారు. జిల్లా మేజిస్ట్రేట్ జోలీవుడ్ స్టూడియోకు కాలుష్య సమస్యలను సరిదిద్దేందుకు 10 రోజుల గడువును కేటాయించారు. కాలుష్య నియంత్రణ శాఖ అధికారులు ఈ స్టూడియో సీజ్ షోకు సంబంధం లేనట్టు స్పష్టం చేశారు.

ఇలా గురువారం తెల్లవారుజామున డిప్యూటీ కమిషనర్ యశ్వంత్ వి. గురుకర్, సౌత్ ఎస్పీ శ్రీనివాస్ గౌడ సమక్షంలో జోలీవుడ్ స్టూడియో గేట్ తిరిగి తెరచబడింది. అలాగే, 17 మంది కంటెస్టెంట్స్‌ను మళ్లీ బిగ్ బాస్ ఇంటికి తీసుకువచ్చారు. ప్రస్తుతానికి ఈ స్టూడియోలో కేవలం బిగ్ బాస్ షో నిర్వహణకు మాత్రమే అనుమతి ఉంది, ఇతర వాణిజ్య కార్యకలాపాలకు నిషేధం కొనసాగుతుంది.

ఈ ఘటనపై స్పందించిన కిచ్చా సుదీప్, ఉప ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ''ఎలాంటి గందరగోళం లేకుండా సమస్యను పరిష్కరించి, షో కొనసాగడానికి మార్గం సుగమం చేసినందుకు ధన్యవాదాలు'' అని వ్యాఖ్యానించారు. ఈ చర్యల తర్వాత బిగ్ బాస్ షో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది, హౌస్‌లో తిరిగి చేరిన కంటెస్టెంట్స్‌తో రియాలిటీ షో ఉత్సాహభరితంగా కొనసాగుతోంది.

ఈ పరిణామాల వల్ల కేవలం షో మాత్రమే కాదు, కంటెస్టెంట్స్‌కు గేమ్‌లో సరికొత్త ఉత్సాహాన్ని తెచ్చింది. తాజాగా రీ-స్టార్ట్ అయిన షో హౌస్‌లో ఎలాంటి ట్విస్ట్‌లు, ఎలిమినేషన్స్, కొత్త ఎంట్రీలు రానున్నాయో కూడా అందరూ వేచి చూస్తున్నారు. ఇంతకీ ట్వీస్టులు బిగ్ బాస్ షోలోనే కాదు.. రియల్ లైఫ్ కూడా చోటుచేసుకుంటాయంటూ నెట్టిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X