For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 5: ఆఖరికి జెస్సితో కూడా పరువు పోగొట్టుకున్న యాంకర్ రవి.. కుళ్ళు జోకులు అంటూ

  |

  బిగ్ బాస్ సీజన్ 5 మరోసారి ఆసక్తికరంగా మారుతుంది. రెండు వారాల పాటు కొనసాగిన అద్భుతమైన పోరులో ఎవరికి వారు సోలో ఫైట్ ఇచ్చి నామినేషన్ నుంచి తప్పించుకున్నారు. అయితే గతంలో జరిగిన గొడవలు కూడా భవిష్యత్తులో నామినేషన్స్ లో కీలకంగా మారుతాయని మరోసారి అర్థమవుతోంది. మూడవ వారం నామినేషన్స్ లో కూడా కొంతమంది గతంలో తరహాలోనే ప్రత్యర్ధులు నామినేట్ చేయడం విశేషం. అయితే ఎక్కువ అనుభవం ఉన్నవారు కూడా తప్పులో కాలు వేసి ఈజీగా దొరికిపోతున్నారు.

  తెలివిగా గేమ్ ఆడుతున్నాను అనుకుంటున్నారు కానీ నామినేషన్ కు వచ్చే సరికి మాత్రం వారి ప్లాన్ ఏమి వర్కౌట్ అవ్వడం లేదు. ముఖ్యంగా యాంకర్ రవి అయితే శత్రువుల సంఖ్యను కూడా పెంచుకుంటున్నాడు. ఒక విధంగా ఆటలో అది కొంత బోనస్ అయినప్పటికీ ఆఖరికి చిన్న చిన్న వాళ్లతో కూడా రవి మాటలు పడడం అతనికి కొంత మైనస్ గా మారుతుంది. రీసెంట్ గా మరొకసారి జెస్సి నామినేట్ చేసే యాంకర్ రవి గాలి తీసుకున్నంత పనిచేశాడు.

  Photo Courtesy: Star మా and Disney+Hotstar

  అక్కతో కూడా గొడవ

  అక్కతో కూడా గొడవ

  బిగ్ బాస్ సీజన్ 5లో అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ లో అందరి కంటే కాస్త చెప్పుకోతగ్గ సెలబ్రిటీ ఎవరైనా ఉన్నారు అంటే యాంకర్ రవి అనే చెప్పాలి. తప్పకుండా ఈ స్టార్ యాంకర్ బిగ్ బాస్ హౌస్ లో చివరి వరకు ఉంటాడు అని ఇప్పటికే అందరికీ ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. కానీ నామినేషన్స్ లో రిస్క్ లో పెడితే మాత్రం మొదటికే మోసం వస్తుంది. ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా కూడా హౌస్ లో నుంచి బయటకు వెళ్లిపోయే అవకాశం ఉంటుంది. యాంకర్ రవి ఎంత వరకు పోటీ ఇస్తారో తెలియదు గానీ అతనికి మాత్రం మెల్లమెల్లగా శత్రువుల సంఖ్య ఎక్కువగానే అవుతుంది మొన్నటి వరకు ప్రియాను అక్క అంటూ కొనసాగిన రవి ఇప్పుడు ఆమెతో కూడా గొడవ పెట్టుకునే పరిస్థితి ఏర్పడింది.

   భవిష్యత్తులో మరిన్ని గొడవలు

  భవిష్యత్తులో మరిన్ని గొడవలు

  రవిపై ప్రియ చేసిన వ్యాఖ్యలు ఈసారి బిగ్ బాస్ లో మెయిన్ హైలెట్ గా నిలిచాయి అని చెప్పవచ్చు. లహరి మగవాళ్లతో ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా రవితో అర్ధ రాత్రి బాత్ రూం దగ్గర కౌగిలించుకుంటుందని చెప్పిన విధానం అందరినీ ఒక్క సారిగా షాక్ కు గురిచేసింది. యాంకర్ రవి ఈ విషయంలో గట్టిగానే పోరాటం చేశాడు కానీ ఆఖరికి అక్కనే అతన్ని టార్గెట్ చేసినట్లు అనిపించింది. ఇదివరకే వీరి మధ్యలో చాలా వరకు మంచి వాతావరణం కనిపించింది. కానీ మొదటిసారి ప్రియ అన్న మాటలకు రవి మారిపోయాడు. చూస్తుంటే భవిష్యత్తులో వీరి మధ్యలో మరింత గొడవలు జరిగేలా ఉన్నాయని అర్థమవుతోంది. రిలేషన్ షిప్ నెగిటివ్ గా కామెంట్ చేయడాన్ని ఎవరు కూడా అంత ఈజీగా తీసుకో లేరనే చెప్పాలి.

  ఆఖరికి లోబో చేతిలో కూడా

  ఆఖరికి లోబో చేతిలో కూడా

  ఈ సారి బిగ్ బాస్ హౌస్ లో ఎవరు ఎలా ఉన్నా కూడా యాంకర్ రవి మాత్రం మొదటి నుంచి కూడా అందరితో ఒక స్పెషల్ బాండ్ ను ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నాడు. కానీ అతను ఇంత ప్రయత్నాలు చేస్తున్నా కూడా వర్కవుట్ అవ్వడంలేదు. అతనితో ఎన్నో ఏళ్ల స్నేహంతో ఉన్నా లోబో కూడా మొదట రెండు సార్లు నామినేషన్ చేశాడు. దోస్తానా ఉంటే బయట చూసుకోవాలి కానీ హౌస్ లో మాత్రం అతి తెలివి చూపించకూడదు అంటూ లోబో ఇదివరకే రవి పై చేసిన కామెంట్స్ వైరల్ అయిన విషయం తెలిసిందే. కానీ రవి మాత్రం తనకు సన్నిహితంగా ఉండేవారిని అసలు నామినేట్ చేయడం లేదు అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి.

