»   »  ‘బిగ్ బాస్’ మరీ ఇంత దారుణమా?: గతిలేక రాలేదంటూ శివబాలాజీ ఫైర్

‘బిగ్ బాస్’ మరీ ఇంత దారుణమా?: గతిలేక రాలేదంటూ శివబాలాజీ ఫైర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎన్టీఆర్ హోస్ట్‌గా తెలుగులో ప్రారంభమైన బిగ్గెస్ట్ రియాల్టీ‌షో 'బిగ్ బాస్' ఆసక్తిగా సాగుతోంది. పద్దతిగా, ఒక వరుస క్రమంలో సాగక పోవడమే ఈ షో ప్రత్యేకత. ఇందులోని సెలబ్రిటీల ప్రవర్తన బట్టే పరిణామాలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి.

మొత్తం 14 మంది పోటీ దారులు బిగ్ బాస్ ఇంట్లో గడుపుతున్నారు. దాదాపు 70 రోజుల పాటు ఓపికతో ఈ ఇంట్లో గడిపిన వారే విజేతలు. షో ప్రారంభమై కనీసం వారం కూడా గడవక ముందే అక్కడి పరిస్థితులు తట్టుకోలేక పోటీ దారుల్లో అసహనం పెరిగిపోతోంది.

బిగ్ బాస్ మీద వ్యతిరేకత

బిగ్ బాస్ మీద వ్యతిరేకత

బిగ్‌బాస్ రూల్స్ అతిక్రమించి స్మోక్ రూమ్‌లోకి ఒకరికంటే ఎక్కువ మంది వెళ్లిన కారణంగా పనిష్మెంట్ ఇచ్చాడు. సిగరెట్లను పంపడం ఆపేపశాడు. దీంతో సిగరెట్ అలవాటు ఉన్న ఇంటి సభ్యుల్లో అసహనం, ఆగ్రహం వ్యక్తం అయింది.

Bigg Boss Telugu : Bigg Boss given Warning to Contestants
గతిలేక రాలేదు

గతిలేక రాలేదు

తమకు గతిలేక ఈ షో చేయడానికి రాలేదని, బిగ్ బాస్ చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాడంటూ శివబాలాజీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతనికి ఇతర సభ్యులు ధన్ రాజ్, సమీర్ లు మద్దతు పలికారు.

ఇది చాలా దారుణం

ఇది చాలా దారుణం

బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ తాము కష్టపడి సిన్సియర్ గా చేస్తున్నామని, మేము ఏమైనా తప్పు చేస్తే శిక్షలను కూడా స్వీకరిస్తున్నామని, మరీ ఇంత కఠినంగా వ్యవహరించడం చాలా దారుణమని... సిగరెట్ల విషయంలో కండీషన్ పెట్టడం ఏమిటని, ఇది స్టుపిడిటీ అని అంటూ శివబాలాజీ అసహనం వ్యక్తం చేశారు.

సిగరెట్లు పంపిన బిగ్ బాస్

సిగరెట్లు పంపిన బిగ్ బాస్

సభ్యుల విన్నపంతో బిగ్ బాస్ తన నిర్ణయాన్ని వెనక్కి తేసుకుని సిగరెట్లను అందించాడు. అయితే, ఒక కండిషన్ పెట్టాడు. ఒక వ్యక్తి స్మోక్ చేస్తున్నప్పుడు, మిగిలిన 13 మంది సభ్యులు బాత్రూమ్ లో ఉండాలని కండిషన్ విధించాడు.

గిల్టీగా ఉందన్న ధనరాజ్

గిల్టీగా ఉందన్న ధనరాజ్

తాము సిగరెట్ తాగుతుంటే మిగిలిన వారు బాత్రూమ్ లో ఉండి ఇబ్బంది పడటం గిల్టీగా ఉందని, ఈ నియమాన్ని ఎత్తివేయాలని, ఇకపై స్మోక్ జోన్లోకి ఒకరు మాత్రమే వెళతామని బిగ్ బాస్ కు ధన్ రాజ్ సహా స్మోకింగ్ చేసే ఇతర సభ్యులు విన్నవించారు.

English summary
Bigg Boss season 1 Episode 6 details. Bigg Boss Telugu is the Telugu-language version of the reality TV programme Bigg Boss broadcast in India. The first season of Bigg Boss Telugu Was launched on 16 July 2017 on Star Maa. N. T. Rama Rao Jr. host the show.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu