Shiva Jyothi: ‘10 ఏళ్ల నిరీక్షణ.. ఎవరూ దిష్టి పెట్టొద్దు.. ఆశీర్వదించండి‘

Shiva Jyothi: యాంకర్ సావిత్రిగా పరిచయమైన శివ జ్యోతి (Shiva Jyoti) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె యాంకర్ గా ఉన్న సమయంలో తన తెలంగాణ భాషా, శైలి, కట్టుబొట్టు స్టైల్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నది. ముఖ్యంగా వీ6 న్యూస్ ఛానల్ లో తీన్మార్ కథలతో మొదటి పరిచయం తరువాత మంచి క్రేజ్ సంపాదించి, ఆ తర్వాత బిగ్ బాస్ షో ద్వారా మరింత గుర్తింపు తెచ్చుకుంది. ఈ అమ్మడు దసరా 2025 సందర్భంగా అభిమానులకు ఒక సర్‌ప్రైజ్ శుభవార్త చెప్పింది. ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఎంటీ?

తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా నాగంపేట గ్రామానికి చెందిన శివజ్యోతి, ప్రముఖ వార్తా చానళ్లలో యాంకర్‌గా పని చేసి పాపులర్ అయ్యారు. అనంతరం బిగ్ బాస్ తెలుగు సీజన్‌లో పాల్గొని ప్రేక్షకుల ఆదరణ పొందారు. ప్రస్తుతం టీవీ ప్రోగ్రామ్స్‌తో పాటు యూట్యూబర్‌గా కూడా శివజ్యోతి చురుకుగా కొనసాగుతున్నారు. శివజ్యోతి పదేండ్ల క్రితం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న గంగూలీతో ప్రేమ వివాహం చేసుకుంది.

Bigg Boss Shiva Jyothi announces pregnancy after 10 years of marriage

శివజ్యోతికి వివిధ టీవీ షోలలో తన ఫ్రెండ్స్ గ్యాంగ్ తో రచ్చ రచ్చ చేయడం, మైండ్ బ్లాక్ చేసే మోమెంట్స్ తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది. భర్త గంగూలీ (Ganguly)కు పూర్తి సపోర్ట్ లభిస్తున్నందున, శివ జ్యోతి తన ఫ్రెండ్స్ తో పార్టీలు, ఎంజాయ్‌మెంట్లు కొనసాగిస్తూ ఉంటుంది. భర్త కూడా ఆమె ప్రత్యేక స్టైల్ ద్వారా కాస్తా సెలబ్రెటీగా మారిపోయారు. అంతేకాకుండా.. శివ జ్యోతి సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఫోటోషూట్స్, భర్తతో ఫోటోలు పంచుకోవడం, యూట్యూబ్ ఛానల్ ద్వారా ఏ పని చేసినా వీడియోలుగా షేర్ చేస్తుంటారు.

ఇదిలా ఉంటే.. శివజ్యోతికి పెళ్లి అయి పదేండ్ల అవుతున్నా.. వారికి పిల్లలు లేరు. ఈ విషయంలో పది ఏళ్లుగా నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నారు. సావిత్రక్క జీవితంలో ఆనందకరమైన ఘట్టం చోటుచేసుకుంది. దశాబ్దం పాటు సంతానం కోసం ఎదురుచూస్తూ పూజలు, వ్రతాలు చేసిన ఆమెకు ఇప్పుడు ఆ ఫలితం దక్కింది. దేవుడి కరుణతో శివజ్యోతి - ఆమె భర్త గంగూలీ దంపతులు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. తాజాగా శివ జ్యోతి తాను తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. తన భర్త గంగూలీ కలిసి ఓ స్పెషల్ వీడియో చేసింది.

వచ్చే ఏడాదిలో పాప లేదా బాబు పుట్టబోతున్నాడని ఒక వీడియోలో వెల్లడించింది. ఈ వీడియోలో "అందరికీ దసరా శుభాకాంక్షలు. ఆ ఏడుకొండల వెంకన్నస్వామి దయతో 2026లో మాకు బిడ్డ రాబోతుంది. మా పిల్లల కోసం ఎంతోమంది వేచి ఉన్నారు. మా సొంత అక్క, బావకు బేబీ రావాలని మీరు కోరినట్లు నేను భావిస్తున్నాను. అందుకే పండుగ రోజే ఈ ముచ్చటను పంచుతున్నాను. ఎవరూ దిష్టి పెట్టొద్దు, ఆశీర్వదించండి. నా జర్నీలో సపోర్ట్ చేసిన వారిని మర్చిపోను." అంటూ ఓ వీడియో ను పోస్టు చేసింది. ప్రస్తుతం వీరి పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.

More from Filmibeat

Read more about: ganguly bigg boss shiva jyothi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X