   గోడ మీద పిల్లి

  గోడ మీద పిల్లి

  ఇక మరో సారి జెస్సి విషయంలో యాంకర్ రవి నోరు జారడు అని గట్టిగానే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే కొన్ని సార్లు జెస్సీని కొందరు చాలా తక్కువ చేసి మాట్లాడారు. మొదటి ఆని మాస్టర్ తో గొడవ జరిగినప్పటి నుంచి కూడా అతను ఏమీ తెలియని చిన్నపిల్లాడు అంటూ కొందరు అవహేళన చేసి మాట్లాడారు. యాంకర్ రవి కూడా పలుమార్లు అతనికి నచ్చజెప్పేందుకు ప్రయత్నం చేశాడు. ఒక విధంగా గీతోపదేశం చేశాడు అనే చెప్పాలి. ఉంటే ఎదో ఒక సైడ్ తీసుకో అంతేగాని గోడ మీద పిల్లి లాగా ఉండకు. వెయిట్ చెయ్ తప్పు ఉన్నా కూడా నువ్వే సమర్థుడుగా నిలవాలి అంటూ బాగానే చెప్పినప్పటికీ యాంకర్ మాటలు మాత్రం జెస్సి మైండ్ లోకి రాలేదు.

  జెస్సీ మీద ఎలాంటి స్టాండ్ తీసుకోలేపోతున్నాను

  జెస్సీ మీద ఎలాంటి స్టాండ్ తీసుకోలేపోతున్నాను

  ఇక యాంకర్ రవి మూడవ వారం నామినేషన్ లో జెస్సిని నామినేట్ చేస్తూ గట్టిగానే వాదించారు. జెస్సీ చిన్న చెడ్డీలు వేసుకుని ఇంకా ఎన్ని రోజులు ఆ తగిలిన దెబ్బనే చూపించుకుంటావు. ఎందుకో అతను ఇంతమంచి ఫ్లాట్ ఫామ్‌ని వేస్ట్ చేస్తున్నాడని అని అనిపిస్తోంది. అదే మైండ్ సెట్‌‌లో ఉంటున్నాడు. హౌజ్ లో అందరి మీద నాకు ఎదో ఒకటి ఉంది. అసలు జెస్సీ మీద ఎలాంటి స్టాండ్ తీసుకోలేపోతున్నాను అందుకే నామినేట్ చేస్తున్నాను అని రవి సమాధానం ఇచ్చారు.

  నా గేమ్ నేను అడుతున్నాను

  నా గేమ్ నేను అడుతున్నాను

  ఇక రవి మాటలకు రియాక్ట్ అయిన జెస్సీ.. టాస్క్‌లో నేను ఎలా ఆడానో అందరికీ తెలుసు. జనాలు కూడా చూస్తున్నారు. నీకు నచ్చల్సిన అవసరం లేదు. నా గేమ్ నేను అడుతున్నాను.. మీరు కుళ్లు జోకులు వేసుకుంటే మధ్యలో వచ్చి నేను దూరలేను. అది నాకు ఏ మాత్రం నచ్చదు. నేను అయితే పర్ఫెక్ట్‌గా గేమ్ ఆడుతున్నా అని జెస్సి గట్టిగానే సమాధానం ఇచ్చాడు. ఒక విధంగా చూస్తే రవికి గట్టిగా కౌంటర్ ఇచ్చాడు అని చెప్పాలి

  Love Story Pre Release Event | Ap Govt కి చిరు విన్నపాలు!!
  సైలెంట్ గా కొడుతున్న జెస్సి..

  సైలెంట్ గా కొడుతున్న జెస్సి..

  ఎందుకంటే ఫిజికల్ టాస్క్ లో కూడా జెస్సి అందరికంటే ఎక్కువ సమర్థంగా ఆడాడు. టీమ్ గెలవడానికి కూడా అతను ఎంతగానో హెల్ప్ చేశాడు. కెప్టెన్ గా విశ్వ ఎంపిక అయినప్పుడు కూడా సపోర్ట్ బాగానే పనిచేసింది. తన ఆటను తన స్టైల్ లో అడుగుతున్నాడు. నలుగురి ముందు తక్కువ కాకుండా చూసుకుంటున్నాడు. అదే విషయాన్ని యాంకర్ రవి నామినేటెడ్ చేసినప్పుడు వాదించి మంచి పని చేశాడు అనే కామెంట్ వినిపిస్తోంది. జెస్సి సైలెంట్ గానే ఉన్నప్పటికీ కూడా అవసరం వచ్చినప్పుడు తనను తాను హైలైట్ చేసుకునే విధంగా ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అతను ఎక్కువగా గొడవలు పెట్టుకోకపోవడంతో ఎవరి దృష్టిలో పెద్దగా పడడం లేదు. ఇక యాంకర్ రవి చెప్పినట్లుగా రానున్న రోజుల్లో మరిన్ని గోడవలతో హైలెట్ అవుతాడో లేదో చూడాలి.

  English summary
  Bigg boss telugu 5 Once again anchor ravi plans disaster,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X