Just In
- 2 min ago
ఉదయం పెళ్లి, రాత్రి మంది పార్టీ చేసుకొని ప్రమాదానికి గురైన హీరో.. గుట్టుచప్పుడు కాకుండా
- 29 min ago
అందరి ముందే రెచ్చిపోయిన మోనాల్: అఖిల్‌కు ముద్దుల మీద ముద్దులు.. ఊహించని ఘటనకు షాక్
- 1 hr ago
సింగర్ సునీత పెళ్లిపై రోజా సంచలన వ్యాఖ్యలు: ఆమె పిల్లలు ఎందుకు ఒప్పుకున్నారంటూ ఘాటుగా!
- 2 hrs ago
ప్రదీప్ మూవీ ప్రెస్మీట్లో అపశృతి: స్టేజ్‌పైనే కుప్పకూలిపోయిన డైరెక్టర్.. ఆయన పరిస్థితికి కారణమిదే!
Don't Miss!
- Automobiles
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
- News
నీ వెనుక మేం ఉన్నాం: ఆ విషయంలో జాగ్రత్త: అఖిల ప్రియకు చంద్రబాబు ఫోన్: ఫస్ట్‌టైమ్
- Finance
హైదరాబాద్ సహా ఆల్ టైమ్ గరిష్టానికి పెట్రోల్, డీజిల్ ధరలు
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు జనవరి 24వ తేదీ నుండి 30వ తేదీ వరకు
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అఖిల్‌కు ఏమైంది.. అలా బిహేవ్ చేస్తున్నాడేంటి.. హారికతో మోనాల్ గజ్జర్ ఆవేదన
బిగ్‌బాస్ తెలుగు 4 రియాలిటీ షోలో 12వ వారం నామినేషన్ ప్రక్రియ తర్వాత ఇంటిలో గంభీర వాతావరణ నెలకొన్నట్టు తాజా నిర్వాహకులు రిలీజ్ చేసిన ప్రోమోలో స్పష్టమైంది. ఇంటిలో ఒకరిని మరొకరు ఓదార్చుకొంటూ కనిపించారు. నామినేషన్ ప్రక్రియ గురించి ఇంటి సభ్యులు తలో విధంగా మాట్లాడుకొంటూ కనిపించారు. ఈ క్రమంలో మోనాల్ గజ్జర్ చేసిన కామెంట్లు ఆసక్తిగా మారాయి. హారికతో మోనాల్ మాట్లాడుతూ..

అఖిల్ తీరుతో మోనాల్ మనస్తాపం
నామినేషన్ ప్రక్రియ సందర్భంగా తనతో అఖిల్ ప్రవర్తించిన తీరుతో మోనాల్ మనస్తాపానికి గురైంది. తనను అపార్ధం చేసుకొంటూ చేసిన వ్యాఖ్యలతో మోనాల్ హర్ట్ కావడం తెలిసిందే. కెప్టెన్సీ టాస్క్ నుంచి ఇప్పటి వరకు నాకు సపోర్టు చేయడం లేదు. నీవు మాట ఇచ్చి తప్పుకొంటున్నావు. అదే నీ నైజం అంటూ అఖిల్ సార్థక్ చేసిన వ్యాఖ్యలు ఆమె కొంత ఆగ్రహం తెప్పించాయి.

అఖిల్ జెన్యూన్, సూపర్ కానీ..
అఖిల్ తీరుతో దిగ్బ్రాంతికి గురైన మోనాల్ బాధతో పడుకొని ఉంటే హారిక ఓదార్చేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో అఖిల్ సూపర్.. జెన్యూన్, పాజిటివ్ పర్సన్. కానీ అతడికి ఏమైందో అర్ధం కావడం లేదు అంటూ హారికతో మోనాల్ చెప్పుకొంటూ కనిపించింది. గత ఎపిసోడ్‌లో నీతో నాకు ఎమోషనల్ ఇష్యూస్ ఉన్నాయి. నీ గేమ్ నీదే.. నా గేమ్ నాదే అంటూ మోనాల్ ముఖంపైనే అఖిల్ చెప్పడం తెలిసిందే.

నేను సైలెంట్‌గా ఉండను అంటూ అఖిల్
ఇక నామినేషన్ ప్రక్రియ తర్వాత సోహైల్‌తో కలిసి అఖిల్ తన భావాలను పంచుకొన్నాడు. ఇక నుంచి మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండలేను. ఇక నుంచి గేమ్ ఆడాల్సిందే అంటూ సోహైల్‌తో అఖిల్ అన్నాడు. ఇలా అభిజిత్‌ను కూడా టార్గెట్ చేసినట్టు కనిపించాడు. తనలో ఆవేదనంతా సోహెల్ ముందు కక్కే ప్రయత్నం చేసినట్టు ప్రోమోలో కనిపించింది.

అభిజిత్‌పై అఖిల్ ఫైర్
ఇక హారిక స్వాప్ చేయడంతో మోనాల్‌ను నామినేషన్‌లోకి పంపించిన అభిజిత్ గురించి అఖిల్ మండిపడ్డాడు. మోనాల్ గురించి అభిజిత్ చాలా మాటలు చెప్పాడు. ఒకరిని తొక్కేసి పైకి రాను అంటూ మాటలు చెప్పే ఈ మనిషి.. మోనాల్ గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. నాకు సైప్ వద్దని ఒక్కమాట చెబితే ఏమవుతుంది అంటూ సోహైల్‌తో అఖిల్ చెబుతూ కనిపించాడు.