For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Non Stop: అతడిపై ఎదురు తిరిగిన కంటెస్టెంట్లు.. కంప్లైంట్ చేయడంతో ఇంట్లో నుంచి ఔట్

  |

  చాలా అనుమానాలు.. ఊహాగానాల నడుమ తెలుగు బుల్లితెరపైకి వచ్చినా.. వాటన్నింటికీ పుల్‌స్టాప్ పెట్టేలా ప్రేక్షకుల మన్ననలు అందుకున్న షో బిగ్ బాస్. కొత్త కొత్త గేమ్‌లతో సాగే ఈ కార్యక్రమం ఆద్యంతం ఆకట్టుకునే విధంగా సాగుతోంది. దీంతోపాటు గొడవలు, కొట్లాటలు, లవ్వాటలు, రొమాన్స్ ఇలా ఎన్నో రకాల ఎమోషన్స్‌ను కూడా ఇందులో చూపిస్తుంటారు. దీంతో ఎప్పుడు ప్రసారం అయినా ఆసక్తికరంగా మారుతుంటుంది. అందుకే సీజన్ల మీద సీజన్లను పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌ను స్టార్ట్ చేశారు. తాజాగా ఇందులో కొందరు కలిసి ఓ కంటెస్టెంట్‌తో గొడవకు దిగారు. దీంతో అతడికి బిగ్ బాస్ శిక్ష విధించాడు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  24 గంటలూ వినోదమే వినోదం

  24 గంటలూ వినోదమే వినోదం

  అన్ని భాషలతో పోలిస్తే తెలుగులో వచ్చే బిగ్ బాస్‌కు మాత్రమే భారీ రెస్పాన్స్ దక్కుతోంది. ఇక, ఇప్పుడు ఓటీటీ వెర్షన్ కూడా అదే రీతిలో స్పందను అందుకుంటోంది. అందుకు అనుగుణంగానే ఇది ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగుతోంది. గతంలో మాదిరిగా కాకుండా ఈ సీజన్ 24 గంటలూ ప్రసారం అవుతూ వినోదాన్ని పంచుతోన్న నేపథ్యంలో మరింత ఆదరణ దక్కుతోంది.

  బ్రాతో యాంకర్ వర్షిణి అందాల విందు: ఆమెను ఈ ఘాటు ఫోజుల్లో చూశారంటే!

  17 మంది ఎంట్రీ... ఒకరు ఔట్

  17 మంది ఎంట్రీ... ఒకరు ఔట్


  భారీ అంచనాలతో మొదలైన బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్‌లోకి అషు రెడ్డి, మహేశ్ విట్టా, ముమైత్ ఖాన్, అజయ్ కుమార్, స్రవంతి చొక్కారపు, ఆర్జే చైతూ, ఆరియానా గ్లోరీ, నటరాజ్ మాస్టర్, శ్రీ రాపాక, అనిల్ రాథోడ్, మిశ్రా శర్మ, తేజస్వీ మదివాడ, యాంకర్ శివ, సరయు రాయ్, బిందు మాధవి, హమీదా ఖతూన్, అఖిల్ సార్థక్‌లు కంటెస్టెంట్లుగా వచ్చారు. ఇందులో ముమైత్ ఎలిమినేట్ అయింది.

  రెండు గ్రూపుల మధ్య ఫైటింగ్

  రెండు గ్రూపుల మధ్య ఫైటింగ్

  బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్‌లోకి కొత్త వాళ్లతో పాటు మాజీ కంటెస్టెంట్లు కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇందులో గత సీజన్లలో పాల్గొన్న వాళ్లను వారియర్స్ అని.. కొత్త వాళ్లను చాలెంజర్స్ అని రెండు గ్రూపులుగా విభజించారు. వీళ్లకు పోటాపోటీగా టాస్కులు ఇస్తున్నారు. దీంతో ఈ రెండు గ్రూపుల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా గేమ్ నడుస్తోంది. ఫలితంగా షో ఆద్యంతం రంజుగా సాగుతోంది.

  Rashmika Mandanna: గ్లామర్ కంచె తెంచేసిన శ్రీవల్లి.. బౌండరీ దాటేసి మరీ ఘాటుగా!

  రెండో వారం ఏం జరిగిందంటే

  రెండో వారం ఏం జరిగిందంటే


  రెండో వారానికి సంబంధించిన కెప్టెన్సీ కంటెండర్ల ఎంపిక కోసం కంటెస్టెంట్లకు బిగ్ బాస్ 'తగ్గేదేలే' అనే టాస్కును ఇచ్చాడు. ఇందులో స్మగ్లర్లు, పోలీసులుగా మారి రెండు రౌండ్లను పూర్తి చేశారు. ఇందులో చాలెంజర్స్ టీమ్ విజయం సాధించింది. ఇక, ఆ తర్వాత జరిగిన కెప్టెన్సీ టాస్కులో అనిల్ రాథోడ్ విజయం సాధించాడు. తద్వారా ఇంటికి రెండో కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

  బెస్ట్ కంటెస్టెంట్‌గా ఆర్జే చైతూ

  బెస్ట్ కంటెస్టెంట్‌గా ఆర్జే చైతూ


  బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో రెండో వారానికి సంబంధించి జరిగిన అన్ని టాస్కులను పరిగణలోకి తీసుకుని ఉత్తమ, చెత్త కంటెస్టెంట్ల‌ను ఎంపిక చేయాల్సిందిగా కంటెస్టెంట్లు అందరికీ బిగ్ బాస్ సూచించాడు. ఇందులో చాలా చర్చలు జరిపిన తర్వాత బెస్ట్ పెర్ఫార్మర్‌గా ఆర్జే చైతూను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దీంతో బిగ్ బాస్ అతడిని అభినందించాడని సమాచారం.

  Bigg Boss Non Stop: ఆ లేడీ కంటెస్టెంట్ అసభ్య ప్రవర్తన.. బట్టలిప్పి చూపిస్తానంటూ మొత్తం తీసేసిందిగా!

  అతడికి కఠిన శిక్ష వేసిన బాస్

  అతడికి కఠిన శిక్ష వేసిన బాస్


  బెస్ట్ కంటెస్టెంట్‌ను ఎంపిక చేసిన తర్వాత.. రెండో వారానికి సంబంధించి చెత్త ఆటగాడి పేరును చెప్పాల్సిందిగా బిగ్ బాస్ చెప్పాడు. ఇందులో చాలా మంది బిందు మాధవికి, మహేశ్ విట్టాకు ఓట్ చేశారట. అందులో మహేశ్‌కే ఎక్కువ ఓట్లు ఉండడంతో అతడిని బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న జైలుకు పంపించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక, ఈ ప్రాసెస్‌లో కొన్ని గొడవలు జరిగాయట.

  English summary
  Bigg Boss Telugu Non Stop OTT First Season Running Successfully. Now This Season First Week Best and Worst Performers Are Selected.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X