twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 5 ఆ నలుగురికి బిగ్‌బాస్ శిక్ష.. రెండోసారి కెప్టెన్‌గా విశ్వ.. క్షమాపణ చెప్పిన యాంకర్ రవి

    |

    బిగ్‌బాస్ తెలుగు 5 ఇంటిలో కెప్టెన్సీ కోసం పోటీదారులు టాస్క్, కెప్టెన్సీ టాస్క్ గందరగోళాలు, అలాగే మాటల యుద్ధం మధ్య పూర్తి అయింది. అయితే ఇంటి సభ్యులు నిబంధనలు ఉల్లంఘించడంతో ముగ్గురు పోటీదారులను, అలాగే ఇద్దరు సంచాలకులను బిగ్‌బాస్‌కు కెప్టెన్సీ టాస్క్ నుంచి తొలిగిస్తూ ఇంటి సభ్యులకు షాక్ ఇచ్చారు. ఇంతకు 38వ, 39f రోజు ఇంటిలో ఏం జరిగిందంటే..

    Recommended Video

    Bigg Boss Telugu 5 : కాజల్, సిరిలకు దిమ్మతిరిగే షాక్.. మా ఇష్టం అంటూ రెచ్చిపోయి..!| Filmibeat Telugu
    బిగ్‌బాస్ బొమ్మల ఫ్యాక్టరీ టాస్క్‌లో

    బిగ్‌బాస్ బొమ్మల ఫ్యాక్టరీ టాస్క్‌లో

    బిగ్‌బాస్ ఇంటిలో కెప్టెన్సీ టాస్క్‌ కోసం బిగ్‌బాస్ బొమ్మల ఫ్యాక్టరీ టాస్క్ జరుగుతున్న సమయంలో ప్రియ, విశ్వ, శ్రీరామచంద్రకు స్పెషల్ పవర్ లభించింది. ఆ పవర్ గురించి ఇంటి సభ్యులకు తెలియజేయండి అంటూ బిగ్‌బాస్ ఆదేశించాడు. దాంతో తన చేతిలో ఉన్న చిట్టీని ఒపెన్ చేసి చదివింది.

    ఆ పవర్ ప్రకారం ఎదుటి టీమ్‌లోని సగం బొమ్మలను పనికి రాకుండా, లెక్కలోనికి రాకుండా చేసే ఆప్షన్‌ను ఇచ్చారు. దాంతో ప్రియ తన ప్రత్యర్థి షన్ను చేసిన బొమ్మల నుంచి సగం బొమ్మలను తీసేసి కెప్టెన్సీ టాస్క్‌లో లేకుండా చేశారు.

    లోబో, శ్వేత, సిరి, కాజల్‌కు బిగ్‌బాస్ శిక్ష

    లోబో, శ్వేత, సిరి, కాజల్‌కు బిగ్‌బాస్ శిక్ష

    టాస్క్ జరిగే సమయంలో లోబో, శ్వేత బిగ్‌బాస్ ఇంటిలోని కుషన్స్‌ను దూది కోసం కట్ చేసి నష్టం చేశారు. సంచాలకులు సక్రమంగా విధులు నిర్వహించి ఉంటే.. ఈ చర్య జరగకుండా ఉండేది కాదు. బిగ్‌బాస్ ఇంటిలో వస్తువులకు నష్టం జరిగి ఉండేది కాదు. కాబట్టి లోబో, శ్వేత, యాంకర్ రవిని, అలాగే సంచాలకులుగా విఫలమైన కాజోల్, సిరి హన్మంతును కెప్టెన్సీ టాస్క్‌కు అనర్హులిగా ప్రకటిస్తున్నాం అని బిగ్‌బాస్ ఆదేశించాడు. అంతేకాకుండా కెప్టెన్సీ కోసం పోటీదారుల టాస్క్ ముగిసిందని ప్రకటించాడు.

    నిబంధనలు ఎలా ఉల్లంఘిస్తారని సిరి ప్రశ్న

    నిబంధనలు ఎలా ఉల్లంఘిస్తారని సిరి ప్రశ్న

    లోబో, శ్వేతా వర్మ చేసిన పనికి సిరి హన్మంతు షాక్ తిన్నది. ఎన్నో రోజులుగా కెప్టెన్సీ కోసం ట్రై చేస్తున్నాను. ఇలా మీరు నిబంధనలను ఉల్లంఘించడం సరికాదు అని సిరి హన్మంతు అన్నారు. ఇంటి సభ్యులు కూడా లోబో, శ్వేత, యాంకర్ రవి చర్యపై అసహనం వ్యక్తం చేశారు. అయితే ఈ తప్పును ముగ్గురం శిక్ష అనుభవించాల్సిందే అంటూ శ్వేత అన్నది.

    రవి క్షమాపణలు చెబుతూ..

    రవి క్షమాపణలు చెబుతూ..

    ఇక బిగ్‌బాస్ బొమ్మల ఫ్యాక్టరీ సందర్భంగా చేసిన తప్పుకు మొత్తం ఐదుగురు సభ్యులకు క్షమాపణ చెప్పాలని అనుకొంటున్నాను. సామ, దాన, బేధ, దండోపాయాలను ఉపయోగించాలని బిగ్‌బాస్ చెప్పిన ప్రకారం తాము ఆ నిర్ణయం తీసుకొన్నాం. అందుకు సిరి, కాజల్, లోబో, శ్వేతాకు క్షమాపణ చెబుతున్నాను అని యాంకర్ రవి అన్నారు.

    ఇసుకతో ఆట ఈజీ కాదు బేటా

    ఇసుకతో ఆట ఈజీ కాదు బేటా

    ఇక ఆరోవారం ఇంటి కెప్టెన్సీగా ఎంపిక కోసం మరో టాస్క్‌ను బిగ్‌బాస్ ప్రారంభించారు. ఇసుకతో ఆట ఈజీ కాదు బేటా అనే టాస్క్‌ను ఆడాలని చెప్పాడు. ఈ ఆట ప్రకారం లాన్‌లో ఉన్న ఇసుకను తమకు కేటాయించిన సంచుల్లో నింపుకొని మరోవైపు ఉన్న కంటైనర్‌లో నింపాలి. అలా ఎవరి కంటైనర్‌లో ఎక్కువ ఉంటుందో వారు కెప్టెన్సీ టాస్క్ విజేతలు అవుతారని చెప్పారు.

    రెండోసారి కెప్టెన్‌గా విశ్వ

    రెండోసారి కెప్టెన్‌గా విశ్వ

    ఇసుకతో ఆట ఈజీ కాదు బేటా అనే టాస్క్‌లో అని మాస్టర్, ప్రియ, మానస్, విశ్వ, సన్నీ శ్రీరామచంద్ర పాల్గొన్నారు. టాస్క్ ముగిసిన తర్వాత విశ్వ కంటైనర్‌లో ఎక్కువ ఇసుక ఉండటంతో ఆయనను కెప్టెన్‌గా ప్రకటించారు. ఇప్పటి వరకు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించిన ప్రియ తన వద్ద ఉన్న కెప్టెన్సీ బ్యాండ్‌ను విశ్వకు తొడిగారు. దాంతో విశ్వ రెండోసారి కెప్టెన్ అయ్యారు.

    English summary
    Bigg Boss Telugu 5 39th Day Oct 14th update: Captaincy task is finished in the house. Actor Vishwa has won Captaincy second time in the house.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X