For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బిగ్ బాస్ నుంచి మరికొన్ని లీకులు: హౌస్‌లో ఇప్పుడు జరిగేది ఇదే.. కొద్ది రోజుల్లోనే బిగ్ సర్‌ప్రైజ్

  |

  తెలుగు బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు వస్తుంటాయి. కానీ, వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకుల ఆదరాభిమానాలను గెలుచుకుంటాయి. తద్వారా సూపర్ డూపర్ సక్సెస్‌ను అందుకుంటాయి. ఇలా ఏమాత్రం అంచనాలు లేకుండానే మన టెలివిజన్‌లోకి వచ్చి.. భారీ స్థాయిలో రెస్పాన్స్‌ను అందుకున్న ఏకైక షో బిగ్ బాస్. తెలుగు వాళ్లకు అస్సలు పరిచయం లేని కంటెంట్‌తో ప్రసారమయ్యే ఈ కార్యక్రమం దిగ్విజయంగా నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది. అదే సమయంలో టీఆర్పీ రికార్డులపై దండయాత్ర చేస్తూ అరుదైన ఘనతలను సొంతం చేసుకుంది. అంతేకాదు, నేషనల్ రికార్డులను సైతం కొల్లగొట్టేసింది. ఇంతటి ప్రభవాన్ని చూపిస్తోన్న బిగ్ బాస్ ఐదో సీజన్‌కు రంగం సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ షో నుంచి అదిరిపోయే న్యూస్ లీకైంది. ఆ వివరాలు మీకోసం!

  ముగ్గురు హీరోలు.. నాలుగు హిట్ సీజన్లు

  ముగ్గురు హీరోలు.. నాలుగు హిట్ సీజన్లు

  బిగ్ బాస్ షో తెలుగులో నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది. అందులో మొదటి దానిని యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, రెండో దాన్ని నేచురల్ స్టార్ నాని, మూడు నాలుగు సీజన్లను కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ చేశారు. ఇవన్నీ ఒకదానికి మించి మరొకటి సూపర్ హిట్ అయ్యాయి. ఫలితంగా బుల్లితెరపై ఎన్నో రికార్డులు కూడా క్రియేట్ అయ్యాయి. మరీ ముఖ్యంగా గత సీజన్‌లో ఓ ఎపిసోడ్‌కు ఏకంగా 18 పైచిలుకు రేటింగ్ వచ్చింది. దీంతో ఇది ఇండియాలోనే టాప్ షోగా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.

  భర్తతో ప్రియాంక రొమాంటిక్ పిక్: ఇది అతడి సొంతమైన పార్ట్ అంటూ.. అక్కడ హత్తుకున్న హీరోయిన్

  అనుమానాల నడుమ... ఐదో సీజన్ ఇలా

  అనుమానాల నడుమ... ఐదో సీజన్ ఇలా

  బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పేరొందిన బిగ్ బాస్‌కు తెలుగులో ఊహించని రీతిలో స్పందన వస్తోంది. అదే సమయంలో ఈ షోకు కొన్ని కోట్ల మంది అభిమానులుగా మారిపోయారు. దీంతో ఐదో సీజన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వాళ్లంతా వేచి చూస్తున్నారు. వాస్తవానికి కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇది జరిగే పరిస్థితులు లేవన్న టాక్ వినిపించింది. దీంతో అభిమానులంతా నిరాశకు లోనయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో బిగ్ బాస్ ఐదో సీజన్ త్వరలోనే ప్రారంభం అవుతుందని తెలిసింది. దీనికి లైన్ క్లియర్ అవడంతో ఇప్పుడు ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు.

  కంటెస్టెంట్ల ఎంపిక అలా... పకడ్బందీగానే

  కంటెస్టెంట్ల ఎంపిక అలా... పకడ్బందీగానే

  బిగ్ బాస్ షోలో పాల్గొనే కంటెస్టెంట్లు ఎవరన్న విషయం ప్రీమియర్ ఎపిసోడ్ రోజే తెలుస్తుంది. అంత పకడ్బందీగా అభ్యర్థులను ఎంపిక చేస్తుంటారు షో నిర్వహకులు. ఇక, ఐదో సీజన్‌కు సంబంధించి నిర్వహకులు దాదాపు 50 మందితో సంప్రదింపులు జరిపారట. అందులో షార్ట్ లిస్టును కూడా తయారు చేశారని తెలుస్తోంది. ఈ జాబితాలోని సభ్యులతో జూమ్ కాల్ ద్వారా ఇంటర్వ్యూలు జరిపారు. అందులో ఈ సీజన్ కోసం 18 మందిని ఎంపిక చేశారని తెలుస్తోంది.

