For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Non Stop: మోనాల్ అఖిల్ బంధంపై సెటైర్.. గెలవకపోవడానికి కరణం అదే అంటూ

  |

  తెలుగులో కూడా బిగ్గెస్ట్ రియాల్టీ షో గా మంచి క్రేజ్ అందుకుంటున్న బిగ్ బాస్ షో టెలివిజన్ నుంచి OTT వరకు వచ్చిన విషయం తెలిసిందే. టెలివిజన్లో అయితే మంచి రేటింగ్స్ అందుకున్న ఈ రియాలిటీ షో డిజిటల్ ప్లాట్ ఫామ్ లో కూడా అదే తరహాలో సక్సెస్ అవుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే అసలు ఈ షోకి జనాలు ఎట్రాక్ట్ అవుతున్నారా లేదా అనే విషయం కాస్త సందేహంగానే ఉంది. ఇక ఈ షో వారం రోజులు కాకముందే లైవ్ స్ట్రీమింగ్ ఆగిపోవడం విశేషం. గురువారం నుంచి మళ్లీ ఎప్పటి తరహాలోనే లైవ్లో కొనసాగుతుంది అని చెబుతున్నారు. చివరి కెప్టెన్సీ టాస్క్ కోసం కంటెస్టెంట్స్ అందరూ కూడా పోటాపోటీగా సిద్ధమవుతున్నారు. రీసెంట్ గా విడుదలైన ప్రోమో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక సారి ఆ వివరాల్లోకి వెళితే..

  లైఫ్ స్ట్రీమింగ్.. కన్ఫ్యూజన్

  లైఫ్ స్ట్రీమింగ్.. కన్ఫ్యూజన్

  బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదలయ్యి ఇంకా వారం రోజులు కూడా కాలేదు కానీ అప్పుడే లైవ్ స్ట్రీమింగ్ విషయంలో నిర్వాహకులు కన్ఫ్యూజన్ కి గురి చేయడం విశేషం. మరింత ఎంటర్టైన్మెంట్ అందించే విధంగా లైవ్ స్ట్రీమింగ్ ఆప్ చేయడం జరిగింది అని మళ్లీ గురువారం అర్ధరాత్రి నుంచి ఎప్పటిలానే లైవ్ షో కొనసాగుతుంది అని చెబుతున్నారు. ఈ విషయంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో అనేక రకాల కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

  కంటెస్టెంట్స్ పై ప్రశ్నలు

  కంటెస్టెంట్స్ పై ప్రశ్నలు

  ఇక చివరి కెప్టెన్సీ టాస్క్ కోసం కంటెస్టెంట్స్ అందరూ కూడా పోటా పోటీగా పోరాడేందుకు సిద్ధమయ్యారు. అందరూ కంటెస్టెంట్స్ కూడా ముందుగా ఒకరి అభిప్రాయాలను మరొకరు తెలుసుకోవడానికి రైస్ హ్యాండ్స్ అని చాలెంజ్ ను ఇవ్వడం జరిగింది. అయితే ముందుగా చేతులెత్తే ట్యాగ్ తో ఎదురుగా నిలబడిన వారిని వారికి నచ్చిన ప్రశ్నలు అడగవచ్చు. ఇక మొదట తేజస్వి మదివాడ రాగా ఎప్పటిలానే యాంకర్ శివ డిఫరెంట్గా అడిగే ప్రయత్నం చేశాడు.

   తోలు తీస్తాను..

  తోలు తీస్తాను..

