Just In
- 31 min ago
ఎయిర్‌పోర్టులో మోనాల్‌కు ఊహించని షాక్: ఆ పేరుతో కామెంట్స్ చేయడంతో తట్టుకోలేక ఇలా!
- 1 hr ago
తెలుగులో ఆ హీరో అంటేనే ఇష్టమన్న రోజా: అలాంటి వాళ్ల వల్లే సినిమాలు చేయట్లేదంటూ!
- 2 hrs ago
యంగ్ హీరో అమర్‌పై ఆరియానా ఆరోపణలు: ఏకంగా ఆమె ఇంటికెళ్లి రచ్చ.. నా ప్రాణం అంటూ అలా!
- 2 hrs ago
ప్రముఖ నిర్మాతకు భారీ షాకిచ్చిన నమ్రత శిరోద్కర్: మీ భార్య మిస్టేక్ చేసిందంటూ మహేశ్ బాబుకు ట్వీట్
Don't Miss!
- Finance
సరికొత్త రికార్డును తాకిన HCL టెక్, కొత్తగా 20,000 ఉద్యోగాలు
- Sports
పాండ్యా సోదరుల ఇంట విషాదం.. టోర్నీ మధ్యలోంచి ఇంటికెళ్లిన కృనాల్!!
- News
మోడీ భావోద్వేగం: వారి రుణాన్ని తీర్చుకుంటున్నాం: ఎన్నో యుద్ధాలతో సమానం
- Automobiles
షూటింగ్ స్పాట్‌కి 12 కి.మీ సైకిల్‌పై వెళ్లిన రకుల్ ప్రీత్ సింగ్.. ఎందుకో మరి
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Bigg Boss Telugu Elimination అరియానాపై మనసు పడ్డ అఖిల్.. బెస్ట్ ఫ్రెండ్‌తో అవినాష్ ఫైట్.. మాట్లాడటం మానేస్తా!
బిగ్‌బాస్ ఇంటిలో 13వ వారాంతంలో రొమాంటిక్ మూమెట్స్ చాలానే కనిపించాయి. గేమ్ దగ్గరపడుతుండటంతో ఇంటి సభ్యులు రిలాక్స్ అవుతూ కనిపించారు. వీకెండ్ టాస్క్‌లను ఆడుతూ చిల్ అయ్యారు. ఇంకా ఇంటిలో 90వ రోజు ఏమి జరిగిందంటే...

అరియానాను చూసి అఖిల్ అలా
ఇంటి సభ్యులు అరియానాను ఆటపట్టిస్తూ కనిపించారు. అరియానాను చూసి అఖిల్ మనసు పారేసుకొంటున్నారనే టాపిక్‌పై చర్చ జరిగింది. ముందు నిన్ను ఎందుకు చూడలేదో అని అఖిల్ నాతో అన్నాడని అరియానా చెప్పింది. అరియానా అంటూ ఇష్టమని అఖిల్ చెప్పాడని అవినాష్ కూడా తెలిపాడు. ఇంట్లో ఒక్కరిని కూడా అఖిల్ వదలడం లేదని సోహెల్ అనడం కనిపించింది. దివిని కూడా చూసి పాటపడాడనే విషయాన్ని సోహెల్ పేర్కొన్నాడు.

వంటపోటీలతో హంగామా
ఇక ఇంటిలో ఎంటీఆర్ మసాలా వాళ్లు వంటల పోటీలు పెట్టారు. అందుకోసం సభ్యులను రెండు టీములుగా విభజించారు. హారిక, సోహెల్ సంచాలకులుగా వ్యవహరించారు. ఆ తర్వాత వంట రుచులను చూసి ఎవరు బాగా చేశారనే విషయాన్ని చెప్పారు. రెండు జట్లు బాగా చేశారని చెబుతూ వారికి గిఫ్ట్ హ్యాంపర్‌ను అందించారు.

