For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 5: హౌస్‌లో రెచ్చిపోయిన యాంకర్ రవి.. అతడి మాటలకు బోరున ఏడ్చేసిన కంటెస్టెంట్

  |

  తెలుగు బుల్లితెరపై అసాధారణ రెస్పాన్స్‌తో గతంలో ఏ షోకూ సాధ్యం కాని విధంగా సూపర్ సక్సెస్ అయింది బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. మన ప్రేక్షకులు ఎప్పుడూ చూడని కాన్సెప్టుతో వచ్చినా.. ఈ ప్రోగ్రామ్‌కు భారీ స్థాయిలో స్పందనను అందించారు. తద్వారా సూపర్ డూపర్ హిట్‌ షోగా మార్చేశారు. అందుకే ఇది ఏకంగా నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. వాటిలో దేనికదే రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకుపోయింది. ఈ క్రమంలోనే గత ఆదివారం ఐదో సీజన్ కూడా అంగరంగ వైభవంగా ప్రారంభం అయింది. ఇందులో ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి ప్రవేశించారు. ఇక, ఈ సీజన్ ఆరంభం నుంచే అదరగొట్టేసే విధంగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సారి టైటిల్ ఫేవరెట్‌గా దిగిన యాంకర్ రవి రెచ్చిపోయాడు. దీంతో ఓ కంటెస్టెంట్ అందరి ముందే బోరున ఏడ్చేశారు. ఆ సంగతులు మీకోసం!

  Photo Courtesy: Star మా and Disney+Hotstar

  అంగరంగ వైభవంగా... వాళ్లంతా ఎంటర్

  అంగరంగ వైభవంగా... వాళ్లంతా ఎంటర్

  తెలుగు బుల్లితెర ప్రేక్షకుల ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ ఐదో సీజన్ గత ఆదివారం (సెప్టెంబర్ 5) అంగరంగ వైభవంగా ప్రారంభం అయింది. సీనియర్ హీరో అక్కినేని నాగార్జున సారథ్యంలో ఎంతో సందడిగా సాగిన ఈ ఎపిసోడ్‌లో ఏకంగా 19 మంది కంటెస్టెంట్లుగా వచ్చారు. వారిలో సిరి హన్మంత్, వీజే సన్నీ, షణ్ముక్ జశ్వంత్, ప్రముఖ నటి ప్రియ, యాంకర్ రవి, నటరాజ్ మాస్టర్, జబర్ధస్త్ ప్రియాంక సింగ్, లహరి, సింగర్ శ్రీరామచంద్ర, సరయు, జస్వంత్, శ్వేతా వర్మ, మానస్ షా, ఉమాదేవి, ఆర్జే కాజల్, లోబో, హమీదా, ఆనీ మాస్టర్, విశ్వలు బిగ్ బాస్ టైటిల్ కోసం పోటీ పడుతున్నారు.

  షర్ట్ మొత్తం విప్పేసిన సీరియల్ నటి: లోదుస్తులు కూడా లేకుండా మరీ పచ్చిగా కనిపించడంతో!

  ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగుతూ

  ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగుతూ

  సాధారణంగా బిగ్ బాస్ షో అంటే ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు ఉంటాయి. అందులోనూ నాలుగు సీజన్లను నేషనల్ రేంజ్‌లో హిట్లుగా మార్చుకున్న దీనికి అభిమానులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నారు. దీంతో ఐదో సీజన్‌పై ఆరంభం నుంచే భారీ బజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో షో నిర్వహకులు అదిరిపోయేలా దీన్ని డిజైన్ చేసినట్లు మొదట్లోనే తెలిసిపోయింది. ప్రేక్షకులకు మరింత మజాను అందించాలన్న ఉద్దేశంతో షోను ఆసక్తికరంగా నడిపించేందుకు ప్లాన్ చేశారు. అందుకు అనుగుణంగానే మొదటి ఎపిసోడ్‌లోనే నామినేషన్స్ టాస్క్‌ కొన్ని గొడవల కారణంగా రచ్చ రచ్చగా జరిగింది.

  టైటిల్ ఫేవరెట్‌గా యాంకర్ రవి ఎంట్రీ

  టైటిల్ ఫేవరెట్‌గా యాంకర్ రవి ఎంట్రీ

  గత సీజన్లతో పోలిస్తే ఈ సారి బిగ్ బాస్ కంటెస్టెంట్లుగా ఎంపికైన వారిలో ఎక్కువ మంది పాపులర్ అయిన వాళ్లే ఉన్నారు. సోషల్ మీడియా ద్వారానో.. బుల్లితెర వెండితెరపై సందడి చేసే వాళ్లుగానో పలువురు మంచి గుర్తింపును దక్కించుకున్న వాళ్లు వచ్చారు. ఇక, ఈ సీజన్‌లో 19 మంది కంటెస్టెంట్లుండగా.. అందులో పలువురు టైటిల్ ఫేవరెట్లు అనిపించుకుంటున్నారు. అలాంటి వారిలో యాంకర్ రవి ఒకడు. బుల్లితెరపై చాలా కాలంగా సందడి చేస్తోన్న అతడికి చాలా మంది అభిమానులు ఉండడమే దీనికి కారణం. దీంతో ఆరంభం నుంచే అతడి పేరు భారీ స్థాయిలో మారుమ్రోగిపోతోంది.

  అషు రెడ్డి ప్రైవేటు పార్ట్‌ను చూపించిన ఆర్జీవీ: పవన్ కల్యాణ్‌ కోసం ఆమెను బుక్ చేసేశాడుగా!

