For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 5: ఐదో సీజన్‌లో అవన్నీ స్పెషల్‌గా.. ఆ మాటతో అంచనాలు పెంచిన నాగార్జున

  |

  తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల కార్యక్రమాలు ప్రసారం అవుతూ ఉంటాయి. కానీ, వాటిలో చాలా తక్కువ షోలకు మాత్రమే ప్రజాధరణ దక్కుతుంది. అందులో ప్రేక్షకుల నుంచి ఎక్కువ మన్ననలు అందుకున్న ప్రోగ్రామ్‌లు మాత్రం చాలా తక్కువగానే ఉన్నాయి. అందులో బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఒకటి. గతంలో ఎన్నడూ చూడని కంటెంట్‌తో వస్తున్నప్పటికీ ఇది తెలుగు వారి మనసులు దోచుకుంది. అందుకే మన భాషలో ఏకంగా నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఐదో దానిని కూడా నిర్వహకులు నేటి నుంచే (సెప్టెంబర్ 5) మొదలు పెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నో అంచనాల నడుమ ప్రసారం కాబోతున్న ఐదో సీజన్‌కు సంబంధించిన ప్రీమియర్ ఎపిసోడ్ ప్రోమోను తాజాగా విడుదల చేశారు. దానిపై ఓ లుక్కేయండి!

  జాతీయ స్థాయిలో హాట్ టాపిక్‌గా బిగ్ బాస్

  జాతీయ స్థాయిలో హాట్ టాపిక్‌గా బిగ్ బాస్

  పదిహేనేళ్ల క్రితం బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ షో ఆధారంగా బిగ్ బాస్ హిందీలో ప్రారంభం అయింది. అక్కడ సూపర్ హిట్ అవడంతో ఆ తర్వాత దేశంలోని మరికొన్ని భాషల్లోకి పరిచయం అయింది. అలా కొన్నేళ్ల క్రితమే ఇది తెలుగులోకి వచ్చింది. చాలా అనుమానాల మధ్య వచ్చిన ఈ షోకు మన ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. దీంతో భారీ స్థాయిలో టీఆర్పీ రేటింగ్‌ను కూడా సంపాదించుకుంది. ఈ క్రమంలోనే ఈ క్రమంలోనే గత సీజన్‌లో ఏకంగా 18 పైచిలుకు రేటింగ్‌తో రికార్డు నమోదైంది. తద్వారా జాతీయ స్థాయిలో తెలుగు బిగ్ బాస్ హాట్ టాపిక్ అయిపోయింది.

  హాట్ షోతో షాకిచ్చిన అనన్య నాగళ్ల: అందాలన్నీ కనిపించేలా తెలుగమ్మాయి ఘాటు ఫోజులు

  ఐదో సీజన్‌కు అంతా రెడీ.. భారీ అంచనాలు

  ఐదో సీజన్‌కు అంతా రెడీ.. భారీ అంచనాలు

  మిగిలిన భాషలతో పోలిస్తే తెలుగులో ప్రసారం అయ్యే బిగ్ బాస్ షోకు కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారు. దీంతో ప్రతి సంవత్సరం ఈ షో కోసం వాళ్లంతా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కోవిడ్ సెకెండ్ వేవ్ కారణంగా ఐదో సీజన్‌ మొదలయ్యే అవకాశాలు లేవని ఆ మధ్య చాలా వార్తలు వైరల్ అయ్యాయి. కానీ, ఈ సీజన్‌ సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ప్రసారం కాబోతుందని నిర్వహకులు వెల్లడించారు. అదే సమయంలో పలు రకాల ప్రోమోలు కూడా రిలీజ్ చేశారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అలాగే, ఈ సీజన్‌పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.

  ఎప్పుడో వెళ్లారు.. అన్నీ కంప్లీట్ అయ్యాయి

  ఎప్పుడో వెళ్లారు.. అన్నీ కంప్లీట్ అయ్యాయి

  ఈ సారి కోవిడ్ సెకెండ్ వేవ్ ప్రభావం కారణంగా అసలు బిగ్ బాస్ సీజన్‌ను ప్రారంభించాలా? వద్దా? అన్న సంశయంలో ఉండిపోయారు నిర్వహకులు. అందుకే దీనికి సంబంధించిన పనులను ఈ మధ్యనే మొదలు పెట్టారు. ఇందులో భాగంగానే ముందుగా కంటెస్టెంట్ల ఎంపికపై దృష్టి సారించిన బిగ్ బాస్ టీమ్.. ఆన్‌లైన్ ద్వారా ఇంటర్వ్యూలు జరిపారు. అలాగే, సెట్‌ను మరింత సుందరంగా తీర్చి దిద్దారు. గతంలో కంటే ఇప్పుడు ఎన్నో హంగులు జత చేశారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితమే కంటెస్టెంట్లను క్వారంటైన్‌కు కూడా తరలించారు. ఇప్పుడు అన్నీ సిద్ధంగా ఉంచేశారు.

