For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss: నాగార్జున పేరును వాడుతూ జస్వంత్ కామెంట్స్.. పాపం ఆ పని చేసి బుక్కైపోయాడుగా!

  |

  ఎవరూ ఊహించని మలుపులు, ఓ రేంజ్‌లో గొడవలు, సెలెబ్రిటీల కొట్లాటలు, విచిత్రమైన టాస్కులు, అప్పడప్పుడూ రొమాన్స్‌ను పంచే లవ్ ట్రాకులు వీటన్నింటి సమాహారమే బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. మిగిలిన భాషల్లో ఎప్పుడో ప్రారంభం అయినా.. తెలుగులోకి మాత్రం ఐదేళ్ల క్రితమే ఈ షో వచ్చింది. ఏమాత్రం అంచనాలు లేకుండానే ప్రారంభం అయినప్పటికీ.. చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షకుల ఆదరణను అందుకుని సూపర్ హిట్ అయింది. ఈ క్రమంలోనే ఏకంగా నాలుగు సీజన్లను కూడా విజయవంతగా పూర్తి చేసుకుంది. ఇలా ఈ మధ్యనే బిగ్ బాస్ ఐదో సీజన్ కూడా ప్రారంభం అయింది. ఇందులో కంటెస్టెంట్‌గా వచ్చిన జస్వంత్ వ్యవహరించే తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా అతడు హోస్ట్ అక్కినేని నాగార్జున పేరు వాడుతూ కామెంట్ చేశాడు. ఆ వివరాలు మీకోసం!

  Photo Courtesy: Star మా and Disney+Hotstar

  అన్నీ భారీగా ఉండేలా ప్లాన్ చేశారు

  అన్నీ భారీగా ఉండేలా ప్లాన్ చేశారు

  అభిమానులంతా ఎంతో ఆసక్తిగా చూసిన బిగ్ బాస్ ఐదో సీజన్ గత ఆదివారం (సెప్టెంబర్ 5) చాలా గ్రాండ్‌గా ప్రారంభం అయింది. స్టార్ హీరో అక్కినేని నాగార్జున సారథ్యంలో ఎంతో సందడిగా మొదలైన షోలో ఏకంగా 19 మంది కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. వారిలో సిరి హన్మంత్, వీజే సన్నీ, షణ్ముక్ జశ్వంత్, ప్రముఖ నటి ప్రియ, యాంకర్ రవి, నటరాజ్ మాస్టర్, జబర్ధస్త్ ప్రియాంక సింగ్, లహరి, సింగర్ శ్రీరామచంద్ర, సరయు, జస్వంత్, శ్వేతా వర్మ, మానస్ షా, ఉమాదేవి, ఆర్జే కాజల్, లోబో, హమీదా, ఆనీ మాస్టర్, విశ్వలు టైటిల్ కోసం పోటీ పడడానికి ఎంట్రీ ఇచ్చారు.

  హాట్ ఫోజులతో రెచ్చిపోయిన సమంత: వామ్మో అలాంటి బట్టల్లో అందాలు మొత్తం కనిపించేంత ఘాటుగా!

   అంచనాలకు తగ్గట్టుగా రచ్చ స్టార్ట్

  అంచనాలకు తగ్గట్టుగా రచ్చ స్టార్ట్

  తెలుగులో బిగ్ బాస్‌కు దక్కేంత ఆదరణ మరే షోకూ రావడం లేదు. అందుకే ఇది నాలుగు సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఎన్నో రికార్డులను కూడా క్రియేట్ చేసేసింది. దీంతో ఐదో సీజన్‌పై ఆరంభం నుంచే భారీ బజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో షో నిర్వహకులు అదిరిపోయేలా దీన్ని డిజైన్ చేసినట్లు మొదట్లోనే తెలిసిపోయింది. ప్రేక్షకులకు మరింత మజాను అందించాలన్న ఉద్దేశంతో షోను ఆసక్తికరంగా నడిపించేందుకు ప్లాన్ చేశారు. అందుకు అనుగుణంగానే మొదటి ఎపిసోడ్‌లోనే నామినేషన్స్ టాస్క్‌ కొన్ని గొడవల కారణంగా రచ్చ అయింది.

  అప్పుడే స్పెషల్‌గా జస్వంత్ పడాల

  అప్పుడే స్పెషల్‌గా జస్వంత్ పడాల

  ఇటీవలే మొదలైన బిగ్ బాస్ ఐదో సీజన్‌లో కంటెస్టెంట్లుగా ఎంపికైన వారిలో ఎక్కువ మంది పాపులర్ అయిన వాళ్లే ఉన్నారు. సోషల్ మీడియా ద్వారానో.. బుల్లితెర వెండితెరపై సందడి చేసే వాళ్లుగానో పలువురు మంచి గుర్తింపును దక్కించుకున్న వాళ్లు వచ్చారు. ఇక, ఈ సీజన్‌లో కొందరు మాత్రమే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. అందులో ప్రముఖ మోడల్ జస్వంత్ పడాల అలియాస్ జెస్సీ ఒకడు. బిగ్ బాస్ ముందు జరిగిన కంటెస్టెంట్ల పేర్లకు సంబంధించిన ప్రచారంలో ఈ పేరు లేకపోవడంతో.. షో మొదలయ్యాక అందరూ అతడి గురించి తెగ వెతుకున్నారు.

