For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Non Stop: ఉగాది రోజు స్పెషల్ గెస్ట్.. ఏప్రిల్ ఫూల్ అయిన బిందుమాధవి.. ఉమ్మేసిన ముమైత్

  |

  బిగ్ బాస్ నాన్ స్టాప్ లో ఉగాది హడావుడి గట్టిగానే కనిపించింది. ఇక కంటెస్టెంట్స్ అందురు కూడా ట్రెడిషనల్ డ్రెస్ లలో ముస్తాబై ఆనందంగా కనిపించారు. రోజు టాస్క్ లలో భాగంగా గొడవలు పడే విషయాన్ని మర్చిపోయి చాలా సంతోషంగా పండగను సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక హౌస్ లోకి ఒక స్పెషల్ గెస్ట్ రావడం కూడా జరిగింది. ఆ గెస్ట్ వచ్చి రావడంతోనే తనదైన శైలిలో పంచ్ లు వేస్తూ ఎంతగానో ఆకట్టుకున్నారు. ఇక అందుకు సంబంధించిన ప్రోమో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒకసారి ఆ వివరాల్లోకి వెళితే..

  ఉగాది స్పెషల్

  ఉగాది స్పెషల్

  ముందుగా ఉగాది పండగ సందర్భంగా బిగ్ బాస్ కు అలాగే ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలిపిన కంటెస్టెంట్స్ కలిసి కట్టుగా ఉగాది పచ్చడి కలిసి చేసుకున్నారు. అనంతరం అఖిల్ సార్ధక్ వచ్చి పండగ రోజు అందరికి గిఫ్ట్స్ వచ్చాయని చెప్పాడు. ఇక ముమైత్ ఖాన్ బిందు మాధవి అలాగే మరికొందరు అమ్మాయిలు పరుగుపరుగున బయటకు వచ్చారు.

  ఉమ్మేసిన ముమైత్

  ఉమ్మేసిన ముమైత్

  బయటకు రాగానే గిఫ్ట్స్ లేవని ఏప్రిల్ ఫూల్ అని చెప్పడంతో వాళ్ళు షాక్ అయ్యారు. ఇక ముమైత్ ఖాన్ అయితే తూ.. అంటూ ఉమ్మేసి అసహనం వ్యక్తం చేసింది. మిగతా వారిని కూడా అఖిల్, అనిల్ ఫూల్ చేశారు. ఇక బిందుమాధవి అయితే నేను నిజంగానే గిఫ్ట్స్ వచ్చాయని అనుకున్నాను అంటూ ఫూల్ అయినందుకు సిగ్గుపడిపోయింది.

  స్పెషల్ గెస్ట్

  ఇక ఉగాది ఫెస్టివల్ సందర్భంగా బిగ్ బాస్ లోకి స్పెషల్ గెస్ట్ రావడం జరిగింది. గతంలో కూడా కొన్నిసార్లు బిగ్ బాస్ లోకి వచ్చి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసిన యాంకర్ సుమ ఈసారి సరికొత్తగా ఎంట్రీ ఇచ్చింది. జయమ్మ పంచాయితీ సినిమా ప్రమోషన్ లో భాగంగానే సుమ ఈ తరహాలో ఎంట్రీ ఇచ్చి అల్లరి చేసినట్లు తెలుస్తోంది.

  నన్ను చూడకపోతే నిద్ర పట్టదు

  నన్ను చూడకపోతే నిద్ర పట్టదు

  ఇక సుమ రాగానే బిగ్ బాస్ స్వాగతం చెప్పగా.. అందుకు సుమ.. మా ఆయన అయినా చూడటం మనేశాడేమో గాని ప్రతీ సీజన్ లో ఈ బిగ్ బాస్ కు నన్ను చూడకపోతే నిద్ర పట్టదు ఏమిటో.. అని కామెంట్స్ చేసింది. ఇక ప్రతీ ఒక్క కంటెస్టెంట్ ని కూడా విభిన్నమైన వంటకాలతో పోలుస్తూ సుమ తనదైన శైలిలో పంచ్ లు వేసింది.

   బిందుమాధవిపై పంచ్

  బిందుమాధవిపై పంచ్

  ఇక బిందుమాధవి గతంలో టాస్క్ లో ఎదుర్కొన్న ఇబ్బందులను కామెడీగా గుర్తు చేసిన సుమ చెరుకు గడ్డను చూపిస్తూ దాన్ని మెషిన్ లో వేస్తే ఎలా అవుతుందో బిందు మాధవి పరిస్థితి కూడా అలానే అయ్యిందని కామెంట్స్ చేసింది. ఇక అప్పడంతో మిత్ర శర్మను పోల్చిన సుమ అస్తమానం ఎందుకు ఇలా విరిగిపోతావు అని పంచ్ వేసింది. అంత కాకుండా ఆమె పంపు కాదు పాతాళ గంగ అని తెలిపింది.

  ఓటీటీ అనగానే ఏదోదో వాగుతున్నావు

  ఓటీటీ అనగానే ఏదోదో వాగుతున్నావు

  ఇక పప్పు హామీదా కోసం అంటూ అందులో తాలింపి, కరివేపాకు ఏదైనా వేసుకో అని చెప్పింది. ఇక ఓటీటీ షో అనగానే ఏదోదో వాగుతున్నావు అని సుమ తనకు తానే సరదాగా పంచ్ వేసేసుకుంది. ఇక ఆ తరువాత అందరితో కలిసి చాలా సరదాగా డ్యాన్స్ చేసిన సుమ హైలెట్ గా నిలిచినట్లు అనిపిస్తోంది. మరి ఫుల్ షో ఎలా ఉంటుందో తెలియాలి అంటే నేడు డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో 9 గంటలకు ప్రసారం అయ్యే ఎపిసోడ్ పై ఒక లుక్కేయాల్సింది.

  English summary
  Bigg boss non stop telugu ugadi special guest episode promo viral..
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X