For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss 6: ఆరో సీజన్‌ నామినేషన్‌లో బిగ్ ట్విస్ట్.. ఆ టాస్క్ జరిగేది సోమవారం కాదట

  |

  బుల్లితెర చరిత్రలోనే బ్రహ్మాండమైన రీతిలో ప్రేక్షకుల స్పందనను దక్కించుకుని తిరుగులేని షోగా దూసుకుపోతోంది బిగ్ బాస్. ఇండియాలోని మిగిలిన భాషల కంటే ఎక్కువ రెస్పాన్స్‌తో దూసుకుపోతోన్న ఈ తెలుగు రియాలిటీ షో... విజయవంతంగా సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ ముందుకు సాగుతోంది. దీంతో నిర్వహకులు కూడా రెట్టించిన ఉత్సాహంతో కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే త్వరలోనే బిగ్ బాస్ ఆరో సీజన్‌ను మొదలు పెట్టబోతున్నారు. ఇందులో నామినేషన్స్ టాస్కును పూర్తిగా మార్చేసినట్లు ఓ న్యూస్ తాజాగా బయటకు వచ్చింది. అంతేకాదు, దీన్ని సోమవారం కాకుండా మరో రోజుకు మార్చారట. అసలేం జరిగింది? ఆ పూర్తి వివరాలు మీకోసం!

  ఆరో సీజన్‌కు రంగం సిద్ధంగానే

  ఆరో సీజన్‌కు రంగం సిద్ధంగానే

  బిగ్ బాస్ షో ఇండియాలోనే ఎన్నో భాషల్లో ప్రసారం అవుతోంది. అయితే, తెలుగులో మాత్రమే దీనికి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. అందుకే ఇప్పటికే ఈ షో ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్‌ను కంప్లీట్ చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో దానిని కూడా సెప్టెంబర్ 4వ తేదీ నుంచి ప్రారంభించబోతున్నారు. దీనిని కూడా కింగ్ నాగార్జునే హోస్ట్ చేయబోతున్నారు.

  పాయల్‌ను ఏమీ లేకుండా చూపించమన్న నెటిజన్: ఆ ఫొటో షేర్ చేయడంతో షాక్

  బాగా పెరిగిపోయిన అంచనాలు

  బాగా పెరిగిపోయిన అంచనాలు

  సాధారణంగా బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ప్రారంభం అవుతుందంటే ఎంతటి హడావిడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే త్వరలోనే మొదలు కాబోతున్న ఆరో సీజన్ గురించి దాదాపు మూడు నెలల నుంచే ఎన్నో రకాల వార్తలు రావడంతో దీనిపై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే దీని నుంచి విడుదలైన ప్రోమోల వల్ల అవన్నీ రెట్టింపు అయ్యాయి.

  వైభవంగా ప్రీమియర్ ఎపిసోడ్

  వైభవంగా ప్రీమియర్ ఎపిసోడ్

  అంగరంగ వైభవంగా ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ ఆరో సీజన్‌ కోసం నిర్వహకులు ఎప్పటి నుంచో పనులను ప్రారంభించారు. అందుకు అనుగుణంగానే అన్నింటినీ త్వరగానే పూర్తి చేసుకున్నారు. ఇక, ఈ సీజన్‌ ప్రీమియర్ ఎపిసోడ్‌ను సెప్టెంబర్ 4వ తేదీన సాయంత్రం 6 గంటల నుంచి ప్రసారం చేయనున్నారు. ఇప్పుడు నిర్వహకులు దీనిపైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు.

  హాట్ షోలో హద్దు దాటిన దివి: ఏకంగా స్నానం చేస్తోన్న పిక్ వదలడంతో!

  ఏకంగా 21 మంది కంటెస్టెంట్లు

  ఏకంగా 21 మంది కంటెస్టెంట్లు

  ఎన్నో అంచనాల నడుమ మొదలు కాబోతున్న బిగ్ బాస్ ఆరో సీజన్‌కు సంబంధించిన కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియను నిర్వహకులు ఎప్పుడో మొదలు పెట్టారు. ప్రారంభంలో ఆన్‌లైన్ ద్వారా ఇంటర్వ్యూలు చేశారు. తర్వాత నేరుగా మాట్లాడి వాళ్లతో ఒప్పందాలు చేసుకున్నారు. ఇలా ఆరో సీజన్ కోసం ఏకంగా 21 మంది కంటెస్టెంట్లను ఎంపిక చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది.

  బిగ్ బాస్‌ షోలో అదే ప్రత్యేకంగా

  బిగ్ బాస్‌ షోలో అదే ప్రత్యేకంగా

  బిగ్ బాస్ షో మొత్తంలో ఎలిమినేషన్ ఎంతో ప్రధానమైనది. దాని ఆధారంగానే షో నడుస్తుంది. కాబట్టి కంటెస్టెంట్లను ఎలిమినేషన్ జోన్‌లోకి తీసుకొచ్చే నామినేషన్ టాస్క్ ఇంకా ముఖ్యమైనది. ప్రతి సోమవారం నిర్వహించే ఈ టాస్క్‌ ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతోంది. గత సీజన్లతో పోలిస్తే ఈ సారి నామినేషన్స్ టాస్క్ పెట్టినప్పుడల్లా ఏదో ఒక గొడవ జరగడంతో రంజుగా సాగుతోంది.

  బట్టలు లేకుండా స్టార్ హీరోయిన్: డెలివరీ అయిన వెంటనే ఘోరంగా!

  ఆ టాస్కుపై సరికొత్త నిర్ణయం

  ఆ టాస్కుపై సరికొత్త నిర్ణయం

  బిగ్ బాస్ ఆరో సీజన్‌పై అంచనాలు తారాస్థాయికి చేరుకుంటోన్నాయి. దీనికితోడు దీని నుంచి మరిన్ని ఆసక్తికరమైన వార్తలు బయటకు వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఆరో సీజన్‌లో జరిగే నామినేషన్స్ ప్రక్రియలో పూర్తిగా మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీన్ని మరింత రంజుగా మార్చేందుకు సరికొత్త వ్యూహాలను అమలు చేయబోతున్నట్లు బుల్లితెర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

  సోమవారం కాదు.. ఆరోజేనట

  సోమవారం కాదు.. ఆరోజేనట

  సాధారణంగా బిగ్ బాస్ షోలో నామినేషన్స్ ప్రక్రియ సోమవారం రాత్రి ప్రసారం అయ్యే ఎపిసోడ్‌లో నామినేషన్స్ ప్రక్రియ జరుగుతుంది. కానీ, ఆరో సీజన్‌లో మాత్రం దీన్ని సోమవారం చూపించడం లేదట. అంతేకాదు, ఈ టాస్కును బుధవారం ప్రసారం చేయబోతున్నారట. వీక్ డేస్‌లో దీనికి ఆదరణ తగ్గుతోన్న కారణంగానే నిర్వహకులు ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్.

  English summary
  Bigg Boss Telugu 6th Season Will Starts From September 4th. This Show Makers Changes Nomination Task for Upcoming Season.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X