For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Winner: అతడే ఈ సీజన్ విన్నర్.. కన్ఫెషన్ రూమ్‌కి పిలిచి మరీ హెల్ప్.. లీకైన బిగ్ బాస్ ప్లాన్

  |

  దేశంలోని ఎన్నో భాషల్లో ప్రసారం అవుతోన్నా.. తెలుగులో మాత్రమే భారీ స్థాయిలో ఆదరణను సొంతం చేసుకుంటూ అత్యధిక రేటింగ్‌ను దక్కించుకుంటోన్న ఏకైక షో బిగ్ బాస్. అందుకే నిర్వహకులు వరుస పెట్టి సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఇలా ఇప్పుడు నడుస్తోన్న ఆరో సీజన్ కూడా చివరి దశకు చేరింది. దీంతో ఇది యమ రంజుగా సాగుతోంది. ఇక, ఇది మరో వారంలో ఫినాలేను జరుపుకోబోతుంది. ఈ నేపథ్యంలో ఓ కంటెస్టెంట్‌కు బిగ్ బాస్ టీమ్ హెల్ప్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది. అసలేం జరిగిందో మీరే చూడండి!

  టైటిల్ రేస్‌లో ముందున్నాడు

  టైటిల్ రేస్‌లో ముందున్నాడు

  ప్రస్తుతం ప్రసారం అవుతోన్న బిగ్ బాస్ ఆరో సీజన్‌లో రికార్డు స్థాయిలో ఏకంగా 21 మంది కంటెస్టెంట్లుగా ఎంటరయ్యారు. వీళ్లంతా తమ తమ విభాగాల్లో గుర్తింపును దక్కించుకున్నారు. అందులో కొందరు మాత్రమే టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగారు. అందులో సింగర్ రేవంత్ ఒకడు. సింగర్‌గా టాలీవుడ్‌లో సత్తా చాటిన అతడు.. ఈ షోలో విజేత అయ్యేందుకు పోటీ పడుతున్నాడు.

  బ్రాలో అరాచకంగా ఆదా శర్మ: వామ్మో ఇంత దారుణంగా చూపిస్తే ఎలా!

  నిత్యం గొడవలే.. డ్యామేజ్‌గా

  నిత్యం గొడవలే.. డ్యామేజ్‌గా

  బిగ్ బాస్ షోలోకి వచ్చినప్పటి నుంచే సింగర్ రేవంత్ తన మార్కు చూపించే ప్రయత్నాలు చేస్తున్నాడు. షోలో ఇచ్చే టాస్కుల్లో ఎంతో యాక్టివ్‌గా పాల్గొంటున్నాడు. వాటిలో తనదైన ఆటతో ఆకట్టుకుంటున్నాడు. కానీ, తరచూ కోపంతో గొడవలు పెట్టుకుంటున్నాడు. దీంతో ఆరంభంలోనే అతడు కోపిస్టి అనే పేరును తెచ్చుకున్నాడు. ఇది అతడి ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేసింది.

  ట్రోల్స్ ఉన్నా టైటిల్ కోసం

  ట్రోల్స్ ఉన్నా టైటిల్ కోసం

  ఈ సీజన్‌లో రేవంత్ ఎంతో చక్కగా ఆడుతున్నాడు. కానీ, తన ప్రవర్తనతో మాత్రం ఏం చేసినా హాట్ టాపిక్ అవుతున్నాడు. దీంతో అతడిపై ఆరంభం నుంచే సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. కానీ, అతడిపై ఇవి ప్రభావాన్ని మాత్రం చూపించడం లేదు. దీంతో అతడికి భారీ స్థాయిలో ఓటింగ్ పోల్ అవుతోంది. ఫలితంగా అతడు టైటిల్ కోసం ముందుకు సాగుతున్నాడు.

  పాయల్ బాత్రూం పిక్స్ వైరల్: అది కూడా లేకుంటే అంతే సంగతులు!

  మనీ రివైవల్ టాస్కులో పోటీ

  మనీ రివైవల్ టాస్కులో పోటీ

  బిగ్ బాస్ ఇటీవల జరిగిన టాస్కుల్లో విన్నర్ ప్రైజ్ మనీని తగ్గించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దాన్ని పెంచుకునేందుకు కంటెస్టెంట్లకు వరుసగా టాస్కులు ఇస్తున్నారు. ఇందులో భాగంగానే కొన్ని ఫిజికల్ టాస్కులు ఇచ్చారు. అలాగే, దెయ్యం టాస్కును కూడా నిర్వహించారు. ఇందులో ఆది రెడ్డి, శ్రీహాన్ అదరగొట్టేశారు. దీన్ని గురువారం జరిగిన టాస్కులోనూ కంటిన్యూ చేసేశారు.

  తన డబ్బే కట్ అయినట్లుగా

  తన డబ్బే కట్ అయినట్లుగా

  బిగ్ బాస్ ఆరో సీజన్ పద్నాలుగో వారంలో కంటెస్టెంట్లకు టాస్కులు ఇస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే శ్రీ సత్యను కన్ఫెషన్ రూమ్‌కు రమ్మని పిలిచారు. కానీ, ఆమె మాత్రం భయంతో లోపలికి వెళ్లలేదు. దీంతో డబ్బు కోల్పోవాల్సి వచ్చింది. ఈ విషయంపై రేవంత్ తన డబ్బులే కట్ అయినట్లుగా శ్రీ సత్యపై గొడవ పడ్డాడు. దీనిపై అతడికి విమర్శలు వెల్లువెత్తాయి.

  గుర్తుందా శీతాకాలం ట్విట్టర్ రివ్యూ: తమన్నాతో సత్యదేవ్ రొమాన్స్.. సినిమా టాక్ అలా.. ఇంతకీ హిట్టేనా!

  రేవంత్ ఎంట్రీ.. ఈజీగానే

  రేవంత్ ఎంట్రీ.. ఈజీగానే

  గురువారం జరిగిన ఎపిసోడ్‌లో భాగంగా రేవంత్‌ను బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచాడు. అందరిలా కాకుండా అతడు చాలా ఈజీగానే హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అంతేకాదు, పెద్దగా భయపడినట్లు కూడా కనిపించలేదు. దీనికి తగ్గట్లుగానే బిగ్ బాస్ టీమ్ కూడా అతడిపై పెద్దగా ఏకాగ్రతను కూడా చూపించలేదన్నట్లుగా అనిపించడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

  వాళ్ల హెల్ప్.. విన్నర్ ప్లాన్

  వాళ్ల హెల్ప్.. విన్నర్ ప్లాన్


  కన్ఫెషన్ రూమ్‌లో ఉన్నప్పుడు రేవంత్‌ను సూర్య కప్ వెతకమని టాస్క్ ఇచ్చాడు. అతడు మాత్రం అలా వెతకడం మొదలెట్టగానే దెయ్యం రూపంలో ఉన్న ఒకరు కప్‌ను రేవంత్‌ ముందు విసిరేశారు. దీంతో అతడు దాన్ని అందుకుని బయటకు వెళ్లిపోయాడు. దీనిబట్టి రేవంత్‌ను విజేతగా చేయడానికి బిగ్ బాస్ ప్లాన్ చేస్తున్నాడని అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

  English summary
  Bigg Boss Telugu Telugu 6th Season Running Successfully. Now Show Team Helps Singer Revanth in Deyyam Task in Recent Episode.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X