For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss: బిగ్ బాస్ సీక్రెట్స్ తెలుసుకున్న రవి.. టాప్‌ 5లో ఉండే కంటెస్టెంట్లు ఎవరో చెప్పేశాడుగా!

  |

  బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ షో ఆధారంగా వచ్చి.. పాశ్చాత్య సంస్కృతికి అద్దం పట్టే కాన్సెప్టే అయినా ఇండియాలోనూ అన్ని భాషల్లో సూపర్ హిట్ అయింది బిగ్ బాస్. మరీ ముఖ్యంగా తెలుగులో ఇంకాస్త ఎక్కువ రేటింగ్‌ను అందుకుంటోంది. దీంతో మన షో జాతీయ స్థాయిలోనే నెంబర్ వన్ స్థానంలో నిలుస్తోంది. అందుకే సీజన్ల మీద సీజన్లను మొదలు పెడుతున్నారు. ఇక, ఇటీవలే ఐదో సీజన్ మొదలవగా.. ఇది ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగుతోంది. ఇక, తాజా ఎపిసోడ్‌లో టైటిల్ ఫేవరెట్ యాంకర్ రవి.. టాప్ 5కు వచ్చే కంటెస్టెంట్ల గురించి మాస్టర్ ప్లాన్ వేశాడు. అసలేం జరిగింది? ఆ పూర్తి వివరాలు మీ అందరి కోసం!

  చెప్పినట్లే చేస్తున్నారు.. చూస్తున్నారు

  చెప్పినట్లే చేస్తున్నారు.. చూస్తున్నారు


  ఐదో సీజన్‌పై ఆది నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే నిర్వహకులు ఇందులో ఐదింతలు ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుందని చెప్పారు. ఇందులో భాగంగానే సరికొత్త టాస్కులు, రొమాన్స్, ప్రేమ కహానీలు సహా ఎన్నో ఆసక్తికరమైన అంశాలను హైలైట్ చేస్తున్నారు. దీంతో ఈ సీజన్‌ను కూడా తెలుగు ప్రేక్షకులు బాగానే ఆదరిస్తూ రేటింగ్ ఇస్తున్నారు.

  Bigg Boss 5 Telugu Wild Card Entry: ఎలిమినేట్ అయిన బ్యూటీకి బాస్ ఆఫర్.. షోలోకి ఆ లేడీ కంటెస్టెంట్ రీఎంట్రీ!

  టైటిల్ ఫేవరెట్‌గా యాంకర్ రవి రాక

  టైటిల్ ఫేవరెట్‌గా యాంకర్ రవి రాక

  తాజాగా సీజన్‌లో కంటెస్టెంట్లుగా ఎంపికైన వారిలో ఎక్కువ మంది పాపులర్ అయిన వాళ్లే. వీళ్లంతా తమ తమ విభాగాల్లో గుర్తింపును దక్కించుకున్నారు. ఇక, ఈ సీజన్‌లో మొత్తం 19 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. అందులో పలువురు మాత్రమే టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన వారిలో యాంకర్ రవి ఒకడు. బుల్లితెరపై సందడి చేస్తోన్న అతడు.. బిగ్ బాస్ షో ఆఫర్ పట్టేశాడు.

  మంచి పేరు సంపాదించుకున్నాడు

  మంచి పేరు సంపాదించుకున్నాడు

  యాంకర్ రవి.. కంటెస్టెంట్‌గా షోలోకి అడుగు పెట్టినప్పటి నుంచే తన మార్కు చూపించే ప్రయత్నాలు చేస్తున్నాడు. షోలో ఇచ్చే టాస్కుల్లో ఎంతో యాక్టివ్‌గా పాల్గొంటున్నాడు. వాటిలో తనదైన ఆటతో ఆకట్టుకుంటున్నాడు. అదే సమయంలో గొడవలు జరుగుతోన్న సమయంలో మధ్యలోకి వెళ్లి సర్ధి చెబుతున్నాడు. దీంతో ఆరంభంలోనే మంచి పేరును సంపాదించుకున్నాడతను.