  హౌస్ లో మీరు ఎవరిని నమ్మడం లేదా అని యాంకర్ శివ అడగగా నమ్మకుండా కొంతమంది ఉన్నారు అని తేజస్వి చెప్పింది. అయితే మళ్ళీ యాంకర్ శివకు తేజస్వి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసి పేర్లు చెప్పమని అడిగితే తోలు తీస్తాను అని ముందుగానే ఊహించి చెప్పింది. ఇక లాస్ట్ టైం తాను బిగ్ బాస్ లోకి పిక్నిక్ మాత్రమే వచ్చాను మధ్యలో ఎవరైనా వస్తే గట్టిగా అరిచి చేశాను కానీ ఈ సారి మాత్రం నేను పిక్నిక్ కి రాలేదు. అని తేజస్వి చెప్పింది.

  మోనాల్ తో ఉన్న సంబంధం

  మోనాల్ తో ఉన్న సంబంధం

  ఇక ఈసారి గేమ్ ఆడడానికి వచ్చావా అని అడగడంతో లేదురా సరదాగా ఇల్లు ఊడ్చేసి వెళ్లిపోవడానికి వచ్చాను అంటూ అరియానా సెటైర్ వేసింది. ఇక అఖిల్ తన గురించి చెబుతూ లాస్ట్ సీజన్ లో నేను విన్ అవ్వడానికి ఒక స్టేట్ బ్యాక్ అయింది కేవలం నా స్మైల్ అని చెప్పాడు. కానీ బయట అనుకుంటుంది మాత్రం మోనాల్ తో ఉన్న బాండింగ్ అని శివ కౌంటర్ ఇచ్చాడు.

   క్యారెక్టర్ ను బ్యాడ్ చేసి..

  క్యారెక్టర్ ను బ్యాడ్ చేసి..

  ఇక మహేష్ హౌస్ లో జరిగే మోసాల గురించి చెప్పాడు. మిగతా కంటేస్తెంట్స్ ఒక వారం ఎక్కువగా సర్వైవ్ అవ్వడానికి ఒకడిని పట్టుకొని వాడు ఫ్లోలో ఏదో ఒకటి అంటే దాన్ని కావాలని హైలెట్ చేసి వాడి క్యారెక్టర్ ను బ్యాడ్ చేసి వాడు చీప్ అని చెప్పి వాన్ని సం** నాకించేసి వాడిని బయటకు పంపేశాస్తారు అని చెప్పాడు.

  మూడు కాళ్ల తాబేలు

  ఇక బిగ్ బాస్ ఈ వారం కెప్టెన్సీ కోసం చివరగా పోటీ దారులకు ఇచ్చిన టాస్క్ వింత వస్తువులు అని అషు రెడ్డి చెప్పింది. ఇక ఈ పోటీలో హోరాహోరీగా బజర్ నొక్కడానికి కంటెస్టెంట్స్ గట్టిగానే ప్రయత్నాలు చేశారు. ఇక బాత్రూమ్ కామెడీతో శ్రీరాపాక నటరాజ్ మాస్టర్ ఇద్దరు కూడా హైలెట్ గా నిలిచారు. మూడు కాళ్ల తాబేలు అని టీవీలో కనిపించడంతో బయట ఉన్న టబ్స్ లో వాటిని కనుగొనేందుకు కంటెస్టెంట్స్ గట్టిగానే ట్రై చేశారు.

  చీటింగ్ గేమ్..

  చీటింగ్ గేమ్..

  ఇక చివరగా బజర్ మ్రోగే సమయంలో ముందుగా బటన్ పై చైతు చేయి పెట్టి ఉంచి నొక్కేశాడు. అయితే ఆ విషయంలో అషు రెడ్డితో ఇది చీటింగ్ అంటూ విభేదించింది. మేము నిలబడి ఉంటే నువ్వు ముందే బటన్ పై చేయి పెట్టావు అని అంటుంది. ఇక ఆ సమయంలో మహేష్ వచ్చి కూడా చైతూ గేమ్ పై విభేదిస్తాడు. మరి ఈ పరిణామాలతో ఎలాంటి గొడవలు జరుగుతాయో చూడాలి.

  English summary
  Bigg boss non stop telugu latest promo anchor shiva comments on akhil monal bonding
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X