For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 5: ఆమె కాళ్లు పట్టుకుని ఏడ్చిన జస్వంత్.. మళ్లీ నోరు జారి అంత మాట అనడంతో!

  |

  అసలేమాత్రం అంచనాలు లేకుండా తెలుగులోకి పరిచయమై.. అసాధారణమైన రీతిలో ప్రేక్షకాదరణను అందుకుంటూ సూపర్ సక్సెస్‌గా ముందుకు సాగుతోన్న ఏకైక షో బిగ్ బాస్. గతంలో ఎన్నడూ చూడని కాన్సెప్టుతో వచ్చినా.. దీనికి మన ప్రేక్షకుల భారీ స్థాయిలో మద్దతును అందించారు. ఫలితంగా ఈ రియాలిటీ షో రికార్డు స్థాయిలో రేటింగ్‌ను అందుకుంటూ నేషనల్ టెలివిజన్ రికార్డులను సైతం బద్దలు కొట్టేస్తోంది. అంతేకాదు, ఏకంగా తెలుగులో నాలుగు సీజన్లను కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఐదో సీజన్ కూడా మొదలైంది. ఆరంభం నుంచే ఇందులో చిత్ర విచిత్రమైన సంఘటలను జరుగుతున్నాయి. ఇక, ఈ సీజన్‌లో జస్వంత్ పడాల ఆరంభం నుంచీ హైలైట్ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో తాజా ఎపిసోడ్‌లో అతడు మరో కంటెస్టెంట్ కాళ్లు పట్టుకున్నాడు. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

  Photo Courtesy: Star మా and Disney+Hotstar

  అనుకున్నట్లుగానే మొదలైన సీజన్

  అనుకున్నట్లుగానే మొదలైన సీజన్

  తెలుగు ప్రేక్షకుల ఎంతో కాలంగా ఎదురు చూసిన బిగ్ బాస్ ఐదో సీజన్ గత ఆదివారం (సెప్టెంబర్ 5) చాలా గ్రాండ్‌గా ప్రారంభం అయింది. టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున సారథ్యంలో ఎంతో సందడిగా సాగిన ఈ ఎపిసోడ్‌లో ఏకంగా 19 మంది కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. వారిలో సిరి హన్మంత్, వీజే సన్నీ, షణ్ముక్ జశ్వంత్, ప్రముఖ నటి ప్రియ, యాంకర్ రవి, నటరాజ్ మాస్టర్, జబర్ధస్త్ ప్రియాంక సింగ్, లహరి, సింగర్ శ్రీరామచంద్ర, సరయు, జస్వంత్, శ్వేతా వర్మ, మానస్ షా, ఉమాదేవి, ఆర్జే కాజల్, లోబో, హమీదా, ఆనీ మాస్టర్, విశ్వలు బిగ్ బాస్ టైటిల్ కోసం పోటీ పడడానికి హౌస్‌లోకి వెళ్లారు.

  మొదటిరోజు నుంచే ఆసక్తిగా సాగేలా

  మొదటిరోజు నుంచే ఆసక్తిగా సాగేలా

  తెలుగులో బిగ్ బాస్‌కు దక్కేంత ఆదరణ మరే షోకూ రావడం లేదు. అందుకే ఇది నాలుగు సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఎన్నో రికార్డులను కూడా క్రియేట్ చేసేసింది. దీంతో దీనికి అభిమానులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నారు. దీంతో ఐదో సీజన్‌పై ఆరంభం నుంచే భారీ బజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో షో నిర్వహకులు అదిరిపోయేలా దీన్ని డిజైన్ చేసినట్లు మొదట్లోనే తెలిసిపోయింది. ప్రేక్షకులకు మరింత మజాను అందించాలన్న ఉద్దేశంతో షోను ఆసక్తికరంగా నడిపించేందుకు ప్లాన్ చేశారు. అందుకు అనుగుణంగానే మొదటి ఎపిసోడ్‌లోనే నామినేషన్స్ టాస్క్‌ కొన్ని గొడవల కారణంగా రచ్చ అయింది.

  సుమ షోలో సంచలన సంఘటన: నిజంగా తిట్టుకున్న జబర్ధస్త్ భామలు.. కెమెరాలు ఉన్నా కిందపడి మరీ!

  స్పెషల్ అట్రాక్షన్ అయిన జస్వంత్

  స్పెషల్ అట్రాక్షన్ అయిన జస్వంత్

  పోయిన సీజన్లతో పోలిస్తే ఈ సారి బిగ్ బాస్ కంటెస్టెంట్లుగా ఎంపికైన వారిలో ఎక్కువ మంది పాపులర్ అయిన వాళ్లే ఉన్నారు. సోషల్ మీడియా ద్వారానో.. బుల్లితెర వెండితెరపై సందడి చేసే వాళ్లుగానో పలువురు మంచి గుర్తింపును దక్కించుకున్న వాళ్లు వచ్చారు. ఇక, ఈ సీజన్‌లో 19 మంది కంటెస్టెంట్లుండగా.. అందులో కొందరు మాత్రమే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. అందులో ప్రముఖ మోడల్ జస్వంత్ పడాల అలియాస్ జెస్సీ ఒకడు. బిగ్ బాస్ ముందు జరిగిన కంటెస్టెంట్ల పేర్లకు సంబంధించిన ప్రచారంలో ఈ పేరు లేకపోవడంతో.. ప్రీమియర్ ఎపిసోడ్ నుంచి అందరూ ఇతగాడి గురించి ఇంటర్నెట్‌లో వెతికేస్తున్నారు.

  Bigg Boss Telugu 5: ఆమెను టార్గెట్ చేసిన అభిజీత్ ఫ్యాన్స్.. ఆ వీడియోలు షేర్ చేసి మరీ దారుణంగా!