  రామ్ చరణ్ చేతికి విలువైన వాచ్: దాని ధర ఎంతో తెలిస్తే నిద్ర కూడా పట్టదు.. ఇది కూడా రికార్డే!
  https://telugu.filmibeat.com/hero/mega-power-star-ram-charan-weared-rs-1-crore-rm-watch-102615.html

  మొదటిరోజే గొడవ.. అతడి ఏడుపు

  మొదటిరోజే గొడవ.. అతడి ఏడుపు

  బిగ్ బాస్ షోలో నామినేషన్స్ టాస్క్ ఎంత రచ్చగా జరుగుతుందో తెలిసిందే. ఈ సీజన్ మొదటి ఎపిసోడ్‌లోనే నిర్వహకులు ఆ ప్రక్రియను జరిపించారు. అందుకు అనుగుణంగానే పలు గొడవలు అందులో కనిపించాయి. మరీ ముఖ్యంగా జస్వంత్.. హమీదాతో వ్యవహరించిన తీరు గురించి అందులో చర్చ జరిగింది. ఈ కారణం చెప్పే పలువురు అతడిని నామినేట్ కూడా చేశారు. ఆ సమయంలో అందరూ తనను టార్గెట్ చేస్తున్నారని భావించిన జెస్సీ.. అక్కడే బోరున ఏడ్చేశాడు. దీంతో అతడు అందరి దృష్టిలో పడిపోయాడు. అలాగే, అతడిపై సింపతీ కూడా పెరిగింది.

  ఆమెతో గొడవ.. కాళ్లు పట్టుకున్నాడు

  ఆమెతో గొడవ.. కాళ్లు పట్టుకున్నాడు

  నామినేషన్స్ టాస్కులో ఏడవడంతో జస్వంత్ పడాలపై సింపతీ బాగా పెరిగిపోయింది. దీంతో అతడు అమాయకుడు అని అంతా అనుకున్నారు. కానీ, రెండో రోజు మాత్రం అతడి ప్రవర్తన హౌస్‌మేట్స్‌తో పాటు ప్రేక్షకులను షాక్‌కు గురి చేసింది. మరీ ముఖ్యంగా అతడు ఆనీ మాస్టర్‌తో వ్యవహరించిన తీరు విమర్శల పాలు చేసింది. దీంతో ఆమె కూడా ఓ రేంజ్‌లో ఫైర్ అయింది. అది జరిగిన తర్వాత జస్వంత్ వెళ్లి ఆనీ మాస్టర్ కాళ్లను పట్టుకుని మరీ క్షమించమని కోరాడు. దీంతో ఆ గొడవ సద్దుమణిగింది. కానీ, జస్వంత్‌పై మాత్రం విమర్శలు వ్యక్తం అయ్యాయి.

  ఆ కంటెస్టెంట్‌కు నాగబాబు సపోర్ట్: బిడ్డ లాంటి వాడంటూ కామెంట్.. అభిజీత్ గెలిచినట్లే తను కూడా!

  చెత్త పెర్ఫార్మర్.. జైలు పాలయ్యాడు

  చెత్త పెర్ఫార్మర్.. జైలు పాలయ్యాడు

  శుక్రవారం జరిగిన ఎపిసోడ్‌లో కంటెస్టెంట్లు అందరినీ కూర్చోబెట్టిన బిగ్ బాస్.. ఈ వారం లగ్జరీ బడ్జెట్ టాస్కులో ఎవరు ఉత్తమ ప్రదర్శన ఇచ్చారు.. ఎవరు చెత్తగా ఆడారు అని నిర్ణయించుకుని ఒక్కో పేరు చెప్పమని ఆదేశించాడు. దీంతో చాలా మంది బెస్ట్ పెర్ఫార్మర్‌గా విశ్వకు ఓట్ చేయడంతో అతడినే ఎంచుకున్నారు. అలాగే, వరస్ట్ పెర్ఫార్మర్‌గా జస్వంత్‌ను ఎంపిక చేసుకున్నారు. దీంతో తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ అతడిని జైలులో పెట్టమని కెప్టెన్ సిరి హన్మంత్‌ను ఆదేశించాడు బిగ్ బాస్. ఫలితంగా అతడు ఈ సీజన్‌లో జైలుకు వెళ్లిన ఫస్ట్ కంటెస్టెంట్ అయ్యాడు.

  Gem Movie Team Special Interview With Racha Ravi
  నాగార్జున గురించి భయపడిన జెస్సీ

  నాగార్జున గురించి భయపడిన జెస్సీ

  జైలుకు వెళ్లడానికి ముందే జస్వంత్.. సన్నీతో ఆనీ మాస్టర్‌తో జరిగిన గొడవ గురించి చర్చించాడు. ఆ సమయంలో ‘నేను అలా చేసుండకూడదు. ఇప్పుడు నాగార్జున గారు నన్ను ఏమంటారో అని చాలా భయంగా ఉంది. అనవసరంగా ఆనీ మాస్టర్‌తో కాళ్లు పెట్టి గొడవ పెట్టుకున్నా' అంటూ తెగ భయపడిపోయాడు. ఆ సమయంలో సన్నీ అతడికి ధైర్యం చెప్పే ప్రయత్నాలు చేశాడు. మొత్తానికి ఆనీ మాస్టర్‌తో గొడవ పెట్టుకోవడం వల్ల జస్వంత్‌పై విమర్శలు రావడంతో పాటు ఇప్పుడు అతడిలో భయం కూడా మొదలైంది. దీంతో శనివారం ఎపిసోడ్‌పై ఆసక్తి పెరిగిపోయింది.

  English summary
  Bigg Boss is the Telugu Top Rreality TV Series Recently Started 5th Season. In Recent Episode.. jaswanth Padala Comments on Nagarjuna.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X