For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బిగ్ బాస్ హౌస్ లో ధర్నా.. మనిషినా, పశువునా అంటూ ఏడ్చేసిన అనీ మాస్టర్!

  |

  బిగ్ బాస్ తెలుగు ప్రతి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగుతోంది. సీజన్ 5లో భాగంగా గురువారం నాడు 68వ ఎపిసోడ్ ప్రసారం అయింది. అయితే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో భాగంగా సాగుతున్న బిగ్ బాస్ హోటల్ టాస్క్ నిన్న ఎపిసోడ్ లో కూడా కొనసాగింది. అయితే అనీ మాస్టర్ చేసిన రచ్చ ఇప్పుడు హైలైట్ గా నిలిచింది. ఆ వివరాల్లోకి వెళితే

  సరదాగా మొదలై సీరియస్ టర్న్

  సరదాగా మొదలై సీరియస్ టర్న్

  అయితే నిన్నటి ఎపిసోడ్ విషయానికి వస్తే ముందు చాలా సరదాగా మొదలైన ఎపిసోడ్ ఆ తర్వాత సీరియస్ టర్న్ తీసుకుంది. అనీ మాస్టర్ హోటల్ మేనేజర్ గా, ఇక రవి, శ్రీరామ్, షణ్ముఖ్ హోటల్ సర్వీస్ బాయ్స్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. మిగిలిన ఇంటి సభ్యులు అందరూ రకరకాల కస్టమర్స్ గా వ్యవహరిస్తున్నారు. ఎలా అయినా కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో భాగంగా లేడీ గెటప్ లో రవి కస్టమర్స్ ని ఎంటర్ టైన్ చేస్తూ కనిపించగా మానస్, ప్రియాంక హనీమూన్ కి వచ్చిన కపుల్స్ గా కనిపించి అలరించారు. ఇక కస్టమర్స్ గా ఉన్న సభ్యులు సన్నీ, సిరి, కాజల్, హోటల్ సభ్యులని ఆటపట్టిస్తూ, వారిచేత సేవలు చేయించుకుంటూ వినోదాన్ని అందించి అలరించారు.

  షన్నును ఆడుకున్న సిరి

  షన్నును ఆడుకున్న సిరి


  ఇక సిరి అయితే తన స్నేహితుడి షణ్ముఖ్ ని టార్గెట్ చేస్తూ కావాలనే అతనికి పనులు చెప్పింది. వెళ్లి చికెన్ ఫ్రైడ్ రైస్ కానీ, బగారా రైస్ కానీ తీసుకురావాలని ఆర్డర్ వేస్తుంది. దీంతో షణ్ముఖ్ సిరిని 300 రూపాయలు డిమాండ్ చేస్తాడు. ఇలా బిగ్ బాస్ హోటల్ టాస్క్ సరదాగా సాగుతూ ఉండగా హోటల్ సభ్యులు కస్టమర్లకు సేవలు చేసి వీలైనంత ఎక్కువ డబ్బు పొందాలని ప్రయత్నిస్తారు. కానీ కస్టమర్లు మాత్రం హోటల్ సర్వీస్ కు తక్కువ డబ్బు ఇవ్వడమే కాకా టాస్క్ లో భాగంగా ఇబ్బంది పెట్టాలని ప్లాన్ చేస్తూ ఉంటారు.

  మొరటుగా

  మొరటుగా

  మానస్, ప్రియాంక కపుల్స్ కోసం హోటల్ సభ్యులు క్యాండిల్ లైట్ డిన్నర్ ప్రిపేర్ చేస్తారు. ఆ ప్లేస్ లో సన్నీ వెళ్లి కూర్చోవడం, మొరటుగా ప్రవర్తించడం ముందు కాస్త కోపం తెప్పించేలా ఉన్నా తర్వాత నవ్వు తెప్పిస్తాయి. ఈ క్రమంలోనే క్యాండిల్ లైట్ డిన్నర్ ప్లేస్ నుంచి సన్నీని పైకి లేపడానికి హోటల్ సభ్యులు చాలా ఇబ్బంది పడుతారు. రవి అయితే తన సీక్రెట్ టాస్క్ లో భాగంగా వచ్చి ఏకంగా సన్నీ కూర్చున్న కుర్చీ పక్కకు లాగేస్తాడు. దీనితో సన్నీ అక్కడ అల్లరి చేస్తూ మానస్ తో క్యాండిల్ లైట్ డిన్నర్ లో ఉన్న పింకీ పై నీళ్లు పోస్తాడు.

  సన్నీ దెబ్బకు అలిగిన పింకీ

  సన్నీ దెబ్బకు అలిగిన పింకీ

  ఈ దెబ్బతో పింకీ అక్కడి నుంచి అలిగి వెళ్ళిపోతుంది. ఇక సిరి..షణ్ముఖ్ తో హెడ్ మసాజ్ చేయించుకుంటుంది. ఈ టాస్క్ అయిపోయాక మీ అందరికి ఉంటుంది..అంటూ ఫ్రస్ట్రేషన్ లో షణ్ముఖ్ వార్నింగ్ ఇవ్వడం.. టాస్క్ తర్వాత కూడా మీరు ఏమీ పీకలేరు అని సిరి కౌంటర్ ఇవ్వడం అయితే హైలెట్ గా నిలుస్తుంది. మరోపక్క అనీ మాస్టర్ 500 ఎవరో దొంగిలించారని ఇంటి సభ్యుల మధ్య చర్చ మొదలైంది. అయితే ఏదైనా సీక్రెట్ టాస్క్ లో భాగంగా తన 500 దొంగిలించారని అనుమానం వ్యక్తం చేస్తుంది అనీ మాస్టర్.

  Sound Movie Opening | Arjun Varahi | Nirosha
  ధర్నా

  ధర్నా


  అయితే హోటల్ స్టాఫ్ గా తాము ఎంత సేవ చేసినప్పటికీ కస్టమర్లు సరైన డబ్బులు ఇవ్వకపోవడంతో అనీ మాస్టర్ సీరియస్ అవడమే కాక. పిచ్చోళ్ళు లాగా పనిచేశాం. కుక్కలాగా వర్క్ చేయించుకుని, కానీ డబ్బులు ఇవ్వరు అంటూ మనస్తాపానికి గురై కన్నీళ్ళు పెట్టుకుంటుంది. అందరితో కూడబలుక్కుని హోటల్ స్టాఫ్ ధర్నాకు దిగాలని డిసైడ్ అవుతారు. 10 వేలు డబ్బు ఇచ్చే వరకు కస్టమర్లకు ఎలాంటి సేవలు చేయకూడదు..కనీసం ఫుడ్ కూడా వండకూడదు హోటల్ స్టాఫ్ డిసైడ్ అవుతారు. ధర్నాలో భాగంగా వంట గదిలో ఉన్న సామాన్లు మొత్తం వేరే గదిలో పెట్టేసి, మేమడిగిన డబ్బు ఇచ్చే వరకు ఎలాంటి సేవలు చేసేది లేదని తేల్చి చెప్పేస్తారు. ఇదంతా చూస్తుంటే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో ఇంకా ఆసక్తికరంగా మారే అవకాశం కనిపిస్తోంది.


  English summary
  In Bigg Boss Telugu 5 latest episode Hotel staff in captaincy contenders task started dharna.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X