»   » బిగ్ బాస్: యంగ్ టైగర్ అసలు రెమ్యూనరేషన్ ఇదన్నమాట!

బిగ్ బాస్: యంగ్ టైగర్ అసలు రెమ్యూనరేషన్ ఇదన్నమాట!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న బుల్లితెర కార్యక్రమం 'బిగ్ బాస్' మంచి రేటింగుతో విజయవంతంగా దూసుకెలుతోంది. తెలుగు ప్రేక్షకులు ఇదివరకెన్నడూ చూడని ఒక విభిన్నమైన షో కావడంతో ఆసక్తిగా తిలకిస్తున్నారు.

వీక్ డేస్‌లో ప్రసారం అయ్యే బిగ్ బాస్ ఎపిసోడ్స్ కంటే వీకెండ్ శని, ఆది వారాల్లో ఎన్టీఆర్ హోస్ట్‌గా ప్రసారం అవుతున్న ఓపిసోడ్లకు మంచి రేటింగ్ వస్తోంది. ఇంత రెస్పాన్స్ రావడానికి కారణం ఎన్టీఆర్‌కు స్టార్ ఇమేజ్ అని చెప్పక తప్పదు. ఎన్టీఆర్‌ను ఈ షోకు తీసుకురావడానికి బిగ్ బాస్ నిర్వాహకులు భారీగానే అమౌంట్ ఆఫర్ చేసినట్లు స్పష్టమవుతోంది.

ఎన్టీఆర్ రెమ్యూనరేషన్

ఎన్టీఆర్ రెమ్యూనరేషన్

షో ప్రారంభానికి ముందు, షో ప్రారంభమైన తర్వాత ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ ఎంత? అనే విషయమై హాట్ హాట్ చర్చ సాగింది. గతంలో రకరకాలుగా ప్రచారం జరిగినా.... తాజాగా ఓ స్పష్టమైన నంబర్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ తాను వచ్చి హోస్ట్‌ చేస్తున్న ఒక్కో ఎపిసోడ్‌కు రూ. 35 లక్షల చొప్పున తీసుకుంటున్నట్లు సమాచారం.

NTR @ Bigg Boss Press Meet : Iam also Don't know Who Are The Participants | Filmibeat Telugu
ఓవరాల్‌గా రూ. 7 కోట్లు

ఓవరాల్‌గా రూ. 7 కోట్లు

మొత్తం 10 వారాల పాటు బిగ్ బాస్ షో సాగుతుంది. వారానికి రెండు ఎపిసోడ్లు ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్నారు. ఎపిసోడ్‌కు రూ. 35 లక్షల చొప్పున లెక్క వేస్తే.... బిగ్ బాస్ మొత్తం మీద ఎన్టీఆర్‌కు రూ. 7 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుతుందని సమాచారం.

ఎన్టీఆర్ సమాధానం ఇదీ...

ఎన్టీఆర్ సమాధానం ఇదీ...

కొన్ని రోజుల క్రితం 'బిగ్ బాస్' తెలుగు లాంచింగ్ కార్యక్రమంలో రెమ్యూనరేషన్‌కు సంబంధించి ఎన్టీఆర్‌కు ప్రశ్నలు ఎదురవ్వగా ఆసక్తికర సమాధానం ఇచ్చారు. బిగ్ బాస్ కాన్సెప్టుతో పాటు మీరందుకునే పారితోషికంగా కూడా చాలా హైగా ఉంటుందట కదా అనే ప్రశ్నకు ఎన్టీఆర్ స్పందిస్తూ.... నా పెళ్లాం బిడ్డలను చూసుకునేంత ఉంది, కానీ మీరెంత అనుకుంటున్నారో అంత లేదని మాత్రం చెప్పగలను అంటూ చమత్కరించారు.

డబ్బు గురించి ఎప్పుడూ ఆలోచించలేదు

డబ్బు గురించి ఎప్పుడూ ఆలోచించలేదు


నేను డబ్బు గురించి, పారితోషికం గురించి ఎప్పుడూ పెద్దగా ఆలోచించలేదు. ఇపుడు మీరు చెబుతుంటే ఆలోచించాల్సి వస్తోంది ఎంతిచ్చారు నాకు అనే లెవల్లో... వాళ్లు బాగానే ఇచ్చారు, కానీ మీరు అనుకుంటున్నంత మాత్రం కాదు అని తారక్ సమాధానం ఇచ్చారు. దీనిపై షో నిర్వాహకులు స్పందిస్తూ అతడి పాషన్, అతడి ఎనర్జీ అన్నీ ఎంతో విలువైనవే, దాన్ని పారితోషికంతో సరిపోల్చలేము అన్నారు.

కెప్టెన్ ఇంత కఠినమా? సంపూ, మధుప్రియకు షాక్... బిగ్‌బాస్‌లో మళ్లీ టెన్షన్!

కెప్టెన్ ఇంత కఠినమా? సంపూ, మధుప్రియకు షాక్... బిగ్‌బాస్‌లో మళ్లీ టెన్షన్!

తెలుగు బిగ్ బాస్ కార్యక్రమం తొలి వారం విజయవంతంగా పూర్తి చేసకుని రెండో వారంలోకి అడుగు పెట్టింది. ఈ వారం సంపూ లేదా, మధు ప్రియ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది.

జులై 24 నాటి ఎపిసోడ్‍‌ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
According to a source, Jr NTR, who is hosting the ongoing Big Boss show on a Telugu channel, is charging Rs 35 lakhs per episode!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu