Don't Miss!
- News
ఏపీలోని ఆలయాలపై రమణ దీక్షితులు సంచలన ట్వీట్- డిలెట్
- Sports
హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ పరమ చెత్త.. అసలు ప్లాన్సే లేవు: పాక్ మాజీ క్రికెటర్
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Lifestyle
కూల్ డ్రింక్స్ తాగితే పురుషుల్లో జుట్టు రాలుతుందా?
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Bigg Boss Nonstop : రెచ్చిపోయిన కంటెస్టంట్లు.. మొత్తంగా ఆ ఏడుగురు నామినేషన్స్ లోకి!
బిగ్‌బాస్ రియాలిటీ షో ఇప్పటికే ఆరు వారాలు పూర్తి చేసుకోగా ఇప్పటికి ఐదుగురు సభ్యులు ఎలిమినేట్ అయ్యారు. ముందుగా ముమైత్ ఖాన్, సరయూ, తేజస్వి, ఆర్జే చైతూ, శ్రవంతి చొక్కారపు ఎలిమినేట్ అయ్యారు. ముమైత్ ఖాన్ మొదటి వారంలో అలాగే ఆరో వారంలో రెండు సార్లు ఎలిమినేట్ అయ్యారు. ఇక తరువాత వారానికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ గందరగోళంగా మారింది. నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా కంటెస్టెంట్ల మధ్య వాగ్వాదం భారీగా జరిగింది. తాజా ప్రోమోలో బిందు మాధవి, అఖిల్ సార్థక్ మధ్య రచ్చ జరిగింది. అయితే లీకైన సమాచారం మేరకు ఎవరెవరు నామినేటెడ్ లిస్టులో ఉన్నారనే విషయాలు తెలుసుకుందాం.

ఇండివిడ్యువల్ గేమ్
బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీలో 7వ వారం నామినేషన్స్ హాట్ హాట్ గా జరిగాయి. డబుల్ ఎలిమినేషన్ తర్వాత హౌస్ మేట్స్ అందరూ ఎవరికీ వారు అలర్ట్ అయిపోయారు. ఎవరికి వారే సెల్ఫిష్ గా గేమ్ లో ముందుకు వెళ్తున్నారు. ఇలా ఉంటేనే ప్రజలు ఇష్టపడతారు అని ఫిక్స్ అయిపోయిన నటరాజ్ మాస్టర్, అషూ, అరియానా, బిందు, అఖిల్, మహేష్ ఇలా ఎవరికి వారే ఇండివిడ్యువల్ గేమ్ ఆడడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

వాదించుకుని
ఈ నేపథ్యంలో ఏడో వారం ఆసక్తికరమైన నామినేషన్స్ జరిగినట్లు విడుదలైన ప్రోమోను బట్టి అర్థం అవుతోంది. ఇక అందుతున్న సమాచారం మేరకు నామినేషన్ టాస్క్ ఏంటి అంటే హౌస్ లోని అందరూ ఇద్దరిద్దరి చొప్పున రావాలి, ఇద్దరిలో ఒకరు నామినెట్ అవ్వాలి, ఇంకొకరు సేవ్ అవుతారు. సేవ్ అవడానికి ఎవరూ ఒప్పుకోకపోతే నామినేషన్స్ లో ఇద్దరూ ఉంటారు. అలా బిగ్ బాస్ ఒక చైర్ ని పెట్టి జంటలు జంటలుగా పిలిచి ఒకరిని నామినేట్ చేసుకోమని చెప్పాడు.

లీకయిన సమాచారం
ఇంట్లో ఉండే అర్హత ఎవరికి ఉందో వాదన పెట్టుకోమని చెప్పడంతో హౌస్ మేట్స్ జంటలు గా వచ్చి వాదించుకున్నారు. ఫస్ట్ అనిల్ హమీదా ఇద్దరూ వచ్చి, గేమ్ గురించి టాస్క్ గురించి వాదించుకున్నారు. ఇక్కడ హమీదా సేఫ్ అయ్యి అనిల్ నామినేట్ అయినట్లుగా లీకయిన సమాచారం. అలాగే, నటరాజ్ మాస్టర్ ఇంకా యాంకర్ శివ ఇద్దరిలో నటరాజ్, శివ ఇద్దరిలో ఒకరు సేవ్ అవడానికి ఒప్పుకోరు సో ఇద్దరు నామినేషన్స్ లో ఉన్నారు.

బీభత్సమైన వాగ్వాదం
ఇద్దరి మధ్యలో బీభత్సమైన వాగ్వాదం జరిగినట్లు ప్రోమో బట్టి అర్ధం అవుతుంది. అయితే జరిగింది. అలాగే ఇద్దరి మధ్యలో వచ్చిన బిందు కూడా శివ తరపున గట్టిగా వాదించిందని అంటున్నారు. మరోపక్క బిందు ఇంకా అఖిల్ ఇద్దరూ నామినేషన్స్ లోకి వచ్చినప్పుడు ఇద్దరి మధ్య చాలా సేపు వాదన జరగగా ఇద్దరూ ఒకరినొకరు సేవ్ చేయడానికి ఒప్పుకోరు. దీంతో వారిద్దరూ కూడా నామినేషన్స్ లోకి వచ్చారు.

ఫైనల్ గా ఎవరెవరు
ఒరేయ్ అఖిల్ గా చెప్పరా అని బిందు అంటే, ఒసేయ్ బిందు అంటూ అఖిల్ రెచ్చిపోయాడు. అలా నామినేషన్స్ మంచి హడావుడిగా జరిగాయి. అయితే అషూరెడ్డి కెప్టెన్ కాబట్టి నామినేట్ అవ్వలేదు. ఆ తర్వాత మిత్రాశర్మా ఇంకా మహేష్ విట్టాకి కూడా హీటెడ్ ఆర్గ్యూమెంట్స్ అవగా వారిలో మిత్రా నామినేట్ అయింది.
మహేష్ విట్టా నామినేట్ అవలేదు, కానీ అషూరెడ్డి కెప్టెన్సీ పవర్ వల్ల మహేష్ విట్టా నామినేషన్స్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఆ లెక్కన ఫైనల్ గా ఇప్పుడు అఖిల్, బిందు, యాంకర్ శివ, అనిల్, నటరాజ్ మాస్టర్, అరియానా, మిత్రశర్మ, మహేష్ విట్టా లు నామినేషన్స్ లో ఉన్నారు.