Bigg Boss Non Stop లోగో రిలీజ్ చేసి డిస్నీ+హాట్ సర్‌ప్రైజ్.. ఓటీటీ షో ప్రారంభం ఎప్పుడంటే?
తెలుగు టెలివిజన్ పరిశ్రమలోని రియాలిటీ షోలో ఎంటర్‌టైన్‌మెంట్‌గా బాప్‌గా నిలిచిన బిగ్‌బాస్ తెలుగు షో సరికొత్త రూపంలో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్దమైంది. ఇప్పటి వరకు రోజు గంటసేపు మాత్రమే ప్రసారం చేసిన ఈ షోను ప్రేక్షకుల డిమాండ్ మేరకు 24 గంటలపాటు ఓటీటీ యాప్‌లో ప్రసారం చేయనున్నారు. తొలిసారి బిగ్‌బాస్ తెలుగు ఓటీటీని ప్రసారం చేసేందుకు అన్ని రకాలు ఏర్పాట్లు చేశారు. తెలుగులో ప్రసారం కాబోతున్న ఓటీటీ ఫార్మాట్ షోకు బిగ్‌బాస్ నాన్ స్టాప్ అని టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ షో ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది? ఎవరెవరు పాల్గోబోతున్నారనే విషయం గురించిన వివరాల్లోకి వెళితే..

తొలిసారి ఓటీటీలో బిగ్‌బాస్ తెలుగు
బిగ్‌బాస్ తెలుగు 5ను విజయవంతంగా పూర్తి చేసుకొన్న నేపథ్యంలో బుల్లితెర ప్రేక్షకులకు హోస్ట్ నాగార్జున శుభవార్తను అందించారు. త్వరలోనే బిగ్‌బాస్ తెలుగు షోను ఓటీటీలో 24 గంటలపాటు అందించే విధంగా ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. అంతేకాకుండా షో కంటెంట్‌ను మిస్ కాకుండా ప్రతీ క్షణం ఇంటిలోని సన్నివేశాలను అందించే ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

డిస్నీ హాట్‌స్టార్ సోషల్ మీడియాలో రిలీజ్
ఇప్పటి వరకు స్టార్ మా తెలుగు చానెల్‌లో బిగ్‌బాస్ తెలుగు షో హైలెట్స్ ప్రసారం చేశారు. కానీ ఇక నుంచి బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షోను డిస్నీ+హాట్ స్టార్ ఓటీటీ యాప్‌లో అధికారికంగా ప్రసారం కానున్నది. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ నాన్ స్టాప్ షో లోగోను అధికారికంగా విడుదల చేసి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని చెప్పారు. దాంతో బిగ్‌బాస్ అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచారు.

ఆకర్షణీయంగా బిగ్‌బాస్ నాన్‌స్టాప్ లోగో
ఓటీటీ ఫార్మాట్‌లో స్ట్రీమింగ్ కాబోతున్న బిగ్‌బాస్ నాన్ స్టాప్ లోగోను డిస్నీ+హాట్‌స్టార్ తెలుగు సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా విడుదల చేసింది. నీలం రంగు కన్నులో ఎరుపు రంగు కనుగుడ్డుతో ప్రత్యేకంగా లోగోను డిజైన్ చేశారు. కన్ను కింద బిగ్‌బాస్ నాన్ స్టాప్ అంటూ లోగోను ఆకర్షణీయంగా తీర్చి దిద్దారు. సరికొత్త వినోదానికి తెర తీశారు.

ఫిబ్రవరి 27న ఓటీటీ షో స్ట్రీమింగ్
ఇక బిగ్‌బాస్ నాన్ స్టాప్ షోకు హోస్ట్‌గా అక్కినేని నాగార్జున వ్యవహరించనున్నారు. ఇప్పటికే హోస్ట్‌గా వ్యవహరించనున్నట్టు బంగార్రాజు మూవీ ప్రమోషన్స్‌లో స్పష్టం చేశారు. ఇక ఎండెమాల్ షైన్ ఇండియా నిర్వాహకులు, డిస్నీ +హాట్ స్టార్ నిర్వాహకులు తెలిపిన ప్రకారం బిగ్‌బాస్ నాన్ స్టాప్ షో ఫిబ్రవరి 27న ప్రారంభం కానున్నట్టు తెలిసింది.

బిగ్‌బాస్ ఓటీటీలో కంటెస్టెంట్ల పేర్లు ఇవే..
ఇక బిగ్‌బాస్ నాన్ స్టాప్ షోలో పాల్గొనే సెలబ్రిటీల పేర్లు మీడియాలో వైరల్ అవుతున్నాయి. గేమ్ ఫార్మాట్ ప్రకారం ఈ షోలోకి గత బిగ్‌బాస్ తెలుగు షోకు సంబంధించిన ఐదు సీజన్లతో పాల్గొన్న సెలబ్రిటీలను నాన్ స్టాప్ షోలోకి తీసుకు వస్తున్నారు. ఇప్పటికే శ్రీముఖి, వింధ్యా, అఖిల్ సార్థక్, మెహబూబ్, మోనాల్ గజ్జర్ లాంటి సెలబ్రిటీలు ఈ షోలో పాల్గొనేందుకు సిద్ధమైనట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