  కంటెస్టెంట్ల పేర్లు బయటకు.. ఉన్నది వీళ్లే

  కంటెస్టెంట్ల పేర్లు బయటకు.. ఉన్నది వీళ్లే

  బిగ్ బాస్ షో తెలుగు ఇండస్ట్రీల్లోని ఎంతో మందిని పెద్ద పెద్ద సెలెబ్రిటీలుగా మార్చేసింది. అందుకే ఈ షోలో భాగం అవ్వాలని చాలా మంది ప్రముఖులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలా చాలా మంది ఇందులో కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇక, ఐదో సీజన్‌లో బుల్లితెర, వెండితెరకు సంబంధించిన సిరి హన్మంత్, నవ్య స్వామి, శ్రీహాన్, గీతా సింగ్, షణ్ముక్ జశ్వంత్, హేమచంద్ర, యాంకర్ వర్షిణి సౌందరాజన్, యాంకర్ రవి, రఘు మాస్టర్, టిక్ టాక్ దుర్గారావులు పాల్గొనబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

  అర్ధనగ్నంగా కనిపించి షాకిచ్చిన మల్లికా శెరావత్: లేటు వయసులో ఘాటుగా.. ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన హీరోయిన్

  బిగ్ బాస్ రహస్యాలు... ఒక్కొక్కటిగా లీక్

  బిగ్ బాస్ రహస్యాలు... ఒక్కొక్కటిగా లీక్


  బిగ్ బాస్ షోకు సంబంధించినంత వరకూ ప్రతి విషయం రహస్యంగానే ఉంచడానికి ప్రయత్నిస్తుంటారు నిర్వహకులు. కానీ, ఊహించని విధంగా ఇందులో కంటెస్టెంట్ల ఎంపిక, ఎపిసోడ్ జరిగే తీరు, నామినేషన్ ప్రక్రియ, ఎలిమినేషన్, వైల్డ్ కార్డ్ ఇలా ముఖ్యమైన సమాచారం మొత్తం లీక్ అవుతూనే ఉంది. ఇక, కొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతున్న ఐదో సీజన్‌ వివరాలు కూడా బయటకు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే కంటెస్టెంట్ల పేర్లు లీక్ అవగా.. ఇప్పుడు మరికొన్ని విషయాలు రివీల్ అయిపోయాయి.

   బిగ్ బాస్ హౌస్‌లో ఇప్పుడు జరిగేది ఇదే

  బిగ్ బాస్ హౌస్‌లో ఇప్పుడు జరిగేది ఇదే

  బిగ్ బాస్ ఐదో సీజన్ కోసం పనులన్నీ చకచకా జరుగుతున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ప్రస్తుతం ఈ సీజన్‌లో కంటెస్టెంట్లుగా పాల్గొనబోతున్న ప్రముఖులకు సంబంధించిన ఏవీలను షూట్ చేస్తున్నారట. ఇందుకోసం కొందరినీ నేరుగా స్టూడియోకే తీసుకు రాగా.. మరికొందరిని మాత్రం వాళ్లకు నచ్చిన ప్రదేశాల్లో చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. ఎన్నో జాగ్రత్తల నడుమ ఈ ప్రక్రియ జరుగుతుందనే టాక్ వినిపిస్తోంది.

  అషు రెడ్డి పర్సనల్ వీడియో వైరల్: వేలికి ఉంగరం తొడిగించుకున్న బ్యూటీ.. కన్నీళ్లు ఆగట్లేదంటూ!

   కొద్ది రోజుల్లోనే బిగ్ బాస్ నుంచి సర్‌ప్రైజ్

  కొద్ది రోజుల్లోనే బిగ్ బాస్ నుంచి సర్‌ప్రైజ్

  బిగ్ బాస్ ఐదో సీజన్‌కు హోస్టుగా నాగార్జున తప్పుకున్నారని, ఆయన స్థానంలో దగ్గుబాటి రానా వస్తున్నాడని ఆ మధ్య వార్తలు వచ్చాయి. వాటిని ఖండిస్తూ వెంటనే ఓ న్యూస్ కూడా బయటకు వచ్చింది. దీంతో ఈ సీజన్‌ను కూడా నాగార్జునే హోస్ట్ చేస్తారని అంటున్నారు. తాజా సమాచారం ప్రకారం.. మంగళవారం సాయంత్రం హోస్టుకు సంబంధించిన ప్రోమో షూట్ కంప్లీట్ అయిందట. ఇది మరికొద్ది రోజుల్లోనే విడుదల కాబోతుందని తెలుస్తోంది. అంటే త్వరలోనే ఓ సర్‌ప్రైజ్ రాబోతుందన్న మాట.

  Ram Pothineni Birthday Wishes TO Devi Sri Prasad | #RAPO | HBD DSP

  టాలీవుడ్, బాలీవుడ్, దక్షిణాది సినిమాకు సంబంధించిన తాజా తాజా వార్తల కోసం, తారల ఇంటర్యూల కోసం, టెలివిజన్ సీరియల్ అప్‌డేట్స్ కోసం, ఫోటో గ్యాలరీల కోసం, సినిమా ఈవెంట్ల కోసం, వివాదాస్పద అంశాలకు సంంధించిన వార్తా విశ్లేషణల కోసం.. మీరు వెంటనే ఫేస్‌బుక్ ( https://www.facebook.com/TeluguFilmibeat/) ట్విట్టర్ (https://twitter.com/TeluguFilmibeat), ఇన్స్‌టాగ్రామ్ (https://www.instagram.com/filmibeatteluguofficial/) అకౌంట్లను ఫాలో అవ్వండి.

  English summary
  Bigg Boss is the Telugu Top Rreality TV Series. This Show Makers Planing for 5th One. Now This Season Contestants AV Shoot Started.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X