For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 5: లోబో ఎమోషనల్ స్టోరీ.. నా జీవితం చెత్తకుండి.. సమాధి దగ్గర ఏడుస్తూ ఉంటా..

  |

  బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ప్రేక్షకులను అలరించడానికి పవర్ఫుల్ గా కంటెస్టెంట్స్ తో సిద్ధమైంది. గత కొన్ని రోజులుగా ఈ షోకు సంబంధించిన ప్రోమోలు కథనాలు ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక స్టార్ మా లో ప్రసారాం అవుతున్న 5వ సీజన్ రియాలిటీ షో కోసం మరోసారి అక్కినేని నాగార్జున హోస్ట్ గా దర్శనమివ్వడంతో ఈసారి కూడా షో హిట్టవుతుందని చెప్పవచ్చు. గ్రాండ్‌గా మొదలైన ఈ సీజన్ మొదటిరోజు మూడు గంటల పాటు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ను అందించింది. ఇక ఒక్కొక్కరుగా కంటెస్టెంట్స్ వారి స్టైల్ లోనే హౌజ్ లోకి అడుగు పెట్టారు.

  6వ సెలబ్రెటీగా లోబో

  6వ సెలబ్రెటీగా లోబో

  ఒకరోజు ముందుగానే మొదలైన ఈ షోలో మొదట ఇంటరాక్షన్‌తో సహా మిగిలిన సీక్వెన్స్‌లను షూట్ చేశారు. ఇక ఆ ఎపిసోడ్ ఆదివారం ప్రసారం అయ్యింది. ఇక అందులో 6వ కంటెస్టెంట్ గా లోబో కూడా విబిన్నంగా ఎంట్రీ ఇచ్చారు. తన ఎమోషనల్ స్టోరీని కూడా చెప్పాడు. తన ఫాదర్ చనిపోయాక చాలా బాధపడ్డాను అంటూ ప్రతి శుక్రవారం సమాధి దగ్గరకు వెళ్లి తలచుకుంటాను అని చెప్పాడు. ఆ తరువాత మంచి ఎనర్జీతో పాగల్ సాంగ్ తో ఎంట్రీ ఇచ్చాడు.

  నా అసలు పేరు ఇదే

  నా అసలు పేరు ఇదే

  లోబో మాట్లాడుతూ.. హైదరాబాద్ కుషాయిగూడలో నేను లోబో మొదట టాటూ ఆర్టిస్ట్ గా కెరీర్ ను స్టార్ట్ చేశాను. ఫస్ట్ టాటూ ఒక రష్యన్ అమ్మాయికి వేశాను. అందుకే ఆమె నాకు లోబో అని పేరు పెట్టింది. నా అసలు పేరు మహమ్మద్ కయ్యుమ్. 9వ తరగతి చదివాను. ఫ్యాన్ దొంగతనం చేయడంతో అప్పుడే టీసి ఇచ్చేసి పంపేశారు.

  నా జీవితం చెత్తకుండి

  నా జీవితం చెత్తకుండి

  నా తండ్రి గురించి చెప్పుకోవాలి. జనాలు మా పేరెంట్స్ తో అనేవారు. ఏంటి మీ వాడు చినిగిపోయేలా బట్టలు చెప్పులు వేసుకుంటాడు అని. కానీ నాకు మాత్రం ఇలానే ఇష్టం. ఒక్క మాటలో చెప్పాలి అంటే నా జీవితం చెత్తకుండి. నా వైఫ్ కు వచ్చాకా నేను చాలా మారిపోయాను. ఇక కొడుకు ఉంటే ఎలా ఉండేవాడినో తెలియదు గాని కూతురి వల్ల మారిపోయాను.

  నెత్తిమీద మరోక రంగు ఉంటే లోబో

  నెత్తిమీద మరోక రంగు ఉంటే లోబో

  ఇక బిగ్ బాస్ అనేది కెరీర్ కు చాలా హెల్ప్ అవుతుంది. ప్రస్తుతం మనం 5వ స్టేజ్ లో ఉన్నాము అంటే డైరెక్ట్ గా 25వ స్టేజ్ లోకి వెళ్లినట్లే. మింగేస్తా అంటూ లోబో పాగల్ గూగుల్ సాంగ్ తో సరికొత్తగా ఎంట్రీ ఇచ్చాడు. ఏడు రంగులు ఉంటే రెయిన్ బో అంటారు. నెత్తిమీద మరోక రంగు ఉంటే లోబో అంటారు అని నాగార్జున కూడా లోబో స్టైల్ పై పాజిటివ్ గా స్పందించారు. క్యామో కలర్ అంటే తనకు చాలా ఇష్టం అంటూ.. ఇది నాకంటూ ప్రత్యేకంగా ఉండాలని లోబో నాగ్ తో అన్నారు.

  అప్పుడు మా టీవీ గేట్ ముందు

  అప్పుడు మా టీవీ గేట్ ముందు

  ఇక మా టీవీలో VJ అవ్వాలని అనుకున్నప్పుడు ఆ స్టోరీ గురించి చెబుతూ.. చిన్న కుటుంబ నుంచి వచ్చిన నేను మా టీవీ గేటు దగ్గర గంటలు గంటలు నిలబడేవాడిని. 2012 వరకు ఒక రోజు కాల్ వచ్చింది. మూడున్నర ఏళ్ళు మా మ్యూజిక్ లో వర్క్ చేశాను. మళ్ళీ ఇన్నాళ్లకు నాకు హెల్ప్ చేసిన వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.

  Sri Reddy Got Severly Opposed By Anchor Lobo
  అందరిని సరదాగా పరిచయం చేసుకుంటూ..

  అందరిని సరదాగా పరిచయం చేసుకుంటూ..

  ఇక హౌజ్ లోకి ఎంట్రీ ఇవ్వగానే లోబో అందరిని ఎట్రాక్ట్ చేశాడు. సన్నీని డార్లింగ్ అంటూ హగ్ చేసుకున్నాడు. లహరిని కూడా ఆప్యాయంగా హలో చెప్పాడు. ఇక శ్రీరామచంద్రను కూడా హగ్ చేసుకుని పరిచయం చేసుకున్నాడు. హౌజ్ కూడా చాలా సెక్సీగా ఉందని అన్నాడు. అనంతరం ఫుల్ హౌజ్ ను చూస్తూ లోబో ఎంతగానో ఆనందపడ్డాడు. టైమ్ కు చాయ్ ఇస్తే చాలు అని అన్నాడు.

  English summary
  Bigg boss telugu 5 Contestant sri ramachandra Introduction.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X