దేనికైనా రెడీ.. బిగ్‌బాస్ బ్యూటీ ఓపెన్ ఆఫర్
ఒక్కసారి హీరోయిన్ అయితే చాలు దశ మారిపోతుందని చాలా మంది యంగ్ బ్యూటీ భావిస్తారు. అయితే.. అవకాశం వచ్చిన హీరోయిన్ గా రాణించడం అంత ఈజీ కాదు. ఓ హీరోయిన్ గా ఇండస్ట్రీలో నిలదొక్కకోవడం అంటే.. మనం అనుకున్న పాత్ర రాకున్నా.. పాత్ర ఇష్టం లేకున్నా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. లేదంటే మరుసటి రోజు వారి స్థానంలో మరో హీరోయిన్ ఉంటుంది. ఈ క్రమంలో ఓ బిగ్ బాస్ బ్యూటీ ఎలాంటి పాత్ర అయినా చేయడానికి సిద్దం అంటూ ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చింది. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరు?
దేనికైనా రెడీ సిద్దమంటున్న ఆ బ్యూటీ ఎవరో కాదు.. బిగ్ బాస్ ఫేమ్ నైనికా అనసురు(Nainika Anasuru).ఈ అమ్మడు డ్యాన్సర్‌గా గుర్తింపు తెచ్చుకున్న తరువాత తెలుగు బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్‌లోనూ పాల్గొంది. ఈ రియాల్టీ షో ద్వారా మరింత ఫేమ్ సొంతం చేసుకుంది. బిగ్ బాస్ హౌజ్ లో టాస్కులు పూర్తి చేస్తూ ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. అంతకు ముందు నుంచే సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించిన నైనికా, తన కొరియోగ్రఫీ, ఢీ వంటి షోల్లో డ్యాన్స్ ప్రదర్శనలతో మెప్పించింది. అలాగే 2023లో వచ్చిన 'పిల్లా పడేసావే'టీవీ సీరీస్‌లో హీరోయిన్‌గా నటించి నటిగా కూడా గుర్తింపు పొందింది.

తాజాగా, జబర్దస్త్ వర్ష హోస్ట్ చేస్తున్న సెలబ్రిటీ టాక్ షో 'కిస్సిక్'లో పాల్గొంది నైనికా. ఈ తరుణంలో ఈ బ్యూటీ తన జీవితంలో ఎదురైన అనుభావాలను పంచుకుంది. ఈ షోలో ప్రముఖ బుల్లితెర, వెండితెర నటులు తమ వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ వస్తుండగా, నైనికా కూడా తన లైఫ్ గురించి ఓపెన్‌గా మాట్లాడింది. కెరీర్‌లో అనుభవించిన బాధలను పంచుకుంది.
నైనికా తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను ఓపెన్‌గా పంచుకుంది. ప్రస్తుతం తాను మానసికంగా, శారీరకంగా చాలా హెల్తీగా ఉన్నానని, మైండ్ హెల్తీగా ఉంటే అందంగానూ కనిపిస్తామని చెప్పింది. పెళ్లికి ఇంకా సమయం ఉందని, కొరియోగ్రఫీతో పాటు నటిగాను రాణించాలని అనుకున్నా, కొన్ని పరిస్థితుల వల్ల ఆ దారి వదిలేశానని తెలిపింది. బిగ్ బాస్ హౌజ్‌లో తనకు బిగ్గెస్ట్ హార్ట్ బ్రేక్ ఎదురైందని, ప్రేమ పేరుతో మోసం చేసిన వాళ్లపై కఠిన వ్యాఖ్యలు చేసింది. "దేవుడు చూస్తున్నాడు, కర్మ తప్పదు. నన్ను మోసం చేసిన వాళ్లు ఎవ్వరూ సంతోషంగా లేరు" అని చెప్పింది.
అలాగే, ఒక సమయంలో తన మాట ఎవరూ వినడం లేదనే ఆవేదనతో సూసైడ్ అటెంప్ట్ చేసిన విషయాన్ని బయట పెట్టింది. కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ, కొందరు తన ఫోటోలను రేట్‌తో వెతుకుతున్నారని విని షాక్ అయ్యానని తెలిపింది. అలాంటి వారు చిన్న పిల్లల నుండి ముసలివాళ్లవరకు ఎవరినీ వదలరని ఆవేదన వ్యక్తం చేసింది. తన చిన్ననాటి కష్టాల గురించి మాట్లాడుతూ, "మా డాడీ మాతో లేరు. చిన్నప్పటి నుంచే అమ్మే అన్నీ చూసుకుంది. ఆయనతో పడలేక అమ్మ సెపరేట్‌గా ఉంటుంది" అని చెప్పింది.
యాంకర్ వర్ష డాన్సర్ నైనా తో మాట్లాడుతూ.. 'మీకు హీరోయిన్ గా ఛాన్స్ వస్తే నటిస్తారా? ' అని ప్రశ్నించింది. అందుకు నైనిక తప్పకుండా అంటూ బదులిచ్చింది. 'ఆ మూవీలో లిప్ లాక్ సీన్స్ ఉన్నాయని చెబితే ఒప్పుకుంటారా? ' అని మరలా తిరిగి ప్రశ్నించింది. ఆ సినిమాను బట్టి, ఆ సందర్భాన్ని బట్టి లిప్ లాక్ ఉంటే.. ఓకే చెప్తా'అంటూ స్టాండింగ్ రిప్లై ఇచ్చింది. దీంతో అవాక్కైనా వర్ష రొమాంటిక్ సీన్ ఓకే.. లిప్ లాక్ సీన్ ఓకేనా అని ప్రశ్నించగా.. అందుకు చిరు నవ్వుతో ఓకే అని చెప్పకనే చెప్పేసింది. ఆ తర్వాత వర్ష మరింత డోస్ పెంచేసి.. 'ఐటమ్స్ సాంగ్ ఆఫర్ వస్తే చేస్తావా?'అంటూ ప్రశ్నించింది. 'తప్పకుండా.. పక్క చేస్తా'అంటూ దిమ్మ తిరిగిపోయే ఆన్సర్ ఇచ్చింది. దీంతో షాక్ అయినా వర్ష ..'నైనిక దేనికైనా రెడీ'అంటూ స్టేట్మెంట్ పాస్ చేసింది. అయితే కండిషన్ అంటూ.. తనకి ఫీవర్ ఉన్నప్పుడు రావాలంటూ ఫన్నీ కామెంట్ చేసింది. ఈ వీడియో వైరల్ కావడంతో నిటిజన్లు తమ ఇష్టానుసారంగా కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











