Bigg Boss: బిగ్‌బాస్‌లో కుప్పకూలిన లేడీ కంటెస్టెంట్.. స్పృహ తప్పిపడిపోయిన సెలబ్రిటీ
బిగ్‌బాస్ తెలుగు 9 రియాలిటీ షోలో ఊహించని సంఘటన చోటు చేసుకొన్నది. మహిళా కంటెస్టెంట్ ఉన్నట్టుండి స్పృహ కోల్పోవడంతో ఇంటి సభ్యులందరూ కంగారుపడిపోయారు. కాసేపు లేడీ కంటెస్టెంట్‌కు ఏం జరిగిందనే విషయం తెలియక ఆందోళనకు గురయ్యారు. స్పృహ కోల్పోయిన ఆమెకు సపర్యలు చేశారు. ప్రాథమిక చికిత్స చేసేందుకు ప్రయత్నిస్తుండగా.. బిగ్‌బాస్ గ్రహించాడు. ఆమె వద్దకు వెంటనే వైద్యులను పంపించి చికిత్స ప్రారంభించారు. ఈ సంఘటన తమిళ బిగ్‌బాస్ షోలో చోటు చేసుకొన్నది. ఆ కంటెస్టెంట్ ఎవరు? ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..
తమిళ వినోద రంగంలో స్టేజ్ డ్యాన్సర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న వారిలో రమ్య జూ ఒకరు. సోషల్ మీడియాలో యమ యాక్టివ్'గా ఉంటారు. ఆమె చేసే రీల్స్‌కు, వీడియోలకు మంచి రెస్సాన్స్ ఉంటుంది. సోషల్ మీడియాలో టాప్ సెలబ్రిటీగా ఆమె కొనసాగుతున్నారు. ఆ కారణంగానే బిగ్‌బాస్ 9 తమిళంలో అవకాశం లభించింది.

టాలెంటెడ్ యాక్టర్ విజయ్ సేతుపతి హోస్ట్‌గా నిర్వహించే బిగ్‌బాస్ తమిళ్ 9 షోలోకి అడుగుపెట్టిన రమ్య అలియాస్ స్టెల్లా మంచి ఆటతీరుతో ఆకట్టుకొంటున్నారు. గత కొద్ది రోజులుగా రమ్య తనదైన ఆటతీరుతో చలాకీగా కనిపిస్తున్నారు. అయితే ఆమె అనారోగ్యానికి గురికావడం అందర్ని దిగ్బ్రాంతికి గురి చేసింది. ఆమె అలా సృహతప్పి కిందపడిపోవడం వెనుక వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు.
తాజా షోలో గురువారం నాడు.. ఇంటిలో ఆమె నడుచుకొంటూ వస్తున్నారు. అలా నడుచుకొంటూ వస్తూనే ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు. అయితే అందరూ ఆమె యాక్టింగ్ చేస్తుందా అని కొన్ని క్షణాలు చూశారు. కానీ ఆమె కదలకుండా ఉండటంతో కంటెస్టెంట్లందరూ పరుగున వచ్చి ఆమెను లేపేందుకు ప్రయత్నించారు. ఆమెను సున్నితంగా చెంపలపై కొడుతూ లేపేందుకు ప్రయత్నించారు. అలా కాసేపు ప్రయత్నించిన తర్వాత ఆమె స్పృహలోకి వచ్చారు. దాంతో ఆమెకు నీళ్లు తాగించి ఉపశమనం కలిగించారు.
రమ్య జూ ఆరోగ్య పరిస్థితిని గ్రహించిన బిగ్‌బాస్ వెంటనే వైద్యులను పంపించి చికిత్స అందించారు. ఆమెను వైద్యుల పర్యవేక్షణలో ఉంచి చికిత్స చేయిస్తున్నారు. ఆమెకు సంబంధించిన స్కానింగ్, ఇతర పరీక్షలు నిర్వహించారు. ఆమెకు ట్రీట్‌మెంట్ అందుతున్నది అని బిగ్‌బాస్ ఇంటి సభ్యులకు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి సాధారణ స్థితికి చేరుకొందని తెలుస్తున్నది.
అయితే ఎడతెరిపి లేకుండా టాస్క్‌లు ఆడటం, అలాగే సరైన నిద్ర లేకపోవడం, అలసిపోవడం వల్ల అలా ఫెయింట్ అవ్వడం జరుగుతుంది. ఇంట్లో పరిమిత ఆహారం ఇవ్వడం వల్ల కూడా నీరసంగా ఉన్న సమయంలో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయని వైద్యులు చెప్పినట్టు సమాచారం. త్వరలోనే ఆమె నార్మల్‌గా మారి ఇంట్లోకి అడుగుపెడుతుందా? లేదా అనే వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











