For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss: లోబో ఇకనైనా మారవా? ఇంకెన్నాళ్ళు ఇలా.. ఆడుకుంటున్న నెటిజన్లు!

  |

  బిగ్ బాస్ సీజన్ ఫైవ్ విజయవంతంగా 6 వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పటికే ఆరుగురు సభ్యులు విజయవంతంగా హౌస్ నుండి ఎలిమినేట్ కూడా అయ్యారు. ఆరో వారం చివర్లో హౌస్ సభ్యురాలు శ్వేతా వర్మ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. అయితే ఈ ఎలిమినేషన్ ఎపిసోడ్ లో కూడా లోబో సింపతీ గేమ్ ఆడుతున్నాడు అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అసలు లోబో ఏం చేశాడు? ఎందుకు సింపతీ గేమ్ ఆడుతున్నాడు అనే మాట మళ్లీ వినిపిస్తోంది? అనే వివరాల్లోకి వెళితే

  లోబో సీక్రెట్ రూమ్ కి

  లోబో సీక్రెట్ రూమ్ కి

  బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ఆరో వారంలో జరిగిన ఒక సీక్రెట్ టాస్క్ లో భాగంగా నాగార్జున ప్రతి ఒక్క హౌస్ సభ్యుడిని లోపలికి పిలిపించి మీ దృష్టిలో ఎవరు హౌస్లో ఉండటానికి అర్హులు కారు అని చెప్పాల్సిందిగా కోరగా ఎక్కువ ఓట్లు ప్రియ అలాగే లోబో ఇద్దరికీ వచ్చాయి. అయితే వారిద్దరి మధ్య ఓటింగ్ ప్రక్రియ పెట్టగా ఎక్కువ మంది హౌస్ సభ్యులు ప్రియను సపోర్ట్ చేయడంతో లోబోను ఎలిమినేట్ అవుతున్నట్లు నాగార్జున ప్రకటించాడు.

  ఒక ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ని ఎలా అయితే సాగనంపుతారో అలాగే పూర్తి ప్రక్రియ పూర్తి చేసిన తరువాత ఇక బయటకు వెళ్ళటం ఒక సెకండ్ లో జరిగి పోతుంది అనగా వెనక్కి పిలిచి నువ్వు సీక్రెట్ రూమ్ లో ఉండబోతున్నావని చెప్పి లోబోని లోపలికి పంపారు నాగార్జున.

  రొటీన్ గేమ్స్

  రొటీన్ గేమ్స్

  ఇక నిన్న సన్ డే, ఫన్ డే కావడంతో నాగార్జున కంటెస్టెంట్స్ చేత గేమ్స్ ఆడించాడు. ముందుగా రవిని సంచాలక్ గా ప్రకటించి మిగతా కంటెస్టెంట్స్ ను రెండు టీమ్స్ గా డివైడ్ చేసారు. షణ్ముఖ్, సిరి, కాజల్, శ్రీరామ్, ప్రియాంక, విశ్వ ఒక టీమ్ కాగా మానస్, సన్నీ, ఎన్నీ మాస్టర్, జెస్సీ, ప్రియా, శ్వేతా ఒక టీమ్ గా అయ్యారు.

  ఈ టీమ్స్ తో మొత్తం రెండు ఆటలు ఆడించాడు నాగార్జున. ముందుగా సాంగ్ ను ఒక బూర వాయిస్తూ టీమ్ చేత గెస్ చేయించాలి. అయితే ఇందులో టీమ్ ఏ నెగ్గారు. ఇక రెండో గేమ్ ఒక్కో టీమ్ నుండి ఒక్కొక్కరు వచ్చి కళ్ళకు గంతలు కట్టుకుని బోన్ ను వెతకాల్సి ఉంటుంది. మిగతా టీమ్ మేట్స్ వారిని గైడ్ చేయాలి. ఇందులో కూడా టీమ్ ఏనే గెలిచింది.

