For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss షోలో యాంకర్ రవి ఊహించని ప్రవర్తన: అది నిరూపిస్తే పీక కోసుకుంటా అంటూ షాకింగ్‌గా!

  |

  బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ రియాలిటీ షో ఆధారంగా ఇండియాలోకి పరిచయం అయింది బిగ్ బాస్. మొదటి హిందీలో ప్రారంభం అయిన ఈ కార్యక్రమం.. ఆ తర్వాత చాలా భాషల్లోకి వచ్చింది. ఈ క్రమంలోనే ఐదేళ్ల క్రితం తెలుగులోనూ పరిచయం అయింది. ఎన్నో అనుమానాల నడుమ మన భాషలోకి పరిచయం అయిన ఈ షో.. ఎవరూ అనుకోని విధంగా విజయం సాధించింది. దీంతో ఆ వెంటనే ఏకంగా నాలుగు సీజన్లను కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇలా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఐదో సీజన్‌ను కూడా షో నిర్వహకులు మొదలు పెట్టేశారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో యాంకర్ రవి ఊహించని విధంగా ప్రవర్తించాడు. అంతేకాదు, అది నిరూపిస్తే పీక కోసుకుంటానంటూ ఛాలెంజ్ కూడా చేశాడు. దీంతో అక్కడున్న వాళ్లంతా షాకయ్యారు. ఇంతకీ ఏం జరిగింది? దానికి సంబంధించిన వివరాలు మీకోసం!

   టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి యాంకర్ రవి

  టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి యాంకర్ రవి

  బిగ్ బాస్ ఐదో సీజన్‌కు కంటెస్టెంట్లుగా ఎంపికైన వారిలో ఎక్కువ మంది పాపులర్ అయిన వాళ్లే ఉన్నారు. సోషల్ మీడియా ద్వారానో.. బుల్లితెర వెండితెరపై సందడి చేసే వాళ్లుగానో పలువురు మంచి గుర్తింపును దక్కించుకున్న వాళ్లు వచ్చారు. ఇక, ఈ సీజన్‌లో 19 మంది కంటెస్టెంట్లుండగా.. అందులో పలువురు టైటిల్ ఫేవరెట్లు అనిపించుకుంటున్నారు. అలాంటి వారిలో యాంకర్ రవి ఒకడు. బుల్లితెరపై చాలా కాలంగా సందడి చేస్తోన్న అతడికి చాలా మంది అభిమానులు ఉండడమే దీనికి కారణం. దీంతో ఆరంభం నుంచే అతడి పేరు భారీ స్థాయిలో వినిపిస్తోంది.

  హాట్ ఫోజులతో రెచ్చిపోయిన సమంత: వామ్మో అలాంటి బట్టల్లో అందాలు మొత్తం కనిపించేంత ఘాటుగా!

  ఆరంభంలోనే యాంకర్ రవికి భారీ షాక్

  ఆరంభంలోనే యాంకర్ రవికి భారీ షాక్


  ఈ సీజన్‌లోకి వచ్చిన వాళ్లందరిలోనూ యాంకర్ రవి చాలా ఫేమస్ అయిన కంటెస్టెంట్. దీంతో అతడిపై అందరిలోనూ భారీ అంచనాలేఉన్నాయి. అందుకు అనుగుణంగానే హౌస్‌లోని మిగిలిన కంటెస్టెంట్లు కూడా ఈ యాంకర్‌ను ప్రధాన పోటీదారుడుగా భావిస్తుంటారు. ఈ క్రమంలోనే గత సోమవారం జరిగిన నామినేషన్స్ టాస్క్‌లో రవిని పలువురు నామినేట్ కూడా చేశారు. దీంతో అతడు ఈ వారం ఎలిమినేషన్ జోన్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే, బయట అతడికి ఉన్న ఫాలోయింగ్ కారణంగా ఈ వారం మాత్రం ఎలిమినేట్ మాత్రం కాడన్న విషయం అందరికీ తెలిసిందే.

  ఆడవాళ్ల బట్టలతో రవి.. రెచ్చిపోయాడు

  ఆడవాళ్ల బట్టలతో రవి.. రెచ్చిపోయాడు

  శక్తి చూపరా డింభక టాస్కులో గెలిచిన విశ్వ.. బిగ్ బాస్ ఆదేశం ప్రకారం యాక్టర్ ప్రియతో పాటు యాంకర్ రవి బట్టలు మొత్తం స్టోర్ రూమ్‌లో పెట్టాలని చెబుతాడు. ఆ తర్వాత వాళ్లిద్దరూ తమ బట్టలను స్టోర్ రూమ్‌లో పెట్టేస్తారు. అప్పటి నుంచి రవి ఆడవాళ్ల బట్టలు, ప్రియ మగవాళ్ల డ్రెస్‌లు వేసుకోవాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగానే వీళ్లిద్దరూ అలాగే బట్టలు ధరిస్తారు. మరీ ముఖ్యంగా రవి రెచ్చిపోయి మరీ యాక్టింగ్ చేశాడు. లేడీస్ డ్రెస్ వేసుకుని హౌస్‌ లోపలికి రాగానే అందరూ షాక్ అయ్యారు. టాస్క్ ముగిసే వరకూ అతడు అలాంటి బట్టలే ధరించాడు.

  రామ్ చరణ్ చేతికి విలువైన వాచ్: దాని ధర ఎంతో తెలిస్తే నిద్ర కూడా పట్టదు.. ఇది కూడా రికార్డే!

