అఖిల్ పులి కాదు.. ఆటలో కరివేపాకు.. అభిజిత్ ఊరమాస్.. #BiggBossTelugu4 ట్రోల్స్ ట్రెండింగ్
బిగ్‌బాస్ రియాలిటీషో 71వ రోజున జరిగిన నామినేషన్ల ప్రక్రియ ఇంటిలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా చిచ్చు పెట్టింది. ఇంటిలో మాదిరిగానే ట్విట్టర్‌లో అఖిల్, అభిజిత్ అభిమానులు పోస్టులతో రెచ్చిపోయారు. బిగ్‌బాస్ ఎపిసోడ్ ముగియక ముందే ట్విట్టర్‌లో #Akhil, #BiggbossTelugu4 హ్యాష్ ట్యాగ్స్ ఇండియా వైడ్ ట్రెండింగ్‌గా మారాయి. ఇంతకు ఈ ట్రెండింగ్‌కు కారణం ఏమిటంటే..

అభిజిత్ వర్సెస్ అఖిల్
నామినేషన్ల ప్రక్రియలో భాగంగా తాను సీక్రెట్ రూమ్‌లో ఉండగా అభిజిత్ చేసిన కామెంట్లను అఖిల్ తెరపైకి తెచ్చాడు. మటన్ షాపు వాడు మేకకు గడ్డివేస్తే లోపలికి వెళ్లింది. కానీ అక్కడ ఏమి జరగలేదు. ప్రొటీన్స్ తినిపించి మేకను పులిలా బయటకు వదిలాడు అంటూ కామెంట్ చేయగా మేక పులి కాదు.. మేక బలి అవుతుంది అంటూ అభిజిత్ ఘాటుగా సమాధానం ఇచ్చాడు. అలా వారి మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది.

ఆటలో కరివేపాకు అంటూ
అఖిల్, అభిజిత్ గొడవపై నెటిజన్లు స్పందిస్తూ.. అఖిల్ సీక్రెట్ రూమ్‌ను వచ్చిన తర్వాత పులి అనుకొంటున్నాడు. కానీ అతడు బిగ్‌బాస్ ఆటలో కరివేపాకు అంటూ ఓ నెటిజన్ మీమ్‌ను పోస్టు చేశాడు.

అభిజిత్‌కు ఫస్ట్ టైమ్ సపోర్ట్ చేస్తున్నా
వాస్తవానికి నేను అరియానాకు సపోర్ట్ చేస్తాను. ఆమె ముక్కుసూటి తనం, నిజాయితీగా ఉండటం ఇష్టపడి ఓట్లు వేసే వాడిని. కానీ ఆమె అఖిల్, సోహెల్‌కు ఇన్‌ఫ్లూయెన్స్ అయని తర్వాత నేను అభిజిత్‌కు సపోర్టు చేస్తున్నాను. బిగ్‌బాస్ తొలి సీజన్‌లో అభిజిత్‌ను ఫసట్్ టైమ్ సపోర్ట్ చేస్తున్నా అని మరో నెటిజన్ పేర్కొన్నారు.

అఖిల్ ఫ్యాన్‌గా గర్వ పడుతున్నా
బిగ్‌బాస్ ఆటలో నీవు బెస్ట్ ఇవ్వాలి. నీ ఫ్యాన్‌ను అయినందుకు చాలా గర్వంగా ఉంది. లవ్ యూ అఖిలూ.. నీ బర్త్ డే రోజున శుభాకాంక్షలు. నీవు బిగ్‌బాస్ ట్రోఫిని గెలుచుకొని ఇంటి నుంచి బయటకు రావాలని కోరుకొంటున్నాను అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.

అభిజిత్ చెత్త కంటెస్టెంట్
బిగ్‌బాస్ రియాలిటీ షో కోసం అభిజిత్ పీఆర్ టీమ్ రెచ్చిపోతున్నది. బిగ్‌బాస్‌లో చెత్త కంటెస్టెంట్ అతడే. చాలా బద్దకస్తుడు. టాస్క్‌లకు పనికి రాని వాడు. అభిజిత్ అంటే ఏమిటో అఖిల్, సోహెల్ ఎండగట్టాడు. హారిక నోరును సోహెల్ మూయించాడు అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

అభిజిత్ ఊరమాస్ అంటూ
అభిజిత్ ఊరమాస్.. అఖిల్‌కు చుక్కలు చూపించాడు. ప్రోమోలోనే నీళ్లు తాగించాడు. అఖిల్‌కు భలే ఇచ్చాడే అంటూ మరో నెటిజన్ స్పందించాడు. ఇలాంటి కామెంట్లు భారీ సంఖ్యలో ట్విట్టర్‌లో వైరల్ కావడం కనిపించింది. అభిజిత్, అఖిల్ వర్గాలు సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేసుకొంటూ కనిపించాడు.
Recommended Video
నిజస్వరూపం బయటపడింది
71వ రోజు ఎపిసోడ్ చూస్తే.. అఖిల్, సోహెల్ పూర్తిగా తమపై తామే నియంత్రణ కోల్పోయినట్టు స్పష్టమైంది. వారి ప్రవర్తన, నిజస్వరూపం ఏమిటో బయటపడింది. బిగ్‌బాస్ హిస్టరీలోనే వరస్ట్ కంటెస్టెంట్స్ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.


Click it and Unblock the Notifications











