For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 5: బిగ్ బాస్ చరిత్రలో తొలిసారి అలా.. వాళ్లను పంపి పొరపాటు చేశారంటూ!

  |

  బిగ్ బాస్.. తెలుగు ప్రేక్షకులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా దీన్ని మన వాళ్లు ఆదరిస్తున్నారు. బిగ్ బ్రదర్ అనే ఆంగ్ల రియాలిటీ షో ఆధారంగా హిందీలోకి చాలా ఏళ్ల క్రితమే వచ్చిన ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో దేశంలోని చాలా భాషల్లోకి పరిచయం అయింది. ఈ క్రమంలోనే ఐదేళ్ల క్రితం తెలుగులోకీ ఎంట్రీ ఇచ్చింది. ఇలా ఇప్పటికే నాలుగు సీజన్లను విజయవంతగా పూర్తి చేసుకుంది. ఇక, ఇప్పుడు ఐదో సీజన్ కూడా ఆదివారం అంగరంగ వైభవంగా జరిగిన ప్రీమియర్ ఎపిసోడ్‌తో ప్రారంభం అయింది. మొదటి రోజు మొత్తం 19 మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించారు. ఈ నేపథ్యంలో నిర్వహకులు ఒక విషయంలో తప్పు చేశారంటూ షో అభిమానులు నిరాశగా ఉన్నారు. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

  నాలుగు సీజన్లు.. నేషనల్ రేంజ్ రికార్డ్

  నాలుగు సీజన్లు.. నేషనల్ రేంజ్ రికార్డ్


  ఎన్నో అనుమానాల మధ్య తెలుగు బుల్లితెరపైకి వచ్చింది బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. అసలు ఇలాంటి వాటిని మన వాళ్లు ఎంకరేజ్ చేస్తారా? ఇక్కడ ఇది క్లిక్ అవుతుందా? ఇలా అనుకుంటోన్న పరిస్థితుల్లో ఈ షోకు భారీ స్థాయిలో స్పందన వచ్చింది. దీంతో నాలుగు సీజన్లు ఒకదానికి మించి ఒకటి సూపర్ సక్సెస్ అయ్యాయి. అదే సమయంలో అత్యధికంగా టీఆర్పీ రేటింగ్‌ను కూడా సంపాదించుకుంది. ఈ క్రమంలోనే ఈ క్రమంలోనే గత సీజన్‌లో ఏకంగా 18 పైచిలుకు రేటింగ్‌తో రికార్డు నమోదైంది. తద్వారా జాతీయ స్థాయిలో తెలుగు బిగ్ బాస్ హాట్ టాపిక్‌గా మారిపోయింది.

  బ్రా ఒక్కటే ధరించి విష్ణుప్రియ రచ్చ: ఇంతకు ముందెన్నడూ చూడనంత ఘాటు ఫోజులతో!

  ఐదో సీజన్‌పై డౌట్స్.. గ్రాండ్‌గా మొదలై

  ఐదో సీజన్‌పై డౌట్స్.. గ్రాండ్‌గా మొదలై

  దేశంలోని మిగిలిన భాషలతో పోలిస్తే తెలుగులో ప్రసారం అయ్యే బిగ్ బాస్ షోకు కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారు. దీంతో ప్రతి సంవత్సరం ఈ షో కోసం వాళ్లంతా వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు. ఈ నేపథ్యంలో కోవిడ్ సెకెండ్ వేవ్ కారణంగా ఐదో సీజన్‌ మొదలయ్యే అవకాశాలు లేవని ఆ మధ్య చాలా వార్తలు వైరల్ అయ్యాయి. కానీ, వాటిని పటాపంచలు చేస్తూ సెప్టెంబర్ 5 ఆదివారం గ్రాండ్‌గా జరిగిన ప్రీమియర్ ఎపిసోడ్‌తో ఈ సీజన్‌ను మొదలు పెట్టేశారు. అక్కినేని నాగార్జునే దీనిని కూడా హోస్టు చేస్తున్నారు. దీంతో బిగ్ బాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

  మొదటిరోజే 19 మంది కంటెస్టెంట్లు రాక

  మొదటిరోజే 19 మంది కంటెస్టెంట్లు రాక

  బిగ్ బాస్ ఐదో సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్ల గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది పేర్లు కూడా బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆదివారం అంగరంగ వైభవంగా జరిగిన ప్రీమియర్ ఎపిసోడ్‌లో ఏకంగా 19 మంది హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అందులో సిరి హన్మంత్, వీజే సన్నీ, షణ్ముక్ జశ్వంత్, ప్రముఖ నటి ప్రియ, యాంకర్ రవి, నటరాజ్ మాస్టర్, జబర్ధస్త్ ప్రియాంక సింగ్, లహరి, సింగర్ శ్రీరామచంద్ర, సరయు, జస్వంత్, శ్వేతా వర్మ, మానస్ షా, ఉమాదేవి, ఆర్జే కాజల్, లోబో, హమీదా, ఆనీ మాస్టర్, విశ్వలు ఉన్నారు.

