twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 4 గ్రాండ్ ఫినాలే‌లో భారీ ట్విస్టులు.. ఆ రికార్డుపైనే టార్గెట్.. ఎలిమినేషన్ ప్రక్రియ ఇలా..

    |

    బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్ ఎలాంటి ఇబ్బందులు, వివాదాలు లేకుండా విజయవంతంగా ముగియబోతున్నది. కరోనావైరస్ విజృంభిస్తున్న సమయంలో అనేక అనుమానాలు, కట్టుదిట్టమైన చర్యల మధ్య హోస్ట్ నాగార్జున అక్కినేని ఆధ్వర్యంలో సానుకూలంగా మొదలైంది. ఈ క్రమంలో ముగింపు వేడుకలపై ప్రేక్షకుల ఆసక్తి మరింత రెట్టింపైంది. శనివారం, ఆదివారం బిగ్‌బాస్ ఇంటిలో జరగబోయే షూట్ వివరాలు ఇలా ఉన్నాయి..

     షూట్ స్టార్ట్

    షూట్ స్టార్ట్

    బిగ్‌బాస్ తెలుగు 4‌కు సంబంధించిన గ్రాండ్ ఫినాలే షూట్ శనివారం 12 గంటల ప్రాంతంలో మొదలు పెట్టేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. 12 గంటల తర్వాత వినోద కార్యక్రమాలను షూట్ చేయడం ద్వారా ఎలిమినేషన్ ప్రక్రియను ప్రారంభించేందుకు షెడ్యూల్‌ను ఖరారు చేశారు.

    తాజా ఓటింగ్ వివరాల ప్రకారం

    తాజా ఓటింగ్ వివరాల ప్రకారం

    శుక్రవారం అర్ధరాత్రి ఓటింగ్ లైన్లు ముగిసిన తర్వాత ఓటింగ్ వివరాలు ఇలా ఉన్నాయి. టాప్ 5 కంటెస్టెంట్లలో దేత్తడి హారికకు అత్యల్పంగా ఓట్లు వచ్చాయని, అత్యధికంగా రికార్డు స్థాయిలో అభిజిత్‌కు ఓట్లు లభించాయనే విషయం బయటకు వచ్చింది. అనధికారికంగా అభిజిత్ విజేత అనేది ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతున్నది.

     ఎలిమినేషన్ ప్రక్రియ ఇలా

    ఎలిమినేషన్ ప్రక్రియ ఇలా

    14వ వారంలో ఓట్ల ప్రక్రియ ముగిసిన తర్వాత నమోదైన వివరాల ప్రకారం ఎలిమినేషన్ ప్రక్రియ ఇలా కొనసాగే అవకాశముందనే వార్తలు బయటకు వచ్చాయి. టాప్ 5 లిస్టులో నుంచి తొలి కంటెస్టెంట్‌గా దేత్తడి హారిక, ఆ తర్వాత టాప్ 4 కంటెస్టెంట్‌గా అఖిల్, మూడో కంటెస్టెంట్‌గా అరియానాను ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది.

    కంటెస్టెంట్లకు ట్విస్టులు

    కంటెస్టెంట్లకు ట్విస్టులు

    టాప్ 3 కంటెస్టెంట్లకు షాకిచ్చే విషయాలను నిర్వాహకులు ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది. టాప్ 3 కంటెస్టెంట్ల ముందు 25 లక్షల రూపాయల సూట్ కేస్ పెట్టే అవకాశం ఉంది. ఎవరైనా సరే తాను విజేతగా నిలవనని భావించిన వ్యక్తి సూట్ కేస్ తీసుకొని బయటకు వెళ్లడానికి ఛాన్స్ ఇస్తున్నామని ఆఫర్‌తో ట్విస్టు ఇచ్చే అవకాశం ఉంది.

    ఇంటి సభ్యులను వేదికపైకి

    ఇంటి సభ్యులను వేదికపైకి

    గత సీజన్లలో జరిగిన విషయాలను బట్టి చూస్తే.. ఇంటిలోకి హోస్ట్ నాగార్జున వెళ్లి టాప్ 2 కంటెస్టెంట్లను బయటకు తీసుకొచ్చే ప్రక్రియ ఉండవచ్చు. అలా వేదిక మీదకు తీసుకొచ్చిన కంటెస్టెంట్లతో వారి అనుభవాలను, ఫన్ రిలేటెడ్ ప్రశ్నలు అడిగి ఫైనల్‌గా విజేతను ప్రకటించే ప్రాసెస్ జరుగుతున్నది. ఎలిమినేషన్ ప్రక్రియను కొనసాగిస్తూనే ప్రేక్షకులను సరికొత్త అనుభూతికి గురిచేసే వినోద కార్యక్రమాలను డిజైన్ చేసినట్టు తెలిసింది.

    ముఖ్య అతిథిగా చిరంజీవి

    ముఖ్య అతిథిగా చిరంజీవి

    తాజా సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి మరోసారి బిగ్‌బాస్ తెలుగు వేదికపైన మెరువనున్నారు. ఇప్పటికే చీఫ్ గెస్ట్‌గా చిరంజీవిని నిర్వాహకులు కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తున్నది. మెగాస్టార్ చేతులు మీదుగా విజేతకు టైటిల్‌ను అందించే ఏర్పాట్లు చేశారు. ఈ షూట్ శనివారం రాత్రికి పూర్తయ్యే అవకాశం ఉంది.

     ఫైనల్ ఎపిసోడ్ టెలికాస్ట్

    ఫైనల్ ఎపిసోడ్ టెలికాస్ట్

    బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్ డిసెంబర్ 20వ తేదీన ముగియనున్నది. ఈ ఫైనల్‌కు సంబంధించిన ఎపిసోడ్‌ను ఆదివారం రోజు సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు ప్రసారం కానున్నది. ఈ మేరకు ఫినాలేను గ్రాండ్‌గా ముగించే పనుల్లో నిర్వాహకులు నిమగ్నమయ్యారు. వారాంతం షో ద్వారా గతంలో ఏ సీజన్‌కు రాని భారీ టీఆర్పీని రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.

    English summary
    Bigg Boss Telugu 4 Grand Finale all set hit the audience. Endemol shine india organiser are looking at grand event and Star Maa is plaaning Huge TRP rating. Organiser planned that Elimination process going to hit huge TRP.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X