For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పోలీస్ స్టేషన్‌‌కు యాంకర్ రవి: అలా చేయాలంటే భయం పుట్టాలి.. చట్టపరమైన చర్యలు తప్పవంటూ!

  |

  ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు దశాబ్ద కాలంగా తెలుగు బుల్లితెరపై తనదైన శైలి హోస్టింగ్‌తో నెంబర్ వన్ యాంకర్‌గా వెలుగొందుతున్నాడు రవి. అద్భుతమైన టైమింగ్‌తో పాటు వాక్చాతుర్యంతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. అదే సమయంలో ఎంతో మంది అభిమానాన్ని సైతం సొంతం చేసుకున్నాడు. అలాగే, వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ప్రసారం అవుతోన్న బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. టైటిల్ ఫేవరెట్‌గా వెళ్లిన అతడు.. పన్నెండో వారమే బయటకు వచ్చేశాడు. ఈ నేపథ్యంలో తాజాగా యాంకర్ రవి కొందరిపై పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేశాడు. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

  టైటిల్ ఫేవరెట్‌గా ఎంటరైన రవి

  టైటిల్ ఫేవరెట్‌గా ఎంటరైన రవి

  తాజా సీజన్‌లో ఏకంగా 19 మంది కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. వీళ్లంతా తమ తమ విభాగాల్లో గుర్తింపును దక్కించుకున్నారు. అందులో పలువురు మాత్రమే టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన వారిలో యాంకర్ రవి ఒకడు. బుల్లితెరపై భారీ ఫాలోయింగ్ ఉన్న యాంకర్ కావడంతో.. అతడికే ఎక్కువ హైప్ లభించింది. దీనికితోడు అతడు ఆరంభంలోనే చక్కని ఆటతో మెప్పించాడు.

  Akhanda: బడా సంస్థ చేతికి హిందీ డబ్బింగ్ రైట్స్.. బాలయ్య పాత్రను బాలీవుడ్‌లో ఎవరు చేస్తారంటే!

  మంచితనంగా... చెడ్డపేరు కూడా

  మంచితనంగా... చెడ్డపేరు కూడా

  బిగ్ బాస్ షోలోకి అడుగు పెట్టినప్పటి నుంచే యాంకర్ రవి తన మార్కు చూపించే ప్రయత్నాలు చేశాడు. షోలో ఇచ్చే టాస్కుల్లో ఎంతో యాక్టివ్‌గా పాల్గొన్నాడు. అలాగే, గొడవలను ఆపుతూ మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ, క్రమంగా అతడి ప్రవర్తనలో మార్పులు రావడంతో కొన్ని గొడవల్లో భాగం అయ్యాడు. దీంతో చెడ్డ పేరును కూడా తెచ్చుకుని విమర్శలను కూడా ఎదుర్కొన్నాడతను.

  12 వారాల్లో.. 9 సార్లు నామినేషన్‌

  12 వారాల్లో.. 9 సార్లు నామినేషన్‌

  బిగ్ బాస్ హౌస్‌లో యాంకర్ రవికి అందరితో చక్కని అనుబంధం ఏర్పడింది. కానీ, ఎందుకనో అతడు ప్రభావితం చేస్తుంటాడని, గుంటనక్క అని, గొడవలు పెడుతుంటాడని.. ఇలా రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో అతడిపై విమర్శలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో 12 వారాలు యాంకర్ రవి హౌస్‌లో ఉండగా.. అందులో 9 వారాలు అతడు నామినేషన్‌లో ఉన్నాడు.

  Bigg Boss Winner: 3వ రోజు ఓటింగ్‌లో ట్విస్ట్.. హాట్‌స్టార్‌లో ఒకరు.. మిస్‌డ్ కాల్స్‌లో మరొకరు టాప్

  ఊహించని విధంగా బయటకొచ్చి

  ఊహించని విధంగా బయటకొచ్చి

  టైటిల్ ఫేవరెట్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు యాంకర్ రవి. కానీ, ఊహించని విధంగా అతడు 12వ వారమే బిగ్ బాస్ షో నుంచి ఎలిమినేట్ అయ్యాడు. ఇది అతడి అభిమానులనే కాదు.. సామాన్య ప్రేక్షకులను సైతం ఆశ్చర్యపరిచింది. దీంతో బిగ్ బాస్ టీమ్‌పై విమర్శలు కూడా వచ్చాయి. ఓటింగ్‌ను బట్టి కాకుండా.. తమకు నచ్చినట్లు ఎలిమినేట్ చేస్తున్నారని టాక్ వినిపించింది.

  యాంకర్ రవిపై దారుణమైన పోస్ట్

  యాంకర్ రవిపై దారుణమైన పోస్ట్

  యాంకర్ రవి బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న సమయంలో అతడిపై సోషల్ మీడియాలో చాలా మంది ట్రోల్స్ చేశారు. అదే సమయంలో అతడి భార్య నిత్యా సక్సేనా, కూతురు వియాపైనా చాలా మంది దారుణమైన పోస్టులు చేశారు. ఇక, రవి ఎలిమినేట్ అయిన తర్వాత కూడా ఇలాంటివి కనిపించాయి. దీంతో అతడు వాటన్నింటినీ సేకరిస్తున్నట్లు నాలుగు రోజుల క్రితమే వెల్లడించాడు.

  హాట్ షోలో హద్దు దాటిన మలైకా: ప్రైవేటు పార్టులు చూపిస్తూ అలా.. 48 ఏళ్ల వయసులో అవసరమా!

  పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన యాంకర్

  పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన యాంకర్

  తనను తన కుటుంబ సభ్యులను విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేసిన వారిపై యాంకర్ రవి తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. అంతేకాదు, బిగ్ బాస్ కంటెస్టెంట్ల పరువు పోయేలా పోస్టులు పెట్టే వాళ్లపై అతడు ఫిర్యాదు చేశాడు. ఈ విషయాన్ని యాంకర్ రవి తన సోషల్ మీడియా ఖాతా ద్వారా స్వయంగా వెల్లడించాడు. ఈ ఫొటో వైరల్ అయిపోతోంది.

  Recommended Video

  Damnit David Rajuki Pellaipoindi Movie Launch Part 01
  ఇకపై అలా చేయాలంటే భయం

  ఇకపై అలా చేయాలంటే భయం

  సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేస్తోన్న సమయంలో దిగిన ఫొటోను షేర్ చేసిన యాంకర్ రవి.. 'ముగింపు కోసం మొదలుపెట్టా.. కొంత మంది పరువుపోయేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై కంప్లైంట్ చేశాను. తప్పుడు కథనాలు రాసిన వాళ్లపై కూడా కఠిన శిక్షలు గ్యారెంటీ.. ఇకపై తప్పు మాట మాట్లాడాలి.. టైప్ చేయాలి అంటే భయం పుట్టాలి' అని పేర్కొన్నాడు.

  English summary
  Bigg Boss 5th Season Running Successfully. Recently Anchor Ravi Gave complaint on Social Media Trollers.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X