  నిక్ జోనస్‌తో ప్రియాంక చోప్రా రచ్చ: డార్క్ రూమ్‌లో ఒకరిపై ఒకరు.. పర్సనల్ ఫొటో వైరల్!

  అన్నీ సీక్రెట్‌గానే... కానీ ముందే బయటకు

  అన్నీ సీక్రెట్‌గానే... కానీ ముందే బయటకు

  బిగ్గెస్ట్ రియాలిటీ షో అయిన బిగ్ బాస్‌కు సంబంధించిన అన్ని విషయాలను రహస్యంగా ఉంచుతారు నిర్వహకులు. మరీ ముఖ్యంగా కంటెస్టెంట్ల ఎంపిక గురించి పకడ్బందీ చర్యలు తీసుకుంటారు. ఈ షోకు ఎంపికైన వాళ్లు కూడా ఎలాంటి వివరాలను తెలపకూడదని ఒప్పందం చేసుకుంటున్నారు. కానీ, మొదటి సీజన్ నుంచే అన్నీ ముందే లీక్ అవుతున్నాయి. దీనితో పాటు షో రన్ అవుతోన్న సమయంలో నామినేషన్స్, ఎలిమినేషన్స్ సహా ఎన్నో వివరాలు బయటకు వస్తున్నాయి. అయినప్పటికీ షోపై అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదనే చెప్పాలి.

  ఈ సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్లు వీళ్లేనంట

  ఈ సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్లు వీళ్లేనంట

  ఐదో సీజన్‌కు సంబంధించినంత వరకూ ఇందులో పాల్గొనే వాళ్లు వీళ్లనంటూ ఎంతో మంది నటీనటుల పేర్లు బయటకు వచ్చాయి. కానీ, దీనిపై ఎటువంటి సమాచారం రావడం లేదు. కానీ, తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం.. ఐదో సీజన్‌లో సిరి హన్మంత్, షణ్ముక్ జశ్వంత్, ప్రముఖ నటి ప్రియ, యాంకర్ రవి, నటరాజ్ మాస్టర్, యాంకర్ వర్షిణి సౌందరాజన్, జబర్ధస్త్ ప్రియాంక సింగ్, లహరి, సింగర్ శ్రీరామచంద్ర, సరయు, దీపక్ సరోజ్, శ్వేతా వర్మ, సన్నీ, మానస్ షా, ఉమాదేవి, జస్వంత్, ఆర్జే కాజల్, లోబో, ఇషా చావ్లా, ఆనీ మాస్టర్లు పాల్గొనబోతున్నట్లు తెలిసింది.

  షర్ట్ మొత్తం విప్పేసిన సీరియల్ నటి: లోదుస్తులు కూడా లేకుండా మరీ పచ్చిగా కనిపించడంతో!

  ఐదో సీజన్‌లో అవన్నీ స్పెషల్‌గా అంటూ

  ఐదో సీజన్‌లో అవన్నీ స్పెషల్‌గా అంటూ

  బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఐదో సీజన్‌ ప్రీమియర్ ఎపిసోడ్ ఈరోజు (సెప్టెంబర్ 5) సాయంత్రం ఆరు గంటల నుంచి ప్రారంభం కాబోతుంది. దీని కోసం ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తైంది. ఎంతో అంగరంగ వైభవంగా జరిగే ప్రారంభం ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను నిర్వహకులు తాజాగా విడుదల చేశారు. ఇందులో కంటెస్టెంట్లు ఆటపాటలతో అలరిస్తూ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు చూపించారు. అలాగే, హౌస్‌ను కూడా ఎంతో సుందరంగా తీర్చిదిద్దినట్లు ప్రోమోలో కనిపించింది.

  అంచనాలు పెంచేసిన నాగార్జున అండ్ టీమ్

  బిగ్ బాస్ ఐదో సీజన్‌ ప్రీమియర్ ఎపిసోడ్ ప్రోమోలో ఈ సారి ఐదింతల ఎంటర్‌టైన్‌మెంట్, ఐదింతల డ్రామా, ఐదింతల ఎనర్జీ ఉండబోతుందని నిర్వహకులు వెల్లడించారు. అలాగే, చివర్లో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హోస్ట్ అక్కినేని నాగార్జున ‘ఇక్కడ కిక్కు టన్నుల కొద్దీ వస్తుంది' అనే డైలాగ్ చెప్పాడు. తద్వారా ఈ సీజన్ ఎంతో మజాను ఇస్తుందోనని ముందే వెల్లడించాడు. దీంతో బిగ్ బాస్ ఐదో సీజన్‌పై ఉన్న అంచనాలన్నింటినీ రెట్టింపు చేసేశారు. ఫలితంగా అభిమానులంతా ప్రీమియర్ ఎపిసోడ్‌ కోసం మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

  English summary
  Bigg Boss is the Telugu Top Rreality TV Series. This Show Makers Planing for 5th One. Now This Season Premiere Episode Promo Released.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X