  సేఫ్

  సేఫ్

  ఇక సేఫ్ చేయడం విషయానికి వస్తే నామినేషన్స్ లో ఉన్న వారు అందరికీ సాఫ్ట్ టాయ్స్ ఇచ్చారు. అందులో సేఫ్, అన్ సేఫ్ అన్నది రాసి ఉంటుంది. ఇందులో ప్రియాంక, షణ్ముఖ్ సేఫ్ అయ్యారు. తరువాత బూర గేమ్ నడుస్తుండగా మధ్యలో నామినేషన్స్ లో ఉన్నవారికి పిగ్గీ బ్యాంక్ ఇచ్చి వాటిని పగలకొట్టాలని చెప్పారు. రెడ్ కాయిన్ వస్తే అన్ సేఫ్, గ్రీన్ వస్తే సేఫ్ అని చెప్పగా ఇందులో శ్రీరామ్, సన్నీ సేఫ్ అయ్యారు. తర్వాత జెస్సీ సేఫ్ అయినట్లు నాగార్జున ప్రకటించాడు. ఇక ఫైనల్ గా నామినేషన్స్ లో సిరి, శ్వేతా ఉండగా చివరికి శ్వేతా ఎలిమినేట్ అయింది.

  రవితో జాగ్రత్త

  రవితో జాగ్రత్త

  శ్వేతా బిగ్ బాస్ స్టేజ్ మీదకు వచ్చి అందరి గురించి దాదాపు మంచి మాటలు చెప్పి వెళ్ళింది. ఎవరి గురించి కూడా పెద్దగా నెగటివ్ గా మాట్లాడలేదు. కేవలం రవి విషయంలో మాత్రం ఆట ఆడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని ఆమె చెప్పుకొచ్చింది. ఆమె వెళ్ళిపోతున్నప్పుడు ముందు నుంచి నా బిడ్డ అంటూ వచ్చిన ఆనీ మాస్టర్ ఎమోషనల్ అయ్యారు.

  ఇక నాగార్జున చివరిగా ఇంటికి వెళ్ళే ముందు సీక్రెట్ రూమ్ లో ఉన్న లోబోతో కూడా మాట్లాడారు. అయితే లోబో సీక్రెట్ రూమ్ లో ఉండలేను అన్నట్లుగా నాగార్జునతో మాట్లాడాడు. అలాగే అసలు తాను హౌస్ లో కూడా ఇమడలేకపోతున్నానని, నాకు ఏమో అబద్ధాలు ఆడడం రాదు ఇక్కడ చూస్తే అక్కడ మాట ఇక్కడ ఇక్కడి మాటలు అక్కడ మాట్లాడుతున్నారు. ఒక మాట తీసుకువెళ్లి మరోచోట చెబుతున్నారు ఇక్కడ నేను ఉండలేక పోతున్నాను అని లోబో చెప్పుకొచ్చాడు.

  Pushpa The Rise US Premieres Plans | Allu Arjun కెరీర్ లో ఫస్ట్ టైమ్..!! || Filmibeat Telugu
  సింపతీ గేమ్

  సింపతీ గేమ్

  అయితే రివర్స్ లో నాగార్జున లోబొని మోటివేట్ చేయాల్సి వచ్చింది. జీవితంలో ఎన్నో చూసి ఇక్కడి వరకు వచ్చి ఉంటావు ఇది కూడా చూడు ఇక్కడ మంచి అవకాశం వచ్చింది ఇక్కడ ప్రూవ్ చేసుకుంటే నీకు భవిష్యత్తులో మరిన్ని మంచి అవకాశాలు వస్తాయి అని నాగార్జున లోబో కి ధైర్యం చెప్పారు. మరి ఈ సీక్రెట్ రూమ్ నుంచి నేను బయటకు ఎప్పుడు వెళ్తాను అని అడిగితే అది నిర్ణయించాల్సింది బిగ్ బాస్ అని నాగ్ చెప్పి, వచ్చే వారం కలుస్తానని వెళ్ళిపోయాడు.

  ఇక్కడ కూడా లోబో సింపతీ కోసం ప్రయత్నిస్తూ, గేమ్ ఆడకుండా సేఫ్ ప్లే చేయాలని చూస్తున్నట్లుగా అనిపిస్తోందని నెటిజన్లు అంటున్నారు. ముందు నుంచి కూడా లోబో నేను ఒక బస్తీ మనిషిని చాలా చిన్న స్థాయి నుంచి వచ్చాను అంటూ ప్రేక్షకులలో సింపతీ క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని ఇప్పుడు కూడా అదే బాటలో ఉన్నాడు అని వారంటున్నారు.

  English summary
  netizens criticizing that in bigg Boss Telugu 5 lobo again playing sympathy game in secret room.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X