  మితిమీరిన జాన్వీ కపూర్ హాట్ షో: ఘాటు ఫోజులో అందాలను మొత్తం చూపిస్తోన్న శ్రీదేవి కూతురు

  ఆ రెండింటితో రవిపై విమర్శల వర్షం

  ఆ రెండింటితో రవిపై విమర్శల వర్షం

  మూడో వారం నామినేషన్స్ టాస్కులో ఓ కొత్త వివాదం తెరపైకి వచ్చింది. లహరి షారిని ఉద్దేశించి యాక్టర్ ప్రియ కామెంట్స్ చేసింది. అప్పుడామె యాంకర్ రవి పేరు తీయడంతో వివాదం అయింది. ఇందులో అతడి ఇమేజ్ డ్యామేజ్ అయింది. అలాగే, బొమ్మల ఫ్యాక్టరీ టాస్కులో సైతం రవి వ్యవహరించిన తీరుపై విమర్శల వర్షం కురిసింది. ఈ రెండూ అతడికి మైనస్ అయ్యాయి.

  లోబో రాకతో మరింత జోష్‌లోకి రవి

  లోబో రాకతో మరింత జోష్‌లోకి రవి


  శనివారం రాత్రి నుంచి సీక్రెట్ రూమ్‌లో ఉంటోన్న లోబో తాజాగా హౌస్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. దీంతో అతడి క్లోజ్ ఫ్రెండ్ అయిన యాంకర్ రవి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అందుకే అందరి కంటే ముందు అతడి దగ్గరకు వెళ్లిన రవి.. గట్టిగా హత్తుకుని చాలా సేపు ఏడ్చేశాడు. ఇక, లోబో రాకతో అతడితో ఉత్సాహం రెట్టింపు అయినట్లు గత ఎపిసోడ్‌లో కనిపించింది.

  టాప్ ఉన్నా లేనట్లే సీరియల్ హీరోయిన్ ఘాటు ఫోజులు: వామ్మో మరీ ఇంత దారుణంగా చూపిస్తారా!

  బిగ్ బాస్ సీక్రెట్స్ తెలుసుకున్న రవి

  బిగ్ బాస్ సీక్రెట్స్ తెలుసుకున్న రవి

  లోబో సీక్రెట్ రూమ్‌లోకి వెళ్లినా.. అతడు మాత్రం బయట నుంచి వచ్చినట్లే హౌస్‌మేట్స్ అందరికీ చెప్పాడు. అందుకు అనుగుణంగానే జనాల నాడి ఎలా ఉంది అని తెలుసుకోడానికి ఇంటి సభ్యులంతా అతడిని ప్రశ్నలు అడిగారు. ఇక, క్లోజ్ ఫ్రెండ్ అయిన యాంకర్ రవి మాత్రం లోబోతో స్పెషల్‌గా చిట్ చాట్ చేశాడు. ఈ క్రమంలోనే చాలా రకాల సీక్రెట్లను తెలుసుకున్నాడు.

  Date With Akhil Tour | Akhil Interaction With Crazy Girls
  టాప్ 5 కంటెస్టెంట్లు ఎవరెవరో చెప్పి

  టాప్ 5 కంటెస్టెంట్లు ఎవరెవరో చెప్పి

  లోబోతో మాట్లాడిన తర్వాత యాంకర్ రవి మాస్టర్ ప్లాన్ వేసినట్లు తాజా ఎపిసోడ్‌లో కనిపించింది. శ్రీరామ్‌, విశ్వ, ఆనీ, లోబోలతో కలిసి మనమంతా కలిసి గేమ్‌ ఆడుదామని, టాప్‌ 5లో మనమే ఉండాలని వాళ్లకు చెప్పాడు. అలాగే విశ్వకు కండబలం, తనకు బుద్ది బలం, లోబోకి రెండు ఉన్నాయని చెప్పాడు. ఇక, ఎంటర్‌టైన్‌మెంట్‌ అంటే ఎలా ఉంటుందో చూపిస్తామని సవాల్ చేశాడు.

  English summary
  Bigg Boss 5th Season Running Successfully. In Recent Episode.. Anchor Ravi Master Plan with Lobo for Top 5 Contestants.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X