  హాట్ షోతో షాకిచ్చిన అనన్య నాగళ్ల: అందాలన్నీ కనిపించేలా తెలుగమ్మాయి ఘాటు ఫోజులు

  ఈ సారి అందరూ అలాంటి వాళ్లే ఎంపిక

  ఈ సారి అందరూ అలాంటి వాళ్లే ఎంపిక

  తెలుగులో బిగ్ బాస్ షో ఎంత సక్సెస్‌ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకు అనుగుణంగానే ఈ సారి ప్రసారం అవుతున్న సీజన్ కోసం నిర్వహకులు పాపులర్ కంటెస్టెంట్లనే ఎంపిక చేసుకున్నారు. బుల్లితెరపై సందడి చేసే నటీనటులు, యాంకర్లతో పాటు సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన వారికి పెద్దపీట వేశారు. వీళ్లంతా చాలా రోజులుగా క్వారంటైన్‌లో ఉండి వచ్చారు. ఆదివారం ఎపిసోడ్‌లో హౌస్‌లోకి ప్రవేశించిన వారిలో తొమ్మిది మంది మగవాళ్లు, తొమ్మిది మంది ఆడవాళ్లు, ఒక ట్రాన్స్‌జెండర్ ఉన్నారు. వీళ్లలో ఒకరిద్దరు తప్ప అంతా ఫేమస్ అయినవాళ్లే.

   బిగ్ బాస్ షో చరిత్రలో తొలిసారి అంతలా

  బిగ్ బాస్ షో చరిత్రలో తొలిసారి అంతలా

  తెలుగులో బిగ్ బాస్ షో నాలుగు సీజన్లను పూర్తి చేసుకుని ఇప్పుడు ఐదో దాన్ని మొదలు పెట్టేసింది. అయితే, షో చరిత్రలో ఎప్పుడూ ప్రీమియర్ ఎపిసోడ్ రోజే 19 మంది కంటెస్టెంట్లను హౌస్‌ లోపలికి పంపించలేదు. కానీ, బిగ్ బాస్ షో అంటేనే మనం ఊహించనివి ఎన్నో జరుగుతుంటాయి. అందుకు అనుగుణంగానే ఇప్పుడు జంబో ప్యాక్‌లా ఏకంగా 19 మందిని మొదటి రోజే పంపించారు. ఇది తెలుగు బిగ్ బాస్ చరిత్రలో ఓ రికార్డుగా చెప్పుకుంటున్నారు. దీంతో ఐదో సీజన్ ఎలా ఉండబోతుందో అన్న విషయాన్ని నిర్వహకులు మొదటి రోజే చెప్పేసినట్లైంది.

  నిక్ జోనస్‌తో ప్రియాంక చోప్రా రచ్చ: డార్క్ రూమ్‌లో ఒకరిపై ఒకరు.. పర్సనల్ ఫొటో వైరల్!

  బిగ్ బాస్ తీరుపై మొదటి రోజే నిరాశగా

  బిగ్ బాస్ తీరుపై మొదటి రోజే నిరాశగా

  బిగ్ బాస్ షోలో రేపు ఏం జరగబోతుంది అన్న ఆసక్తి ఈరోజే కలిగేలా ప్రతి సీజన్‌లో నిర్వహకులు ప్లాన్ చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే మధ్య మధ్యలో సర్‌ప్రైజ్‌లు కూడా ఇస్తుంటారు. ఇందులో భాగంగానే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కూడా ఉంటాయి. కానీ, ఈ సారి ఏకంగా 19 మంది కంటెస్టెంట్లను ఒకేసారి పంపించడంతో బిగ్ బాస్ ఫ్యాన్స్ నిరాశగా ఉన్నారు. ఇప్పుడే అంత మందిని లోపలికి పంపిచడంతో.. ఇకపై వైల్డ్ కార్ట్‌గా ఎవరూ రారని వాళ్లంతా పెదవి విరుస్తున్నారు. ఒకరకంగా నిర్వహకులు తీసుకున్న ఈ నిర్ణయం మంచిదే అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

  Harbhajan Singh లో ఇంత గొప్ప సింగర్ ఉన్నాడా.. రోజా మూవీ లో పాట పాడిన బజ్జీ
  అది సీజన్‌పై ప్రభావాన్ని చూపిస్తుందని

  అది సీజన్‌పై ప్రభావాన్ని చూపిస్తుందని

  బిగ్ బాస్ షో అంటేనే సర్‌ప్రైజ్‌లతో సాగే గేమ్. ఇప్పుడే 19 మందిని పంపించి ఒకవేళ వైల్డ్ కార్డ్‌లు అనేవి లేకుండా ఉంటే.. అది ఈ సీజన్‌పై తీవ్ర స్థాయిలో ప్రభావాన్ని చూపే ప్రమాదం ఉంది. షోను రోజురోజుకూ మరింత ఆసక్తికరంగా సాగించడం కోసం అప్పుడప్పుడూ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు పెడతారు. అందులోనూ ఈ సారి ఐపీఎల్ కూడా ఉంది. దీంతో ఇప్పుడు బిగ్ బాస్ నిర్వహకులు తీసుకున్న నిర్ణయం అందరినీ షాక్‌కు గురి చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్లు షోను ఎలా నడిపించాలని అనుకుంటున్నారో ముందు ముందు తెలుస్తుంది.

  English summary
  Bigg Boss is the Telugu Top Rreality TV Series Recently Started 5th Season. In Premiere Episode Total 19 Contestant Entered into Bigg Boss House. Fans Unhappy with This Decision.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X