అవినాష్‌కు లాజిక్స్ తెలియవంటూ అరియానా
ఇక ఇంటిలో అభిజిత్, అరియానా ఓ చోట కూర్చొని రిలాక్స్ అవుతూ మాట్లాడుకొన్నారు. నాకే నేను అంటూ ప్రాణం. నన్ను నేను బాగా ప్రేమించుకొంటాను అని అరియానా అన్నారు. అయితే ఈ విషయం అవినాష్‌కు తెలుసా? అని అభిజిత్ అంటే.. అలాంటి లాజిక్స్ అవినాష్‌కు తెలియవు అని అరియానా అన్నారు.

నాకు లాజిక్స్ తెలియవా? అంటూ అవినాష్ ఫైర్
అయితే లాజిక్కులు తెలియవనే విషయంపై సీరియస్ అయ్యాడు. నాకు లాజిక్ తెలియకుండానే ఇంత వరకు వచ్చానా.. ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడు అని అవినాష్ ఘాటుగా స్పందించాడు. అయితే అవినాష్‌కు వివరణ ఇవ్వడానికి అరియానా ప్రయత్నించగా.. మాట్లాడకు అంటూ సీరియస్ అయ్యాడు. దాంతో నీతో మాట్లాడటం మానేస్తా అంటూ అరియానా సీరియస్ అయ్యింది.

ఇంటి సభ్యులను కన్ఫెషన్ రూమ్‌కు పిలిచి
ఆ తర్వాత ఇంటి సభ్యులతో నాగ్ మాట్లాడారు. ఇంటి సభ్యులు ఎమోషనల్ కావడంతో వారిలో కొందరిని కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి మాట్లాడారు. అభిజిత్ గత వారం తాను చేసిన తప్పుకు పశ్చత్తాపం గురించి చెప్పాడు. హారిక, అవినాష్ కూడా తన బాధలు చెప్పుకొన్నారు. వారి బాధలన్నింటిని విన్న హోస్ట్ నాగార్జున అన్ని ప్రశ్నలకు క్లారిటీ ఇచ్చారు.

ఫస్ట్ ఫైనలిస్టు అఖిల్ సార్థక్
ఇక ఇంటిలో రోడ్ టూ ఫినాలే టాస్క్ గెలుచుకొన్న అఖిల్‌కు మెడల్ ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అయితే తాను ఎలిమినేషన్ నుంచి బయటపడిన తర్వాత మెడల్ తీసుకొంటానని అఖిల్ అంటే.. పర్వాలేదు.. ముందు మెడల్ తీసుకోమని నాగ్ సూచించాడు. దాంతో సోహెల్‌తో మెడల్‌ను వేయించుకోవడంతో ఈ సీజన్‌లో ఫైనల్లోకి ప్రవేశించిన తొలి కంటెస్టెంట్‌గా అఖిల్ రికార్డు క్రియేట్ చేశారు. ఆ తర్వాత ఎలిమినేషన్ ప్రక్రియను మొదలుపెట్టి అఖిల్‌ను సేవ్ చేశాడు. దాంతో అఖిల్ సంతోషంలో మునిగిపోయారు.

బాండింగ్ బ్రేక్ గేమ్‌లో
చివరగా ఇంటి సభ్యులతో బాండింగ్ బ్రేక్ ఆడించారు. ఈ గేమ్‌లో భాగంగా.. తాను తన లక్ష్యానికి చేరుకోవడానికి అడ్డం పడుతున్న వారితో బంధాన్ని బ్రేక్ చేసుకోవాలని సూచించగా.. ప్రత సభ్యుడు ఓ పుల్లను విరిచి తన అభిప్రాయాన్ని చెప్పారు. ఈ గేమ్‌లో ఎక్కువ పుల్లలు మోనాల్, హారికకు లభించాయి. వారికి ఎక్కువ మందితో బాండింగ్ ఉందని హోస్ట్ నాగార్జున చెప్పి ఎపిసోడ్‌ను ముగించాడు.