Just In
- 40 min ago
నా పేరు రంగడు వీడి పేరు.. హద్దులు దాటుతోన్న హైపర్ ఆది డబుల్ మీనింగ్
- 1 hr ago
అది కంట్రోల్ చేయడమే నా పేరుకు అర్థం.. ఎద అందాలతో చిచ్చుపెట్టిన ఊర్వశీ
- 2 hrs ago
ఇదెక్కడి వింతరా బాబు.. సుత్తితో కొట్టేసుకుంటోన్న హీరో.. వీడియో వైరల్
- 2 hrs ago
నాగ చైతన్య, సాయి పల్లవి లవ్ స్టోరీ: ముహూర్తం ఫిక్స్ చేసిన చిత్ర యూనిట్
Don't Miss!
- Finance
ఆనంద్ మహీంద్ర గిప్ట్: ఆరుగురు టీమిండియా ప్లేయర్లకు కార్లు బహుమానం..
- News
ఎవరి ప్రాపకం కోసం ఎన్నికలు .. ఎస్ఈసీ నిమ్మగడ్డపై విరుచుకుపడిన స్పీకర్ తమ్మినేని సీతారాం
- Sports
ఏదైనా చేసుకోండి.. మేం మాత్రం అక్కడికి వెళ్లం! బీసీసీఐకి రవిశాస్త్రి హెచ్చరిక!
- Automobiles
డిసెంబర్లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..
- Lifestyle
సెక్స్ సమయంలో మీరు ఈ పని చేస్తే ఏమి జరుగుతుంది?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఒకే పేరున్న కంటెస్టెంట్లే బిగ్ బాస్ టార్గెట్: ఆప్పుడు ఆమెను.. ఇప్పుడు ఈమెను!
అసాధారణ రెస్పాన్స్‌తో తెలుగు బుల్లితెరపై తిరుగులేని షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఎన్నో అనుమానాల నడుమ మన భాషలోకి పరిచయం అయిన ఈ షోకు.. చాలా తక్కువ సమయంలోనే వీపరీతమైన స్పందన వచ్చింది. ఫలితంగా మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకోగలిగింది. అంతేకాదు, రెండు నెలల క్రితం నాలుగో సీజన్‌ను సైతం ప్రారంభించారు. ఇందులో సరికొత్త ప్రయోగాలను చేస్తూ సక్సెస్ అవుతున్నారు. ఇదిలాఉండగా, ఒకే పేరున్న ఇద్దరు కంటెస్టెంట్లను బిగ్ బాస్ టార్గెట్ చేసినట్లు తాజా పరిణామంతో అర్థమైంది. ఆ వివరాలు మీకోసం.!

ప్రయోగాలతో షో సూపర్ సక్సెస్
తెలుగు వారికి ఏమాత్రం పరిచయం లేని కొత్త కంటెంట్‌తో మొదలైంది బిగ్ బాస్ షో. రియాలిటీ ఆధారంగా నడిచే దీనికి ఆరంభంలోనే మంచి స్పందన వచ్చింది. సెలెబ్రిటీల వ్యక్తిత్వాలను ప్రతిబింబించే ఈ షోపై మన ప్రేక్షకులు మనసు పారేసుకున్నారు. ఫలితంగా బిగ్ బాస్ షో తెలుగులో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తూ మూడు సీజన్లు పూర్తి చేసుకుంది.

వివాదాలమయంగా నిర్ణయాలు
బిగ్ బాస్ షోలో ఎంతగా పాపులర్ అయిందో.. అంతే స్థాయిలో దీనిపై విమర్శలు కూడా చెలరేగాయి. ఈ షోలో గొడవలు, గ్లామర్ షోలు, అశ్లీలత, అసభ్య ప్రవర్తనలు ఎక్కువయ్యాయన్న ఆరోపణలు వచ్చాయి. అదే సమయంలో కాస్టింగ్ కౌచ్ కూడా కలకలం రేపింది. ఒకానొక దశలో దేశ రాజధాని ఢిల్లీలో ఈ షోను నిషేదించాలని పోరాటం కూడా చేశారు కొందరు సెలెబ్రిటీలు.

ఈ సారి షోపై పెరిగిన విమర్శలు
గతంలో కంటే ప్రస్తుతం ప్రసారం అవుతోన్న నాలుగో సీజన్‌లో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. ఫలితంగా బిగ్ బాస్ షోపై విమర్శలు ఎక్కువవుతున్నాయి. నామినేషన్ ప్రక్రియ, లవ్ ట్రాకులు, మసాలా సన్నివేశాలతో పాటు టీఆర్పీకి ఉపయోగపడే కంటెంట్‌నే ప్రసారం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఎలిమినేషన్లతో ఓటింగ్ సిస్టమ్‌పైనా సందేహాలు వస్తున్నాయి.

మరో ప్లాన్‌తో ముందుకొచ్చారు
భారీ స్థాయిలో ప్రేక్షకాదరణ పొందిన ఈ షోలో మరింత ఆసక్తిని పెంచేందుకు బిగ్ బాస్ యూనిట్ ఎన్నో ప్లాన్లు అమలు చేస్తోంది. ఇప్పటికే సరికొత్త టాస్కులతో షోను రసవత్తరంగా మార్చిన నిర్వహకులు.. ఈ సారి మరో ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అదే.. హిందీ బిగ్ బాస్‌లో ఎంతగానో పాపులర్ అయిన దెయ్యం ఎంట్రీ టాస్కును తెలుగులోకి తీసుకొచ్చారు.

ఒకే పేరున్న కంటెస్టెంట్లే టార్గెట్
బిగ్ బాస్ షో రోజురోజుకూ రసవత్తరంగా సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వారం నామినేషన్ ప్రక్రియను సరికొత్త పద్దతిలో నిర్వహించారు. దీంతో షోలో ఊహించని పరిస్థితులు కనిపించాయి. ఇలాంటి సమయంలో బిగ్ బాస్ హౌస్‌లోకి దెయ్యాన్ని తీసుకొచ్చారు షో నిర్వహకులు. బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఈ దెయ్యాన్ని చూపించబోతున్నారు.

ఆప్పుడు ఆమె.. ఇప్పుడు ఈమె
బిగ్ బాస్ సీజన్ 1లో కంటెస్టెంట్ అర్చనకు దెయ్యాన్ని చూపించిన నిర్వహకులు.. ప్రస్తుత సీజన్‌లో ఆరియానాకు కనపడేలా ప్లాన్ చేశారు. దీంతో కొత్త న్యూస్ తెరపైకి వచ్చింది. ఆరియానా అసలు పేరు అర్చన అన్న విషయం తెలిసిందే. అంటే బిగ్ బాస్ అప్పుడు ఇప్పుడు ఒకే పేరున్న కంటెస్టెంట్‌ను టార్గెట్ చేసి దెయ్యాన్ని చూపించారు. సో ఈ అంశం హాట్ టాపిక్ అవుతోంది.