»   » బాగ్ బాస్ 2: ఇంట్లోకి ఎంటరైన కొత్త బ్యూటీ... ఆమె అందానికి అందరూ ఫిదా!

బాగ్ బాస్ 2: ఇంట్లోకి ఎంటరైన కొత్త బ్యూటీ... ఆమె అందానికి అందరూ ఫిదా!

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  ఇంట్లోకి ఎంటరైన కొత్త బ్యూటీ... ఆమె అందానికి అందరూ ఫిదా!

  బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 విజయవంతంగా తొలి వారం పూర్తి చేసుకుంది. బిగ్ బాస్ గేమ్‌లో భాగంగా ప్రతి వారం ఇంటి నుండి ఒకరు ఎలిమినేట్ అవ్వడం తప్పనిసరి. తొలి ఎలిమినేషన్లో ప్రేక్షకులు సంజనను బయటకు పంపేశారు. అయితే ఎవరూ ఊహించని విధంగా బిగ్ బాస్ ఇంట్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ రూపంలో.... కొత్త కంటెస్టెంట్ ఎంటరైంది. ఆమె ఎవరో కాదు హీరోయిన్ నందినీ రాయ్. ఈ హాట్ బ్యూటీ బిగ్ బాస్ ఇంట్లోకి కొత్త కంటెస్టెంటుగా ఎంటరవుతున్నట్లు ఆదివారం రాత్రి ప్రసారమైన షోలోనే నాని ప్రకటించారు. సోమవారం నుండి ప్రసారం అయ్యే షోలో నందినీ రాయ్ ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయబోతోంది.

  ఇంట్లోకి ఎంటరైన నందినీ రాయ్

  ఇంట్లోకి ఎంటరైన నందినీ రాయ్

  సోమవారం ఉదయం నందినీ రాయ్ బిగ్ బాస్ ఇంట్లోకి ఎంటరైంది. నందినీ రాయ్ ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వగానే ఇంటి సభ్యులంతా ఆశ్చర్యపోయారు. అందరూ కలిసి వెళ్లి ఆమెను ఇంట్లోకి సాదరంగా ఆహ్వానించారు.

  నందినీ రాయ్ అందానికి ఫిదా

  నందినీ రాయ్ అందానికి ఫిదా

  నందినీ రాయ్ అందం చూసి ఇంటి సభ్యులు ఫిదా అయిపోయారు. ఇక బిగ్ బాస్ ఇంట్లోని మేల్ కంటెస్టెంట్స్ నందినీ రాయ్ అందం చూసి ఫిదా అయిపోయారు. ఆమె రాకతో వారిలో మరింత ఉత్సాహం నెలకొంది.

  గ్లామర్ అద్దేందుకేనా?

  గ్లామర్ అద్దేందుకేనా?

  మొదటి సీజన్లో బిగ్ బాస్ షోకు గ్లామర్ అద్దేందుకు దీక్షా పంత్‌ను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఆ తరహాలోనే ఈ రెండో సీజన్లో షోను మరింత గ్లామరస్‌గా మార్చేందుకు నందినీ రాయ్‌ను ప్రవేశ పెట్టినట్లు తెలుస్తోంది.

  ఎవరీ నందినీ రాయ్?

  ఎవరీ నందినీ రాయ్?

  నందినీ రాయ్ హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన అమ్మాయి. సెయింట్ ఆల్బన్స్ హై స్కూల్‌లో చదువుకుంది. లండన్ వెళ్లి ఉన్నత చదువులు చదువుకుంది. ఫైనాన్స్‌లో ఎంబీఏ పూర్తి చేసింది. తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. పలు బ్యూటీ కాంటెస్టుల్లో పాల్గొని 2008లో మిస్ హైదరాబాద్, 2010లో మిస్ ఆంధ్రప్రదేశ్, 2009లో మిస్ పాంటలూన్స్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ఏపి, 2010లో మిస్ బ్యూటిఫుల్ ఐస్ ఆఫ్ ఏపి టైటిల్స్ దక్కించుకుంది.

  సినిమాల్లోకి...

  సినిమాల్లోకి...

  2011లో ఫ్యామిలీ ప్యాక్ అనే హిందీ సినిమా ద్వారా నందినీ రాయ్ తన సినిమా కెరీర్ మొదలు పెట్టింది. ఆ తర్వాత 040 అనే మూవీ ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంటరైంది. ఆ తర్వాత హార్మోన్స్, మాయా, మోసగాళ్లకు మోసగాడు లాంటి తెలుగు చిత్రాలతో పాటు తమిళ, కన్నడ చిత్రాల్లో నటించింది.

  యాక్సిడెంట్ కారణంగా వారం లేటుగా నందినీ రాయ్

  వాస్తవానికి నందినీ రాయ్ బిగ్ బాస్ మొదటి రోజే ఇంట్లోకి ఎంటరవ్వాల్సి ఉండగా గాయం కారణం రాలేక పోయింది. దీంతో ఆమె స్థానంలో సంజన బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చింది. అయితే సంజన ప్రేక్షకులు ఆదరణ దక్కించుకోలేక పోవడంతో ఎలిమినేట్ అయింది. దీంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా నందినీ రాయ్‌కు బిగ్ బాస్ షోలో మళ్లీ అవకాశం కల్పించారు.

  English summary
  After Sanjana Elimination new contestant Nandini Rai entered in to the House in Bigg BossTelugu 2. Just when fans thought the contestants’ count had reduced by one, model turned actress Nandini Rai entered the show. She explained that she was supposed to make an entry on day 1, but it was postponed due to an injury. We think entering a week later provides her with a leverage over everyone else. We hope she would use it to its full potential. Though, she is yet to enter the main house after Bigg Boss’instructionss. This week on Bigg Boss Telugu 2 is going to be awesome with contestants unaware about the new entrant.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more