twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Non Stop: చైతూ చెత్త స్ట్రాటజీ.. పిలక లేదంటూ టాస్క్ లో లొల్లి.. మాస్టర్ ఏడుపులు!

    |

    బిగ్బాస్ అంటేనే కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గతంలో టీవీలో ప్రసారమయ్యే టప్పుడు సెన్సార్ తరువాత ప్రసారమయ్యేది కానీ ఇప్పుడు ఓటీటీ మాత్రం నాన్ స్టాప్ గా సెన్సార్ లేకుండా బోల్డ్ గా ఎంటర్టైన్మెంట్ అందించే విధంగా సరికొత్తగా మొదలుపెట్టారు. ఈసారి ఎప్పుడు ఎవరు నోరు జారతారో చెప్పడం కష్టమే. ఇప్పటివరకు అయితే ఎవరు అదుపుతప్పి పెద్దగా ప్రవర్తించలేదు. కానీ స్ట్రాటజీ పేరుతో కొంతమంది చాలా చెత్తగా వ్యవహరిస్తున్నారని కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. రీసెంట్ గా వారియర్స్ వర్సెస్ చాలెంజర్స్ కు మధ్య జరిగిన ఛాలెంజ్ లో చైతు వ్యవహరించిన తీరు అందరినీ ఆశ్చర్య పరిచింది.. లేటెస్ట్ గా విడుదలైన ప్రోమో పై ఒక లుక్కేస్తే..

    ముందు స్నేహాన్ని పెంచి..

    ముందు స్నేహాన్ని పెంచి..

    బిగ్ బాస్ నాన్ స్టాప్ షో మొదలైనప్పుడు కాస్త నీరసంగానే స్టార్ట్ అయ్యింది. ఇక బిగ్ బాస్ కూడా టాస్క్ ల విషయంలో ఇంకా అనుకున్నంతగా డోస్ అయితే పెంచలేదు. వీలైనంత వరకు కంటెస్టెంట్స్ మధ్యలో స్నేహాన్ని పెంచి ఆ తరువాత గొడవలు క్రియేట్ చేయాలని చూస్తున్నట్లు అర్ధమవుతోంది. ఇక ప్రస్తుతం కొనసాగుతున్న టాస్క్ లు కూడా అదే రూట్లో వెలుతున్నాయి.

    నటరాజ్ ఓవరాక్టింగ్

    నటరాజ్ ఓవరాక్టింగ్

    ఇక నటరాజ్ మాస్టర్ మరోసారి నలుగురిలో తన వీక్ నెస్ పాయింట్ తో నవ్వులపాలవుతున్నారు. గతంలో బిగ్ బాస్ కూడా ఆయన రొటీన్ గానే ఫ్యామిలీ విషయాలను చెప్పుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ఇక ఇప్పుడు మరోసారి తన పాపను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ గా లో ఏడుస్తూ కనిపిస్తున్నాడు. ఒక విధంగా మిగతా వారికి అది ఓవర్ యాక్టింగ్ లా అనిపిస్తున్నట్లు అర్ధమయ్యింది.

    అజయ్ సెటైర్..

    అజయ్ సెటైర్..

    ప్రతీసారి నటరాజ్ మాస్టర్ తన పాపను వదిలేసి వచ్చినట్లు చెప్పగా.. ఇక్కడ ప్రతీ ఒక్కరు కూడా వారి ఫ్యామిలిస్ ను వదిలేసి వచ్చినవారే అని శ్రవంతి మిగతా వారికి చెప్పుకుంది. ఇక నటరాజ్ ఒకవైపు ఏడుస్తుంటే ఆ ఆట నేర్చుకోవాలి.. చాలా ఈజీగా ఏడవడం నేర్చుకోవాలని అజయ్ సెటైర్ వేశాడు. ఇక యాంకర్ శివ అయితే ఆయనను చూస్తే తనకు జాలేస్తోందని అన్నాడు.

    మూడవ డేర్ లో..

    మూడవ డేర్ లో..

    ఇక బిగ్ బాస్ ఇచ్చిన మూడవ డేర్ లో ఛాలెంజర్లు 15 నిమిషాల్లో కొబ్బరి కాయలు పీచును తియ్యాల్సి ఉంటుంది. ఇక మొదట ఆ టాస్క్ ఫినిష్ చేసేందుకు వచ్చిన మహేష్ విట్టా బాగానే ట్రై చేశాడు. ఇక అతన్ని టీమ్ మెంబర్లు కూడా బాగానే ఉత్తేజపరిచారు.

    చైతు పిలక లాజిక్

    కానీ సంచాలకుడిగా ఉన్న వారియర్ టీమ్ లోని RJ చైతు మాత్రం ఒక చెత్త లాజిక్ తో స్ట్రాటజీ స్టార్ట్ చేసినట్లు అర్ధమయ్యింది. ఒక కొబ్బరి కాయకు పిలక ఉంచకుండా మొత్తం తీసేయ్యడం ఎక్కడా ఉండదని లాజిక్ తో పాయింట్ మైనస్ చేసే ప్రయత్నం చేయగా దాని కోసం ఛాలెంజర్లు బాగానే గొడపడ్డారు. ఇక అది గుడిలో మాత్రమే అని ఇక్కడ బిగ్ బాస్ పీచు మాత్రమే తీయాలని అన్నట్లుగా నటరాజ్ మాస్టర్ అఖిల్ కూడా మరో లాజిక్ మాట్లాడారు.

    సంచాలకుడిదే తుది నిర్ణయం..

    సంచాలకుడిదే తుది నిర్ణయం..

    ఇక మహేష్ టీమ్ మెంబర్స్ ఎంత చెబుతున్నా కూడా చైతు పట్టించుకోలేదు. సంచాలకుడిదే తుది నిర్ణయం అంటూ తనకు పిలక ఉండాల్సిందే అని అన్నాడు. ఇక ఆ తరువాత టీమ్ మెంబర్స్ అందరూ కూడా ఇది కావాలని చేసిన ఫ్రాడ్ గేమ్ అని మాట్లాడుకున్నారు. అనంతరం అఖిల్ ముమైత్ ఖాన్ కూడా చైతూతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇక చివరికి అఖిల్ చిరాకుతో పక్కకు వెళ్లిపోవడంతో చైతూ నాట్ ఫెయిర్ అంటూ కౌంటర్ కూడా ఇచ్చాడు. చూస్తుంటే మళ్ళీ హౌజ్ లో వాతావరణం వేడెక్కినట్లు తెలుస్తోంది. మరి ఈ డేర్ ఛాలెంజ్ లో బిగ్ బాస్ ఎలాంటి తీర్పును ఇస్తాడో చూడాలి.

    English summary
    Bigg Boss Non Stop RJ chaithu game strategy in third dare challenge
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X