Don't Miss!
- News
మంత్రిపై కాల్పులు జరిపిన ఎస్ఐ- పాయింట్ బ్లాక్ రేంజ్లో
- Sports
ఈసారి వరల్డ్ కప్ గెలుస్తుంది.. టీమిండియాపై మాజీ లెజెండ్ నమ్మకం
- Finance
Hindenburg: హిండెన్‌బర్గ్ స్థాపించింది ఎవరు..? అసలు ఈ కంపెనీ ఏం చేస్తుందంటే..
- Lifestyle
4-7-8 బ్రీతింగ్ టెక్నిక్ అంటే ఏంటి? ఇది ఆందోళనను తగ్గిస్తుందా?
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
బిగ్ బాస్ క్వారంటైన్‌కు రీఎంట్రీ కంటెస్టెంట్.. హౌస్‌లోకి ఎంటర్ అయ్యేది అప్పుడే.!
బిగ్ బాస్ అంటేనే సక్సెస్‌ఫుల్ షో అన్న టాక్ బుల్లితెరపై బాగా వినిపిస్తోంది. హౌస్‌లో, బయట జరిగే వివాదాల కారణంగా మరే షోపై రానంత వ్యతిరేకత వచ్చినప్పటికీ దీనిని ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. అందుకే దేశంలోని దాదాపు అన్ని భాషల్లోనూ బిగ్ బాస్ ప్రసారం అవుతోంది. ఇక, తెలుగులో అయితే దీనికున్న ప్రత్యేకతే వేరు. మూడు సీజన్లు సూపర్ హిట్ అవడంతో దేశ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. నాలుగోది కూడా అలాగే దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో షో యూనిట్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్‌తో రీఎంట్రీ ఇప్పిస్తున్నారు. దానికి సంబంధించిన వివరాలు మీకోసం.!

బిగ్ బాస్... సూపర్ హిట్ షో
ఎన్నో అనుమానాల నడుమ తెలుగులో ప్రారంభం అయింది బిగ్ బాస్ షో. అయితే, అతి తక్కువ రోజుల్లోనే వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ విజయం సాధించింది. ఆ తర్వాత ఏకంగా మూడు సీజన్లను ఇదే రీతిలో పూర్తి చేసుకుంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో పలు వివాదాలు చెలరేగినప్పటికీ.. ఎన్నో మైలురాళ్లను అందుకుని సక్సెస్‌ఫుల్ షోగా పేరు తెచ్చుకుంది బిగ్ బాస్.

ఇచ్చిన మాట కోసం కొత్తవన్నీ
గత సీజన్లకు మించిన వినోదాన్ని ఇందులో చూస్తారని నాలుగో సీజన్ ప్రారంభానికి ముందు బిగ్ బాస్ యూనిట్ ప్రకటించింది. అందుకు అనుగుణంగానే ఈ సారి ఎంటర్‌టైన్‌మెంట్‌ను పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు షో నిర్వహకులు. టాస్కుల్లో కొత్తదనం చూపించడంతో పాటు లవ్ ట్రాకులు, మసాలా సన్నివేశాలపై ఎక్కువగా ఫోకస్ చేసి సక్సెస్ అవుతున్నారు.

సర్‌ప్రైజ్‌లు ప్లాన్ చేస్తున్నారు
నాలుగో సీజన్‌ను మరింత రంజుగా నడిపేందుకు బిగ్ బాస్ నిర్వహకులు సరికొత్త ప్లాన్లతో ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే షో ఆరంభంలోనే ముగ్గురు కంటెస్టెంట్లను వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి పంపించారు. నాగార్జున గైర్హాజరు కావడంతో సమంతను స్పెషల్ హోస్ట్‌గా తీసుకొచ్చారు. అలాగే, కొందరు సెలెబ్రిటీలనూ షోలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

రీఎంట్రీ ప్లాన్ చేసిన బిగ్ బాస్
షో చివరి సగానికి చేరుకున్న నేపథ్యంలో ప్రేక్షకులకు మజాను పంచాలని బిగ్ బాస్ డిసైడ్ అయినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే ఈ సీజన్‌లో ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్లలో ఒకరిని మళ్లీ షోలోకి తీసుకు రావాలని నిర్ణయించుకున్నారట నిర్వహకులు. వాస్తవానికి మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందని అనుకున్నా.. దాన్ని ఆపేసి.. రీఎంట్రీనే ఇప్పించాలని భావిస్తున్నట్లు టాక్.

క్వారంటైన్‌కు రీఎంట్రీ కంటెస్టెంట్
బిగ్ బాస్ హౌస్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్న కంటెస్టెంట్ విషయంలో ఎన్నో వార్తలు ప్రచారం అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఎంతో మంది పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే అనూహ్యంగా షో నుంచి ఎలిమినేట్ అయిన కుమార్ సాయి పేరు బయటకు వచ్చింది. రీఎంట్రీ కోసం తాజాగా అతడు బిగ్ బాస్ క్వారంటైన్ సెంటర్‌కు చేరుకున్నాడని ఓ ఆసక్తికర న్యూస్ హల్‌చల్ చేస్తోంది.
Recommended Video

హౌస్‌లోకి ఎంటర్ అయ్యేది అప్పుడే
తాజా సమాచారం ప్రకారం... కుమార్ సాయి రీఎంట్రీ ఇవ్వడం ఖాయమే అయినప్పటికీ, అతడిని ఎప్పుడు హౌస్‌లోకి పంపించాలన్న దానిపై షో నిర్వహకులు ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదట. అయితే, వచ్చే వారం మాత్రం అతడు ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ వారం మొత్తం కుటుంబ సభ్యుల ఎంట్రీలు ఉంటాయనే టాక్ వినిపిస్తోంది.