  కెప్టెన్సీ టాస్క్.. నలుగురు కంటెస్టెంట్లు

  కెప్టెన్సీ టాస్క్.. నలుగురు కంటెస్టెంట్లు

  శక్తి చూపరా డింభక టాస్కులో విజేతలుగా నిలిచిన విశ్వ, మానస్, సిరి హన్మంత్, హమీదాలు ఈ వారం జరిగే కెప్టెన్సీ టాస్కుకు అర్హులయ్యారు. ఇక, వీళ్ల కోసం తొక్కరా తొక్కు హైలెస్సా అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. దీని ప్రకారం.. ఈ నలుగురు కంటెస్టెంట్లు సైకిల్ తొక్కుతూ ఉండాలి. వీళ్లు తొక్కుతున్నంత సేపూ సైకిల్‌కు ఉన్న లైట్ వెలుగుతూనే ఉండాలి. అలాగే, మిగిలిన కంటెస్టెంట్లు ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నారో.. మిగిలిన వాళ్లను సైకిల్ పైనుంచి దింపేసే ప్రయత్నాలు చేయొచ్చని చెప్పాడు. దీంతో ఎవరికి వాళ్లు తమకు నచ్చిన కంటెస్టెంట్‌కు సపోర్ట్ చేశారు.

   రచ్చ రచ్చగా టాస్క్... కాజల్‌ తెలివిగా

  రచ్చ రచ్చగా టాస్క్... కాజల్‌ తెలివిగా

  తొక్కరా తొక్కు హైలెస్సా టాస్కులో పోటీలో ఉన్న సిరి హన్మంత్, హమీదాలలో ఎవరు కెప్టెన్ అయినా తనకు పర్వాలేదని కాజల్ చెబుతుంది. అందుకు అనుగుణంగానే వాష్ రూమ్‌లో నుంచి ఆయిల్‌ను తీసుకొచ్చి విశ్వ సైకిల్‌పై పోస్తుంది. దీంతో అతడి లైట్ ఆగిపోతుంది. ఆ సమయంలో అతడికి సపోర్ట్ చేస్తున్న సరయు.. కాజల్‌తో గొడవకు దిగుతుంది. అప్పుడు పెద్ద రచ్చ జరుగుతుంది. అంతేకాదు, దీనిపై విశ్వతో పాటు అతడికి మద్దతు తెలిపిన వాళ్లంతా ఆగ్రహంగా ఉంటారు. అయినప్పటికీ మిగిలిన వాళ్లు మాత్రం సైకిల్ తొక్కుతూనే పోటీని కొనసాగిస్తారు.

  ఆ కంటెస్టెంట్‌కు నాగబాబు సపోర్ట్: బిడ్డ లాంటి వాడంటూ కామెంట్.. అభిజీత్ గెలిచినట్లే తను కూడా!

  విజేతగా సిరి... సన్నీపై రవి ఆగ్రహం

  విజేతగా సిరి... సన్నీపై రవి ఆగ్రహం

  విశ్వ సైకిల్ మీద నుంచి దిగిపోయిన తర్వాత అతడికి సపోర్ట్ చేస్తున్న వాళ్లు కూడా మిగిలిన పోటీదారులను ఓడించాలని చూస్తారు. ఈ క్రమంలోనే లోబో కూడా హమీదా సైకిల్ మీద ఆయిల్ పోస్తాడు. ఆ తర్వాత అక్కడ గందరగోళ పరిస్థితి ఉంటుంది. ఆ సమయంలో మానస్, హమీదా లైట్లు కూడా ఆగిపోతాయి. ఫలితంగా వాళ్లు పోటీ నుంచి తప్పుకుంటారు. దీంతో సన్నీ వచ్చి సిరికి ‘వాళ్ల లైట్లు ఆగిపోయాయి.. నువ్వు గెలిచావు. కంగ్రాట్స్' అని చెబుతాడు. దీంతో రవి అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ఆ సమయంలో వీళ్లిద్దరి మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరుగుతుంది

  #BiggBossTelugu5 లో Lobo Shannu కాంబో పీక్స్.. Abhijit ని కాపీ కొట్టేదెవరు ! || Filmibeat Telugu
   పీక కోసుకుంటా అంటూ రవి సవాల్

  పీక కోసుకుంటా అంటూ రవి సవాల్

  సన్నీ సిరికి కంగ్రాట్స్ చెప్పగానే రవి ‘అరేయ్ నువ్వు ఆ మాట చెప్పకురా ఇంకా టాస్క్ ఉంది' అన్నట్లుగా అతడికి చెబుతాడు. కానీ, సన్నీ మాత్రం ‘నన్ను మాట్లాడొద్దు.. నీకు చెప్పే అర్హత లేదు అంటున్నాడు' అంటూ గొడవకు దిగుతాడు. అప్పుడు రవి ఊహించని విధంగా ‘అరేయ్ నేను నీకు చెప్పే అర్హత లేదు అని నేను అన్నానని నువ్వు కనుక నిరూపిస్తే నీ ముందే కోసుకుంటారా' అంటూ సవాల్ చేస్తాడు. ఆ తర్వాత ఇద్దరూ తమలో తాము మాట్లాడుకుంటూ అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోతారు. అయితే, రవిని అలా చూసిన వాళ్లంతా షాక్ అవుతున్నారు.

  English summary
  Bigg Boss is the Telugu Top Rreality TV Series Recently Started 5th Season. In Recent Episode.. Anchor Ravi Challenge to VJ Sunny.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X