»   » బిగ్ బాస్ ఇంట్లో దోపిడి: ముమైత్ ముఠా అరాచకం!

బిగ్ బాస్ ఇంట్లో దోపిడి: ముమైత్ ముఠా అరాచకం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు రియాల్టీషో 'బిగ్ బాస్'లో 38వ రోజు ఊహించని సంఘటన చోటు చేసుకుంది. ముసుగులు ధరించిన దాదాపు 10 మంది దోపిడీ ముఠా ఇంట్లోకి ఎంటర్ అయి లూటీ చేశారు. ఇంటి సభ్యుల దుస్తువులు, తినే పదార్థాలు, బెడ్, దుప్పట్లు, పర్సనల్ కేర్ వస్తువులు, చివరకు అండర్ వేర్లు కూడా వదలకుండా ఎత్తుకెళ్లారు.

సీక్రెట్ రూంలో ఉన్న ముమైత్ ఖాన్‌ను దోమల ముఠాకు నాయకురాలిని చేయడంతో ఆమె తన సభ్యులతో ఈ అరాచకానికి పాల్పడింది. ఈ దోపిడీ ఘటన అనంతరం బిగ్ బాస్ ఇంటి సభ్యులకు కొత్త టాస్క్ ఇచ్చారు.

దోమల ముఠా ఆక్రమణలోకి బిగ్ బాస్ ఇల్లు

దోమల ముఠా ఆక్రమణలోకి బిగ్ బాస్ ఇల్లు

బిగ్ బాస్ ఇచ్చిన కొత్త టాస్క్ ప్రకారం ఇల్లు దోమల ముఠా ఆక్రమణలోకి వెళ్లింది. ఇంటి సభ్యులు రెండు టీంలుగా విడిపోయి.... దోమల ముఠా నాయకురాలు ముమైత్ ఇచ్చిన టాస్క్ విన్ అవ్వడం ద్వారా ఇంట్లోని ప్రదేశాలను తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలి.

విచిత్రమైన టాస్క్‌లు

విచిత్రమైన టాస్క్‌లు

చేప నోట్లో మౌతార్గన్ ఊదడం, పేడలో నుండి కాయిన్స్ వెలికి తీయడం, ఐస్ కరిగించడం, కాకరకాయలు తినడం లాంటి టాస్క్‌లు గెలవడం ద్వారా ఇంట్లోని ప్రదేశాలను స్వాధీనం చేసుకోవాలి.

కార్తీక ఆధ్వర్యంలో టాస్క్‌లు

కార్తీక ఆధ్వర్యంలో టాస్క్‌లు

కత్తి కార్తీక ఆధ్వర్యంలో బిగ్ బాస్ ఇంట్లో టాస్క్‌లు జరిగాయి. అయితే కాకరకాయలు తినడం టాస్క్ నవదీప్, దీక్ష మధ్య జరిగినపుడు ఈ టాస్క్ లో విజేతను ప్రకటించే విషయంలో కార్తీక న్యాయంగా ప్రవర్తించలేదనే విమర్శలు వచ్చాయి.

బిగ్ బాస్ ఇంట్లోకి ఎంటరైన ముమైత్

బిగ్ బాస్ ఇంట్లోకి ఎంటరైన ముమైత్

దోమల ముఠా నాయకురాలిగా బాధ్యతలు స్వీకరించిన ముమైత్ ఖాన్ తన ముఠాతో కలిసి దోపీడి చేసిన వస్తువులతో బిగ్ బాస్ ఇంట్లోకి ఎంటరైంది. ముమైత్‌ను చూసి అంతా షాకయ్యారు. తర్వాతి ఎపిసోడ్ నుండి షో మరింత రసవత్తరంగా సాగనుంది.

English summary
Bigg Boss Season 1, Episode 38 details. The contestants are stunned when a few robbers steal almost everything from the house. Bigg Boss has a special task for Mumaith Khan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu