Just In
- 28 min ago
ఊపిరి పీల్చుకో బాక్సాఫీస్.. మరో కొన్ని నెలల్లో కిక్కిచ్చే సినిమాలతో రాబోతున్న స్టార్ హీరోలు
- 1 hr ago
క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి మరో షాకింగ్ లుక్.. 16ఏళ్ల కూతురు, ఎక్స్‌పోజింగ్‌తో చంపేసిందిగా..
- 2 hrs ago
RRR పోస్టర్.. ఆ సినిమా నుంచి తస్కరించారట.. రాజమౌళిపై మరోసారి ట్రోలింగ్స్
- 11 hrs ago
ఎస్సీ బాలసుబ్రహ్మణ్యంకు పద్మ విభూషణ్.. గానగంధర్వుడికి ఘన నివాళి
Don't Miss!
- News
నిమ్మగడ్డ అదను చూసి దెబ్బకొట్టారా ? జగన్ కొంపముంచిన నిర్ణయమిదే- టర్నింగ్ పాయింట్
- Sports
మౌమా, సుధా సింగ్‌తో సహా ఏడుగురికి పద్మశ్రీ
- Automobiles
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Bigg Boss Grand Finale: బిగ్‌బాస్ వేదికపై సాయి పల్లవి.. షాకింగ్‌గా అరియానా గ్లోరికి ఓట్లు!
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో 4వ సీజన్ ఆదివారానికి సంబంధించిన ఎపిసోడ్ షూటింగ్ రసవత్తరంగా కొనసాగుతున్నది. హోస్ట్ నాగార్జున తనదైన శైలిలో కంటెస్టెంట్లతో మాట్లాడుతూ.. గ్రాండ్ఫినాలే ఎపిసోడ్‌ను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తున్నది. గ్రాండ్ ఫినాలేకు సంబంధించిన మరిన్నీ వివరాలు మీ కోసం..

టిక్‌టాక్ స్టార్లు,కోరియోగ్రాఫర్లతో
ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో మధ్యలో వినోదం కోసం పలువురితో వినోద కార్యక్రమాలను షూట్ చేస్తున్నారు. టిక్ టాక్ స్టార్స్, సినీ ప్రముఖులు, కొరియోగ్రాఫర్లు తమ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌తో ఆదరగొట్టినట్టు సమాచారం.

మధ్యాహ్నం తర్వాత కీలక సన్నివేశాలు
శనివారం మధ్యాహ్నం వరకు కొంత షూటింగ్ ముగిసిందని, లంచ్ బ్రేక్ కారణంతో షూటింగ్ ఆగిపోయిందనే విషయం బయటకు వచ్చింది. మధ్యాహ్నం తర్వాత మళ్లీ ఫైనల్ రౌండ్ ఆఫ్ షూటింగ్ కొనసాగుతుందనేది సమాచారం. మధ్యాహ్నం తర్వాత ఫైనల్‌కు సంబంధించిన కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నట్టు సమాచారం.

బిగ్‌బాస్ వేదికపై సాయిపల్లవి
ఇక బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేలో సినిమా ప్రమోషన్ కోసం శేఖర్ కమ్ముల టీమ్ సందడి చేయనున్నారు. అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న లవ్ స్టోరి చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమోషన్ కోసం చిత్ర యూనిట్ వేదిక మీద హంగామా చేసే అవకాశం ఉంది. అయితే సాయి పల్లవి కూడా బిగ్‌బాస్ వేదిక మీద మెరిసే ఛాన్స్ కనిపిస్తున్నది.

రన్నరప్‌గా అరియానా గ్లోరి
ఇక ఇదిలా ఉండగా.. ఫైనల్ డే ఓటింగ్ తర్వాత ఓట్ల శాతంలో భారీ తేడా వచ్చిందనేది తాజా సమాచారం. ఫైనల్ ఓటింగ్ కౌంట్ తర్వాత అరియానా రెండోస్థానంలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అయితే అరియానా అందరి అంచనాలు తలకిందులు చేస్తూ నాలుగో స్థానంలో నిలిచిందనే సోషల్ మీడియా వార్తలతో అభిమానులు నిరాశ చెందుతున్నారు.