For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  షణ్ముఖ్ మొగోడే కాదు, గాజులు వేస్కో.. ఇంట్లో వాడొక్కడే మొగోడు: అరియానతో సరయు

  |

  బిగ్ బాస్ సీజన్ 5 ఎలిమినేషన్ లో ఎవరూ ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. అసలు మొదటి ఐదు రోజులలో కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్లే కంటెస్టెంట్స్ ఎవరనే విషయంలో కంటెస్టెంట్స్ కు ఒక విధంగా క్లారిటీ వచ్చేసింది. అయితే అది రెగ్యులర్ గా ఉంటుందని అనుకున్నారో ఏమో గానీ బిగ్ బాస్ సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేశాడు. బోల్డ్ గర్ల్ అయినటువంటి సరయూ ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఆమె ఉంటే గొడవలతో మాటలతో హౌస్ లో వాతావరణం ఎప్పటికప్పుడు మారుతూనే ఉంది అని అందరూ అనుకున్నారు.

  కానీ సరయు ఇప్పుడు మొదటిగా బలిపశువును చేయడం విశేషమని కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఆమె బయటకు వెళ్లిన తర్వాత ఒక్కసారిగా తన ఆగ్రహాన్ని చూపిస్తోంది. అరియానా గ్లోరీతో ఈసారి మొదలైన బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో సరయు తనలోని ఆగ్రహాన్ని మరోసారి బయట పెట్టింది.

  హాట్ ఫొటోలతో రెచ్చిపోయిన అనసూయ భరద్వాజ్: అదిరిపోయే ఫోజులతో అందాల విందు

  సిద్దమైన అరియానా

  సిద్దమైన అరియానా

  ప్రతి ఏడాది బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేట్ అయిన వారిని ఇంటర్వ్యూ చేయడం సర్వసాధారణంగా కొనసాగుతున్నదే. ఇక ఈ సారి ఇంటర్వ్యూ చేసే బాధ్యతను అరియానా తీసుకుంది. బిగ్ బాస్ తెలుగు 4 కంటెస్టెంట్ గా పోటీపడి తనకంటూ ఒక మంచి గుర్తింపు అందుకున్నా అరియానా ఈసారి తన యాంకరింగ్ తో ఎలిమినేషన్ కంటెస్టెంట్స్ లోని అనేక విషయాలను రాబట్టేందుకు సిద్ధమైంది.

  కడిగి పారేసిన సరయు

  కడిగి పారేసిన సరయు

  ఇక మొదటి ఎలిమినేషన్లో సరయు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ హౌస్ లో నుంచి అలా బయటకు అడుగు పెట్టగానే సరయు తలలోని కోపాన్ని చూపించింది. టాప్ 5 బెస్ట్ కంటెస్టెంట్స్ టాప్ 5 వరస్ట్ కంటెస్టెంట్స్ లో గురించి చెబుతూ నాగార్జున ముందే హౌస్ మెంట్స్ పై గట్టిగానే అరిచేసింది.

  ఇక మరో సారి బిగ్ బాస్ బజ్ లో ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మరింత కోపాన్ని చూపించింది. తనకు నచ్చని వారిని ఎవరిని వదిలి పెట్టకుండా బోల్ఫ్ కామెంట్స్ తో కడిగిపారేసింది.

  మొగోళ్లను అడ్డం పెట్టుకొని

  మొగోళ్లను అడ్డం పెట్టుకొని

  మొదటగా బిగ్ బాస్ హౌస్ క్యాప్టెన్ గా ఎన్నికైన టువంటి సిరి హనుమంతుపై సరయు షాకింగ్ కామెంట్స్ చేసింది. మొగోళ్లను అడ్డం పెట్టుకొని ఆడుతోందని చాలా ఓపెన్ గా చెప్పేసింది. ఎందుకంటే సిరి హనుమంతు కొన్ని సమయాల్లో జెస్సీని అలాగే సన్నీ ని కూడా అడ్డంపెట్టుకుని ముందుకు వెళ్లింది. ఆ విషయం ఏమాత్రం నచ్చలేదని చెప్పింది.

  యాంకర్ రవిలో విషయమే లేదు

  యాంకర్ రవి గురించి మరింత కోపంగా మాట్లాడింది. మంచోడిలాగా నీతి సూత్రాలు బోధిస్తాడు గాని విషయమే లేదు అని యాంకర్ రవి ఫోటోలు బద్దలు కొట్టేసింది. చాలా సందర్భాల్లో సరయు కాజల్ తో గోడవ పడుతునప్పుడు యాంకర్ రవి ఆమెకు మద్దతుగా మాట్లాడిన విషయం తెలిసిందే. ఇక ఆటలో ముందుగా నీతిగా మాటలు చెప్పి న్యాయంగా ఉండకపోవడమే తనకు నచ్చలేదని సరయు విరుచుకుపడింది.

  షణ్ముఖ్ మూలకు కూర్చోవడం బెటర్

  షణ్ముఖ్ మూలకు కూర్చోవడం బెటర్

  ఇక సన్నికి అసలు క్యారెక్టర్ లేదని ఫోటో ఫ్రేమ్ ను విరిచి పారేసిన సరయు ఇంట్లో ఉన్న ఒక్క మొగాడు విశ్వా మాత్రమే అని చెప్పింది. ఎలుకలు గుంపుగా వస్తాయని సింహం మాత్రం సింగిల్ గా వస్తుందిని చెప్పింది. ఇక షణ్ముఖ్ జస్వంత్ గురించి మరింతగా మాట్లాడుతూ నిజంగా నీలో దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మగాడివైతే అంటూ గ్రూపులు కాత్యాకుండా సరైన ఆట ఆడాలని వివరణ ఇచ్చింది.

  లేదా గాజులు వేసుకోవాలని, అయితే నేను కూడా గాజులు వేసుకున్నాను కాబట్టి నీకు దాని అవసరం లేదు అని చెప్పింది. ఫైనల్ గా నువ్వు ఇంట్లోకి వెళ్లి మూలకు కూర్చోవడం బెటర్ అని సరయు తన ఆవేశాన్ని చూపించింది.

  English summary
  Bigg boss telugu 5 buzz Sarayu angry comments on anchor ravi and Shanmukh Jaswanth.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X