  నామినేషన్స్ టాస్కులోనే రవికి బిగ్ షాక్

  నామినేషన్స్ టాస్కులోనే రవికి బిగ్ షాక్

  బిగ్ బాస్ ఐదో సీజన్‌లోకి వచ్చిన కంటెస్టెంట్లు అందరిలోనూ యాంకర్ రవి చాలా ఫేమస్ అయిన కంటెస్టెంట్. దీంతో అతడిపై అందరిలోనూ భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే హౌస్‌లోని మిగిలిన కంటెస్టెంట్లు కూడా ఈ యాంకర్‌ను ప్రధాన పోటీదారుడుగా భావిస్తుంటారు. ఈ క్రమంలోనే గత సోమవారం జరిగిన నామినేషన్స్ టాస్క్‌లో రవిని పలువురు నామినేట్ కూడా చేశారు. దీంతో అతడు ఈ వారం ఎలిమినేషన్ జోన్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే, బయట అతడికి ఉన్న ఫాలోయింగ్ వల్ల ఎలిమినేట్ మాత్రం కాడన్న విషయం ప్రతి ఒక్కరికీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

   విశ్వకు పవర్స్... బట్టలు ఇచ్చేయాలని

  విశ్వకు పవర్స్... బట్టలు ఇచ్చేయాలని

  మంగళవారం నుంచి కెప్టెన్సీ పోటీదారుల కోసం బిగ్ బాస్ ఓ టాస్కును ఇస్తున్నట్లు చెప్పాడు. అందుకు అనుగుణంగానే హౌస్‌లో కొత్తగా ఏర్పటు చేసిన పవర్ రూమ్ గురించి వివరించాడు. ఆ తర్వాత ఉరుముల శబ్ధం వినిపించగానే కంటెస్టెంట్లు అందరూ.. ఆ రూమ్ బయట ఉన్న స్కానింగ్ డివైజ్‌పై చేయి పెట్టాలని, ముందుగా ఎవరు పెడతారో వాళ్లకు పవర్ రూమ్‌లోకి వెళ్లే అవకాశం లభిస్తుందని చెప్పాడు. ఇక, మొదటి శబ్ధం రాగానే యాక్టర్ విశ్వ గెలవడంతో లోపలికి వెళ్లాడు. ఆ సమయంలో అతడు కోరుకున్న ఇద్దరు కంటెస్టెంట్స్‌ ఒంటి మీద ఉన్న బట్టలతో సహా మొత్తం ఇచ్చేయాలని బిగ్ బాస్ చెబుతాడు.

  Bigg Boss Telugu 5: ఆదిలోనే యాంకర్ రవికి షాక్.. అతడికే ఎక్కువ మద్దతు.. లేడీస్‌లో ఆమెకు!

  రవి బట్టలు మాయం... రెచ్చిపోయాడు

  రవి బట్టలు మాయం... రెచ్చిపోయాడు

  టాస్కులో గెలిచిన విశ్వను ఇద్దరు కంటెస్టెంట్లను ఎంపిక చేసుకోమని బిగ్ బాస్ చెప్పగానే.. అతడు యాక్టర్ ప్రియతో పాటు యాంకర్ రవి పేర్లను చెబుతాడు. ఆ తర్వాత ఆ విషయం బయటకు వచ్చి చెప్పగానే వాళ్లిద్దరూ తమ బట్టలను స్టోర్ రూమ్‌లో పెట్టేస్తారు. అనంతరం ప్రియ.. ఎవరో ఇచ్చిన బట్టలను ధరిస్తారు. కానీ, రవి మాత్రం ఆడవాళ్లు వేసుకునే బట్టలను ధరించాడు. ఆ సమయంలో అతడు రెచ్చిపోయి మరీ యాక్టింగ్ చేశాడు. ఆ డ్రెస్ వేసుకుని హౌస్‌ లోపలికి రాగానే అందరూ షాక్ అయ్యారు. ఇక, సన్నీ అతడికి ముద్దు పెట్టినట్లు యాక్ట్ చేయగా.. విశ్వ ఏకంగా ఎత్తుకుని రొమాంటిక్ డ్యాన్స్ చేశాడు.

  Recommended Video

  #5MuchDrama between #Lobo & #Siri also between #Kajal & #Lahari
  రవి మాటకు బోరున ఏడ్చేన కంటెస్టెంట్

  రవి మాటకు బోరున ఏడ్చేన కంటెస్టెంట్

  ఈ టాస్క్ ముగిసిన తర్వాత విశ్వ, మానస్, యాంకర్ రవి, శ్రీరామ చంద్రలు ఒక దగ్గర కూర్చుని మాట్లాడుకున్నారు. ఆ సమయంలో విశ్వ మాట్లాడుతూ.. 'డార్లింగ్ మీకో విషయం చెప్పాలి. రవి నన్ను ఫస్ట్ అన్న అని పిలిచాడు. అదే ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాడు. ఇప్పుడు టాస్క్ అని చెప్పగానే.. అన్నా నీ కోసం చేస్తా అన్నాడు. ఆ మాట చాలు. మా బ్రదర్ చనిపోయిన తర్వాత అంత ఆప్యాయంగా పిలిచింది రవినే. వాడు బతికున్నప్పుడు నా మాట వినేవాడు కాదు. కానీ చనిపోయే ముందు మాత్రం అన్న కోసం ఏదైనా చేయాలి అన్నాడంట. ఇప్పుడు రవి ఆ మాట అనగానే తట్టుకోలేకపోతున్నా' అంటూ బోరుబోరున ఏడ్చేశాడు.

  English summary
  Bigg Boss is the Telugu Top Rreality TV Series Recently Started 5th Season. In Recent Episode.. Actor Vishwa Cried on Anchor Ravi Comments.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X