For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss: మరో యాంగిల్ చూపించిన సన్నీ.. శ్రీరామ్ తలపై సుత్తి దెబ్బలు.. ఆనందంలో గెంతులేసిన షణ్ముఖ్

  |

  తెలుగులో భారీ స్థాయిలో రెస్పాన్స్‌ను అందుకుంటూ నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. అసలు అంచనాలు లేకుండానే వచ్చినా.. సరికొత్త కాన్సెప్టే అయినా మన ప్రేక్షకులు దీనికి బ్రహ్మరథం పట్టారు. ఫలితంగా ఇది సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఇక, ప్రస్తుతం నడుస్తోన్న ఐదో సీజన్ సైతం అదే రీతిలో స్పందనను అందుకుంటోంది. ఫలితంగా మంచి టీఆర్పీని కూడా రాబడుతోంది. ఈ ఉత్సాహంతోనే దీన్ని మరింత కొత్తగా తీర్చిదిద్దుతున్నారు. ఇక, ఈ ఆదివారం జరగనున్న ఎపిసోడ్‌లో ఊహించని సంఘటలు జరిగాయని తాజాగా వచ్చిన ప్రోమోలో చూపించారు. ఆ సంగతులు మీకోసం!

  Photos Courtesy: Star MAA and Disney+Hotstar, ఫొటోస్ కర్టసీ : స్టార్ మా అండ్ డిస్నీ హాట్ స్టార్

   మరింత మజాను పంచేందుకు

  మరింత మజాను పంచేందుకు

  గతంలో వచ్చిన సీజన్లు సూపర్ హిట్ అవడంతో ఐదో దానిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఆరంభం నుంచే ఆసక్తికరంగా నడుపుతున్నారు. మరీ ముఖ్యంగా ఇందులో సరికొత్త టాస్కులు, రొమాన్స్, ప్రేమ కహానీలు సహా ఎన్నో ఆసక్తికరమైన అంశాలను హైలైట్ చేస్తున్నారు. దీంతో ఈ సీజన్‌ కూడా భారీ స్థాయిలో రేటింగ్‌ను సాధిస్తూ దూసుకుపోతోంది.

  అరాచకమైన హాట్ ఫొటోను వదిలిన దిశా పటానీ: అబ్బో బికినీలో శృతి మించి.. ఇలా చూస్తే తట్టుకోగలరా!

   శనివారం ఎపిసోడ్‌లో గెస్టులతో

  శనివారం ఎపిసోడ్‌లో గెస్టులతో

  బిగ్ బాస్ షో వారం మొత్తం జరిగే తీరు ఒకటి.. శని, ఆదివారాల్లో జరిగేది ఒకటి అన్నట్లుగా సాగుతుంది. దీనికి కారణం ఆ రెండు రోజులు హోస్ట్ అక్కినేని నాగార్జున వస్తుండడమే. ఇక, గత వారంలో హౌస్‌లోకి కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ ఎంట్రీ ఇవ్వగా.. శనివారం జరిగిన ఎపిసోడ్‌లో సైతం మరికొందరు గెస్టులుగా వచ్చారు. వీళ్లు టాప్ 5 కంటెస్టెంట్ల బోర్డులు పెట్టారు.

  ఆ రోజు టెన్షన్ లేకుండా చేస్తూ

  ఆ రోజు టెన్షన్ లేకుండా చేస్తూ

  ఈ రియాలిటీ షోలో ప్రతి ఆదివారం ప్రసారం అయ్యే ఎపిసోడ్స్ ఆటపాటలతో ఫన్నీగా సాగుతుంటాయి. ఆరోజు చివర్లో ఎలిమినేషన్ ఉన్నప్పటికీ.. దానికి ముందు కంటెస్టెంట్లలో టెన్షన్ పోగొట్టేందుకు నిర్వహకులు అదిరిపోయే ఆటపాటలను ప్లాన్ చేస్తారు. దాన్ని అక్కినేని నాగార్జున.. హౌస్‌లో ఉన్న వాళ్లతో ఆడిస్తుంటాడు. ఇలా సండే ఎపిసోడ్‌ మొత్తాన్ని ఫన్‌తో సాగిస్తుంటారు.

  రష్మీ, సుధీర్ బండారం బయటపెట్టిన గెటప్ శ్రీను: పెళ్లి ఎప్పుడని అడిగితే.. సీక్రెట్ లీక్ చేసి మరీ!

  ఫన్‌డేగా మార్చేందుకు ఆటలు

  ఈ ఆదివారం అంటే నేడు ప్రసారం కాబోతున్న బిగ్ బాస్ ఎపిసోడ్ కూడా ఎంతో ఫన్నీగా సాగుతుందని తాజాగా విడుదలైన ప్రోమోలో చూపించారు. ఇందులో హౌస్‌మేట్స్ అందరితో హోస్ట్ నాగార్జున పలు రకాలగేమ్స్ ఆడించినట్లు చూపించారు. కొన్ని బొమ్మల ఆధారంగా సినిమా పేర్లు చెప్పాలని ఒక గేమ్ ఆడించాడు. అలాగే కళ్లకు గంతలు కట్టి మరో ఆటను కూడా ఆడించాడు.

  సన్నీ ఫన్నీ కామెంట్లు.. డ్యాన్స్

  సన్నీ ఫన్నీ కామెంట్లు.. డ్యాన్స్

  బొమ్మల పేర్లు చెప్పి సినిమా పేర్లను అడిగే గేమ్‌లో అడవి.. బాణం బొమ్మలు చూపించగా.. దీనికి సన్నీ 'అడవి రాముడు' అని ఆన్సర్ చెప్పేశాడు. దీనికి నాగార్జున కరెక్ట్ ఆన్సర్ అని చెప్పాడు. దీంతో సన్నీ ఆనందంతో తెగ డ్యాన్సులు చేసేశాడు. అంతేకాదు, 'ఈరోజు నాలో టాలెంట్ చూసి నాకే పిచ్చేక్కిపోతుంది' అంటూ కామెంట్ చేసి అందరినీ తెగ నవ్వించేశాడతను.

  Dhee 13 Winner: ముందే లీకైన ఢీ షో విజేత పేరు.. ఊహించని కంటెస్టెంట్‌కు టైటిల్.. ఆ వీడియో రావడంతో!

  Actor Kamal Haasan Tests Covid Positive || Filmibeat Telugu
   శ్రీరామ్ తలపై సుత్తి.. షన్నూపై

  శ్రీరామ్ తలపై సుత్తి.. షన్నూపై

  ఆదివారం ఎపిసోడ్‌లో భాగంగా ఆడించిన ఆటలో శ్రీరామ్ పలుమార్లు బెల్ కొట్టడానికి ప్రయత్నించి విఫలం అయ్యాడు. అంతేకాదు, అవతలి టీమ్ చెప్పిన ఆన్సర్లకు అతడి దిమ్మతిరిగిపోయింది. ఆ సమయంలో సుత్తితో తన తలపై కొట్టుకున్నాడు. ఇక, ఇందులో కరెక్ట్ ఆన్సర్ చెప్పిన షన్నూ డ్యాన్స్ చేసేశాడు. దీంతో నాగ్ 'షన్నూ చాలా ఫ్రీగా కనిపిస్తున్నాడు' అని పంచ్ పేల్చాడు.

  English summary
  Bigg Boss 5th Season Running Successfully. In Upcoming Episode.. Akkineni Nagarjuna Funny Game with Contestants
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X