Don't Miss!
- News
vastu tips: నట్టింట్లో కూర్చుని జుట్టు దువ్వుకుంటున్నారా? అరిష్టం.. ఎందుకంటే!!
- Sports
INDvsNZ : తొలి టీ20లో గిల్ ఆడతాడు.. పృథ్వీ షాకు ఛాన్స్ లేదు: హార్దిక్ పాండ్యా
- Finance
upi limit: UPI తో ఎంత డబ్బు పంపించవచ్చో తెలుసా ? అంతకు మించి పంపాలంటే..
- Lifestyle
ఈ ఆహారాలకు ఎక్స్ పైరీ డేట్ ఉండదని మీకు తెలుసా?
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
అంతా తిరిగి ఇచ్చేస్తాను.. ఎమోషనల్‌గా బిగ్‌బాస్ విజేత.. సాంట్లా క్లాజ్‌గా మారిన అభిజిత్
బిగ్‌బాస్ విజేతగా నిలిచిన అభిజిత్ దుడ్డాలపై ప్రజలు అద్బుతమైన ప్రేమను కురిపిస్తున్నారు. అభిమానులు, బుల్లితెర ప్రేక్షకుల అందిస్తున్న అభిమానంలో తడిసి ముద్దవుతున్నారు. బిగ్‌బాస్ విజేతగా నిలిచిన తర్వాత అత్యంత బిజీగా మారిన అభిజిత్ పిల్లలతో తన ప్రేమను పంచుకోవడం కనిపించింది. అందుకోసం క్రిస్మస్ తాతగా మారి ప్రేమను పంచారు. ఈ సందర్భంగా

సాంటా క్లాజ్‌గా అభిజిత్
గత నాలుగైదు రోజులుగా ఎడతెరిపి లేకుండా అభిజిత్ మీడియాతో ఇంటారాక్ట్ అవుతున్నారు. పలు టీవీ, యూట్యూబ్ ఛానెల్స్‌కు ఇంటర్వ్యూలతో బిజీగా మారిపోయారు. అయితే క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని అభిజిత్ సాంటా క్లాజ్‌గా మారిపోయారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రజలను కలుసుకొని తన ప్రేమను పంచుకొంటూ బహుమతులను అందించారు.

క్రిస్మస్ పండుగ రోజున వీధుల్లోకి
క్రిస్మస్ రోజున ఉదయమే వీధుల్లోకి వెళ్లి పండుగ ఘనంగా జరుపుకొన్నారు. చిన్న పిల్లలకు ప్రేమను పంచుతూ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. తనకు తాను సాంటా అభి అంటూ ఉత్సాహంతో ముందుకుపోయారు. బాలలు, వృద్ధులు, ట్రాఫిక్ పోలీసులతో కరచాలనం చేస్తూ ప్రజలపై అభిమానాన్ని చాటుకొన్నారు.

నాపై ఎనలేని ప్రేమను కురిపిస్తున్నారు
తన అభిమానుల గురించి అభిజిత్ మాట్లాడుతూ.. బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడు నాపై ఎంతో ప్రేమను కురిపించారు. వెలకట్టలేని అభిమానాన్ని పంచారు. వారికి నేను ఏదో రూపంలో తిరిగి ఇవ్వాలనుకొంటున్నాను. అందుకే కేబీఆర్ పార్కులో వద్ద సాంటా డ్రస్ వేసుకొని ప్రజలను కలుసుకొన్నాను. వీధి బాలలు, తోపుడు బండ్ల మీద అమ్ముకొనే చిన్న వ్యాపారులను, పోలీసులను కలిశాను అని అభిజిత్ తెలిపారు.

ప్రకృతి విలువ తెలిసి వచ్చింది
కోవిడ్ 19 వల్ల ప్రకృతి విలువ, ప్రాముఖ్యత తెలిసి వచ్చింది. భూమాతకు జరుగుతున్న నష్టం అందరు తెలుసుకొంటున్నారు. అందుకే మొక్కలను, సీడ్స్‌ను పంచుతూ వృక్ష రక్షణ గురించి అవగాహన కల్పించాలనుకొంటున్నాను.

అనాధ పిల్లలతో బిగ్‌బాస్ విజేత
క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని అనాధశరణాలయాలను సందర్శించాను. అక్కడి పిల్లలతో కలిసి వేడుకలు జరుపుకొన్నాను. వారికి బహుమతులు, చాక్లెట్లు, బాడ్మింటన్ రాకెట్స్, క్యారమ్ బోర్డులు, ఇతర ఆట వస్తువులను వారికి అందించాను అని అభిజిత్ తెలిపారు.