For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అదిరిపోయే సర్‌ప్రైజ్ ప్లాన్ చేసిన బిగ్ బాస్: ఆ ముగ్గురి రీఎంట్రీ కోసమే ఈ ప్రయోగం.!

  By Manoj
  |

  ఎన్నో అనుమానాలు.. మరెన్నో ఊహాగానాల నడుమ ప్రారంభమై.. ఎవరూ ఊహించని స్థాయిలో ప్రజాదరణను అందుకుని నెంబర్ వన్ రియాలిటీ షోగా గుర్తింపు తెచ్చుకుంది బిగ్ బాస్. గతంలో ఎన్నడూ చూడని కంటెంట్‌తో రూపొందిన ఈ షో.. రికార్డులు బద్దలు కొడుతూ ఎన్నో మైలురాళ్లను అందుకుంది. ఈ క్రమంలోనే తెలుగులో ఏకంగా మూడు సీజన్లను సక్సెస్‌ఫుల్‌గా ముగించింది. ఇక, ఈ మధ్య మొదలైన నాలుగో సీజన్ సైతం మంచి రేటింగ్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ముగ్గురు కంటెస్టెంట్ల కోసం బిగ్ బాస్ సర్‌ప్రైజ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఆ వివరాలు మీకోసం.!

   గతంలో చూడని ప్రయోగాలతో

  గతంలో చూడని ప్రయోగాలతో

  మూడు సక్సెస్‌ఫుల్ సీజన్ల తర్వాత బిగ్ బాస్ షో ఇటీవల నాలుగో దానిని కూడా మొదలెట్టేసింది. ఎన్నో అంచనాల నడుమ ప్రారంభమైన ఈ సీజన్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. అదే సమయంలో అత్యధిక స్థాయిలో టీఆర్పీ సాధించి రికార్డులు క్రియేట్ చేస్తోంది. వీటన్నింటికీ కారణం.. గతంలో పోలిస్తే ఈ సీజన్‌లో కొత్తదనం చూపిస్తుండడమే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

  ముగ్గురినీ అప్పుడే దించేశారు

  ముగ్గురినీ అప్పుడే దించేశారు

  ప్రీమియర్ ఎపిసోడ్‌కు అదిరిపోయే రేటింగ్ రావడంతో పాటు షోపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. అలాంటి సమయంలో షో కాస్త నెమ్మదించింది. దీనిని అధిగమించేందుకు బిగ్ బాస్ నిర్వహకులు.. ముగ్గురు కంటెస్టెంట్లను (ముక్కు అవినాష్, కుమార్ సాయి, స్వాతి దీక్షిత్) వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి పంపించారు. వీళ్ల ఎంట్రీతో షో రేటింగ్ కొంత మేర పెరిగింది.

  సక్సెస్ కాని బిగ్ బాస్ వ్యూహం

  సక్సెస్ కాని బిగ్ బాస్ వ్యూహం

  ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం అయిన సమయంలో బిగ్ బాస్ రేటింగ్ తగ్గిపోయింది. సరిగ్గా అదే సమయంలో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంటర్ అయిన స్వాతి దీక్షిత్, కుమార్ సాయి కూడా ఎలిమినేట్ అయిపోయారు. వీరితో పాటు ప్రేక్షాదారణ ఉన్న కొందరు కంటెస్టెంట్లు కూడా బయటకు వెళ్లిపోవాల్సి వచ్చింది. దీంతో యూనిట్ వేసి ప్లాన్లు బిగ్ బాస్ షోను నిలబెట్టలేకపోయాయి.

  షోపై కమ్ముకున్న అనుమానం

  షోపై కమ్ముకున్న అనుమానం

  బిగ్ బాస్ అనేది రియాలిటీ షో కాదని, అభ్యర్థుల ఎంపిక నుంచి ఎలిమినేషన్ వరకు అన్నీ డైరెక్షన్ ప్రకారమే జరుగుతాయని ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. ఇక, ఈ సీజన్‌లో అవి రెట్టింపు అవ్వడంతో పాటు బిగ్ బాస్ ఓటింగ్ సిస్టమ్‌పై అనుమానాలు కూడా వస్తున్నాయి. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న దివి, దేవీ నాగవల్లి, కుమార్ సాయి ఎలిమినేషన్‌తో డౌట్స్ ఎక్కువయ్యాయి.

  సర్‌ప్రైజ్ ప్లాన్ చేసిన బిగ్ బాస్

  సర్‌ప్రైజ్ ప్లాన్ చేసిన బిగ్ బాస్

  బిగ్ బాస్ ఓటింగ్‌పై కొద్ది రోజులుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ విషయం నాగార్జున వరకూ వెళ్లడంతో, నేరుగా ఆయనే దీనిపై స్పందించారు. ఓటింగ్ రిజల్ట్‌ను థర్డ్ పార్టీ చూసుకుంటుందని తన సాక్షిగా చెప్పారాయన. అయినా దీనిపై అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రేక్షకుల మనసు మార్చేందుకు బిగ్ బాస్ భారీ సర్‌ప్రైజ్ ప్లాన్ చేసినట్లు సమాచారం.

  ఆ ముగ్గురి రీఎంట్రీ కోసమే ఇలా

  ఆ ముగ్గురి రీఎంట్రీ కోసమే ఇలా

  ఈ సీజన్‌లో ఇప్పటికే దాదాపు పది మంది వరకు ఎలిమినేట్ అయ్యారు. ఈ నేపథ్యంలో దివి, దేవీ నాగవల్లి, కుమార్ సాయి సహా మిగిలిన వాళ్లందరితో ఓ పోల్ నిర్వహించనున్నారట షో నిర్వహకులు. వారిలో ఎక్కవ ఓట్లు వచ్చిన ఇద్దరు కంటెస్టెంట్లను తిరిగి హౌస్‌లోకి పంపబోతున్నారని తాజా సమాచారం. రెండో సీజన్‌లో సైతం ఇలాంటి పరిణామమే జరిగిన విషయం తెలిసిందే.

  English summary
  Bigg Boss 4 Telugu Elimination: Bigg Boss Telugu TV show is currently in the seventh week. Noel. Monal, Abhijeet, Ariyana, Divi, and Avinash are in the nominations this week. Everyone was in the opinion that Monal or Ariyana would come out of the house. But, much to the shock, it is Divi who will be evicted from the show. The episode telecast will take place on Sunday.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X