  మొదటిరోజే గొడవల్లో భాగమై.. ఏడ్చి

  మొదటిరోజే గొడవల్లో భాగమై.. ఏడ్చి

  బిగ్ బాస్ షోలో నామినేషన్స్ టాస్క్ రోజు ఎంత రచ్చ జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సీజన్ మొదటి ఎపిసోడ్‌లోనే నిర్వహకులు ఆ ప్రక్రియను జరిపించారు. అందుకు అనుగుణంగానే పలు గొడవలు అందులో కనిపించాయి. మరీ ముఖ్యంగా జస్వంత్.. హమీదాతో వ్యవహరించిన తీరు గురించి అందులో చర్చ జరిగింది. ఈ కారణం చెప్పే విశ్వతో పాటు పలువురు అతడిని నామినేట్ కూడా చేశారు. ఆ సమయంలో అందరూ తనను టార్గెట్ చేస్తున్నారని భావించిన జెస్సీ.. అక్కడే బోరున ఏడ్చేశాడు. దీంతో ఈ కంటెస్టెంట్ అందరి దృష్టిలో పడిపోయాడు. అలాగే, అతడిపై సింపతీ కూడా భారీగా పెరిగిపోయింది.

  ఆనీ మాస్టర్‌తో గొడవ.. రచ్చ చేసింది

  ఆనీ మాస్టర్‌తో గొడవ.. రచ్చ చేసింది

  మొదటి రోజు ఎంతో కామ్‌గా కనిపించిన జస్వంత్.. అందరి దృష్టిలో అమాయకుడు అన్న ట్యాగ్‌ను అందుకున్నాడు. అయితే, రెండో రోజు మాత్రం అతడి ప్రవర్తన హౌస్‌మేట్స్‌తో పాటు ప్రేక్షకులను షాక్‌కు గురి చేసింది. మరీ ముఖ్యంగా అతడు ఆనీ మాస్టర్‌తో వ్యవహరించిన తీరు విమర్శల పాలు చేసింది. సిరి హన్మంత్ కోసం ఓ సీటును ఉంచిన అతడు.. దానిపై కాలు వేసి పెట్టాడు. అప్పుడు ఆనీ మాస్టర్ వచ్చి కాలు తీయమని అడిగింది. కానీ, దీనికి అతడు నిరాకరించాడు. దీంతో ఆమె ఓ రేంజ్‌లో ఫైర్ అయింది. దీనికి ప్రతిగా జెస్సీ కూడా ఘాటుగానే స్పందించాడు. దీంతో హౌస్‌లో పెద్ద రచ్చే జరిగింది.

  Bigg Boss Telugu 5: బిగ్ బాస్‌లో వింత ట్రాక్.. అతడిపై మనసు పడ్డ ప్రియాంక.. అందరి ముందే ఆ మాట!

  ఆనీ మాస్టర్ కాళ్లు పట్టుకున్న జెస్సీ

  ఆనీ మాస్టర్ కాళ్లు పట్టుకున్న జెస్సీ

  ఆనీ మాస్టర్‌తో జస్వంత్ వ్యవహరించిన తీరు ఒక్కసారిగా హైలైట్ అయింది. దీని ప్రభావం ఓటింగ్‌పైన కూడా తీవ్రంగా పడిపోయింది. ఫలితంగా అతడికి పడాల్సిన ఓట్లు కూడా వేరే వాళ్లకు పడ్డాయని సోషల్ మీడియాలో వచ్చిన రిపోర్టులను బట్టి తెలుస్తోంది. అంతలా ప్రభావం చూపించింది అతడి ప్రవర్తన. ఇక, బుధవారం జరిగిన ఎపిసోడ్‌లో.. తన తప్పును తెలుసుకున్న జస్వంత్.. ఆనీ మాస్టర్ దగ్గరకు వచ్చి అందరి ముందే సారీ చెప్పాడు. అంతేకాదు, ఆమె కాళ్లు కూడా పట్టుకున్నాడు. అలాగే, ఆమె ఎదురుగా నిల్చుని రెండు చేతులు జోడించి క్షమించమని వేడుకున్నాడు. ఆ తర్వాత మరోసారి ఏడ్చేశాడు కూడా.

  Maha Samudram Movie Team On 'Cheppake Cheppake' Song
  జెస్సీ ఆ మాట అనడంతో అభ్యంతరం

  జెస్సీ ఆ మాట అనడంతో అభ్యంతరం

  ఆనీ మాస్టర్‌కు జస్వంత్ క్షమాపణ చెప్పే సమయంలో ‘మీరు నా తల్లి లాంటి వాళ్లు.. తప్పునాదే. క్షమించండి' అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతడి సారీని అంగీకరించిన ఆమె.. తల్లి వయసు అనడంపై మాత్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. అప్పుడు ‘ఏంటి తల్లి లాంటి దాన్నా' అని ప్రశ్నించింది. దానికి మళ్లీ సారీ చెప్పిన జెస్సీ కాదులే అని అన్నాడు. అనంతరం ఆనీ మాస్టర్ కూడా ‘నేను కూడా అంత హైపర్ అయి ఉండకూడదు. అరవడం కూడా తప్పే. ఇప్పుడు చెప్పిన వివరణ అప్పుడు చెప్పుంటే ఇంత గొడవ కాకపోయేది కదా. నేను కూడా సారీ చెబుతున్నా' అని గొడవకు అంతటితో బ్రేక్ వేసేసింది.

  English summary
  Bigg Boss is the Telugu Top Rreality TV Series Recently Started 5th Season. In Recent Episode.. jaswanth Padala Touched Anee Master Legs.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X