For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సోహెల్‌ను అంత మాట అనేసిన బిగ్ బాస్.. ఫినాలేకు ముందు అలా చెప్పడంతో షాక్!

  |

  సయ్యద్ సోహెల్ రియాన్... తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా ట్రెండ్ అవుతోన్న పేరిది. కొన్ని సినిమాలు, సీరియల్స్‌లో నటించి మన ప్రేక్షకులకు సుపరిచితుడు అయిన అతడు.. బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇవ్వడం ద్వారా విపరీతమైన ఫాలోయింగ్‌ను అందుకున్నాడు. షోలోకి వెళ్లిన తర్వాతనే ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్నాడు. ఎప్పుడూ కోపంగా ఉంటూ గొడవలకు దిగే అతడు.. అందరితోనూ ప్రేమగా ఉంటున్నాడు. దీని వల్లే ఫినాలేకు కూడా చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో సోహెల్‌కు బిగ్ బాస్ భారీ షాకిచ్చాడు. ఆ వివరాలు మీకోసం!

  సోహెల్ చేసిన మూవీలు, సీరియల్స్ ఇవే

  సోహెల్ చేసిన మూవీలు, సీరియల్స్ ఇవే

  సయ్యద్ సోహెల్ రియాన్ పలు సినిమాలు, సీరియళ్లలో నటించాడు. ‘కొత్త బంగారు లోకం' అనే సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అతడు.. ఆ తర్వాత ‘పిచ్చిగా నచ్చావ్', ‘జనతా గ్యారేజ్', ‘సరైనోడు' వంటి చిత్రాల్లో కీలక పాత్రలు చేశాడు. అలాగే, ‘యూరేకా' అనే మూవీలో లీడ్ రోల్ చేశాడు. వీటితో పాటు ‘పసుపు కుంకుమ', ‘నాతిచరామీ' అనే సీరియల్స్‌లో నటించాడు.

  ఆమెతో కలిసి సీక్రెట్‌గా ఎంట్రీ ఇచ్చాడుగా

  ఆమెతో కలిసి సీక్రెట్‌గా ఎంట్రీ ఇచ్చాడుగా

  వరుసగా సినిమాలు, సీరియల్స్‌ చేస్తూ కెరీర్‌ను సాగిస్తోన్న సమయంలో సోహెల్.. బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అంగరంగ వైభవంగా జరిగిన ప్రీమియర్ ఎపిసోడ్‌లో అతడిని, మరో కంటెస్టెంట్ ఆరియానా గ్లోరీతో కలిసి సీక్రెట్‌ రూమ్‌లోకి పంపాడు హోస్ట్ నాగార్జున. అక్కడ ఈ ఇద్దరూ కొన్ని రోజుల పాటు కలిసున్న తర్వాత బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించారు.

  ‘కథ వేరే ఉంటది' అంటూ ఫుల్ ఫేమస్

  ‘కథ వేరే ఉంటది' అంటూ ఫుల్ ఫేమస్

  బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలోనే గొడవను ప్రారంభించిన సయ్యద్ సోహెల్ రియాన్.. దానినే కంటిన్యూ చేస్తూ వచ్చాడు. బిగ్ బాస్ హౌస్‌లో సహనం కోల్పోయి ఎన్నో సార్లు వాగ్వాదానికి దిగాడు కూడా. దీంతో నాగార్జున ఆగ్రహానికి కూడా గురయ్యాడు. ఇక, గొడవలకు దిగిన సమయంలో సోహెల్ వాడే ‘కథ వేరే ఉంటది' అనే డైలాగ్ ఎంతగానో ఫేమస్ అయింది.

  ఫ్రెండ్స్ కోసం త్యాగం చేస్తూ మంచి పేరు

  ఫ్రెండ్స్ కోసం త్యాగం చేస్తూ మంచి పేరు

  సోహెల్ సీజన్ ఆరంభంలో మెహబూబ్‌తో క్లోజ్‌గా ఉండేవాడు. అతడు ఎలిమినేట్ అయిన తర్వాత అఖిల్ సార్థక్‌, మోనాల్ గజ్జర్‌కు మరింత దగ్గరయ్యాడు. బిగ్ బాస్ నాలుగో సీజన్ మొత్తంలో టాస్కుల పరంగా వందకు వంద శాతం శ్రమిస్తుంటాడు సోహెల్. ఈ క్రమంలోనే తన స్నేహితుల కోసం చాలా త్యాగాలు చేశాడు. అలాగే, అఖిల్ కోసం ఫినాలే మెడల్‌ను కూడా వదిలేశాడు.

  సోహెల్‌కు ఊహించని షాకిచ్చిన బిగ్ బాస్

  సోహెల్‌కు ఊహించని షాకిచ్చిన బిగ్ బాస్

  నాగార్జున తిట్టిన తర్వాత కోపం తగ్గించుకున్న సోహెల్.. అందరితోనూ మంచిగా ఉంటూ తనలోని ఎమోషనల్ యాంగిల్‌నూ బయట పెట్టాడు. ఈ క్రమంలోనే అద్భుతమైన ఆటతీరుతో టాప్-5కి చేరుకుని ఫినాలేలో ఉన్నాడు. చివరి వారం కావడంతో హౌస్‌లో సర్‌ప్రైజ్‌లు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సయ్యద్ సోహెల్‌ రియాన్‌కు ఊహించని షాక్ ఇచ్చాడు బిగ్ బాస్.

  ఫినాలేకు ముందు అలాంటి మాట అనడంతో

  ఫినాలేకు ముందు అలాంటి మాట అనడంతో

  గురువారం ఎపిసోడ్‌లో సోహెల్ జర్నీ వీడియో చూపించాడు బిగ్ బాస్. ఈ సందర్భంగా అతడిని ప్రశంసలతో ముంచెత్తాడు. గొప్ప ఆటగాడని, టాస్క్ కోసం ప్రాణం పెట్టి ఆడతాడని అభినందించాడు. ఆ సమయంలోనే ‘బిగ్ బాస్ మీకు సెల్యూట్ చేస్తున్నారు' అని చెప్పగానే.. షాకైపోయిన సోహెల్ ఆనందంతో కన్నీటి పర్యంతం అయ్యాడు. వెంటనే బిగ్ బాస్‌కు పాదాభివందనం చేశాడు.

  English summary
  Syed Sohel Ryan is an Indian actor and model who primarily works in the Telugu film and television industry. He is known for the portrayal of Revanth in the Telugu action thriller film, “Eureka” (2020) and Sohel in a Telugu drama film, “Konapuram Lo Jarigina Katha” (2019) directed by KB Krizhna.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X