For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss: షోలో వాళ్ల పర్సనల్ సీక్రెట్స్ బయటపెట్టిన నాగ్.. అందరి ముందే అలాంటి ప్రశ్నలతో!

  |

  గతంలో పోలిస్తే ఈ మధ్య కాలంలో బుల్లితెర ప్రేక్షకుల అభిరుచిలో మార్పులు వచ్చాయి. అందుకే ఎలాంటి కాన్సెప్టుతో వచ్చిన షోలనైనా వాళ్లు బాగానే ఆదరిస్తున్నారు. ఫలితంగా ఎన్నో వినూత్న కార్యక్రమాలు పుట్టుకొస్తున్నాయి. అలా ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్ అయిన షోలలో బిగ్ బాస్ ఒకటి. ఇప్పటి వరకూ వచ్చిన నాలుగు సీజన్లు సూపర్ సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు ఐదో సీజన్ కూడా అదే రీతిలో నడుస్తోంది. మరీ ముఖ్యంగా వీకెండ్ ఎపిసోడ్స్ ఫన్నీగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి జరగనున్న ఎపిసోడ్‌లో కంటెస్టెంట్లు అందరి పర్సనల్ సీక్రెట్లు రాబట్టేందుకు నాగార్జున ప్రశ్నలు అడిగాడు. ఆ వివరాలు మీకోసం!

  ఐదోది కూడా అదే రీతిలో సాగేలా

  ఐదోది కూడా అదే రీతిలో సాగేలా


  నాలుగు సీజన్లు సూపర్ హిట్ అవడంతో ఐదో దానిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఆరంభం నుంచే ఆసక్తికరంగా నడుపుతున్నారు. మరీ ముఖ్యంగా ఇందులో సరికొత్త టాస్కులు, రొమాన్స్, ప్రేమ కహానీలు సహా ఎన్నో ఆసక్తికరమైన అంశాలను హైలైట్ చేస్తున్నారు. దీంతో ఈ సీజన్‌ కూడా భారీ స్థాయిలో రేటింగ్‌ను అందుకుంటోంది.

  'అఖండ' ఈవెంట్‌కు ఇద్దరు హీరోలు: ఎన్టీఆర్‌తో పాటు బాలయ్య అభిమాని కూడా.. ఇక రచ్చ రచ్చే

  శనివారం ఎపిసోడ్‌లో అలా చేసి

  శనివారం ఎపిసోడ్‌లో అలా చేసి

  ఈ రియాలిటీ షో వారం మొత్తం జరిగే తీరు ఒకటి.. శని, ఆదివారాల్లో జరిగేది ఒకటి అన్నట్లుగా సాగుతుంది. దీనికి కారణం ఆ రెండు రోజులు హోస్ట్ అక్కినేని నాగార్జున వస్తుండడమే. ఇక, గత ఎపిసోడ్‌ అంతా ఎంతో సీరియస్‌గా సాగింది. పోయిన వారంలో కంటెస్టెంట్లలో కొందరు తప్పులు చేయడంతో నాగార్జున వాళ్లను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి మరీ జాగ్రత్తలు చెప్పాడు.

  ఆదివారం ఫన్నీగా సాగేలా ప్లాన్స్

  ఆదివారం ఫన్నీగా సాగేలా ప్లాన్స్

  బిగ్ బాస్‌ షోలో ప్రతి ఆదివారం ప్రసారం అయ్యే ఎపిసోడ్స్ ఆటపాటలతో ఫన్నీగా సాగుతుంటాయి. ఆరోజు చివర్లో ఎలిమినేషన్ ఉన్నప్పటికీ.. దానికి ముందు కంటెస్టెంట్లలో టెన్షన్ పోగొట్టేందుకు నిర్వహకులు అదిరిపోయే ఆటపాటలను ప్లాన్ చేస్తారు. దాన్ని అక్కినేని నాగార్జున.. హౌస్‌లో ఉన్న వాళ్లతో ఆడిస్తుంటాడు. ఇలా సండే ఎపిసోడ్‌ మొత్తాన్ని ఫన్‌డేగా మార్చేస్తుంటారు.

  హాట్ షోలో హద్దు దాటిన పూజా హెగ్డే: కేవలం అదొక్కటే ధరించి.. ఇలాంటి ఫొటోలు కూడా షేర్ చేస్తారా!

  అనుభవించు రాజా టీమ్ ఎంట్రీ

  అనుభవించు రాజా టీమ్ ఎంట్రీ

  యంగ్ హీరో రాజ్‌ తరుణ్ నటించిన తాజా చిత్రం 'అనుభవించు రాజా'. శ్రీను గవిరెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాలో కశీష్ ఖాన్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో హీరో, హీరోయిన్లు బిగ్ బాస్ షోలో సందడి చేశారు. ఇందులో భాగంగానే రాజ్‌ తరుణ్ కంటెస్టెంట్లను ఇరుకున పెట్టేలా పలు ప్రశ్నలు అడిగాడు.

  సరికొత్త ఆటలు ఆడించిన నాగ్

  ఈ ఆదివారం అంటే నేడు ప్రసారం కాబోతున్న బిగ్ బాస్ ఎపిసోడ్ కూడా ఎంతో ఫన్నీగా సాగుతుందని తాజాగా విడుదలైన ప్రోమోలో చూపించారు. ఇందులో హౌస్‌మేట్స్ అందరితో హోస్ట్ నాగార్జున పలు రకాలగేమ్స్ ఆడించినట్లు చూపించారు. ఇందులో ఇంటి సభ్యుల్లో ఒకరికి.. ఒక కంటెస్టెంట్ పేరు చూపించి.. మిగిలిన వాళ్లంతా గుర్తించేలా బోర్డుపై గీతలు గీయాల్సి ఉంటుంది.

  పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ప్రభాస్ హీరోయిన్: పెళ్లైన ఆరు నెలలకే తల్లిగా ప్రమోషన్

  అసెంబ్లీ ప్రజా సమస్యలను చర్చించడానికి అకారణంగా దూషించడానికి కాదు - Kalyan Ram || Filmibeat Telugu
  పర్సనల్ సీక్రెట్స్ బయటపెట్టేలా

  పర్సనల్ సీక్రెట్స్ బయటపెట్టేలా

  ఆదివారం జరిగే ఎపిసోడ్‌లో అక్కినేని నాగార్జున వినూత్నమైన గేమ్ ఆడించాడు. ఇందులో భాగంగా ఒక కంటెస్టెంట్‌ను పిలిచి ఎవరి గురించైనా తెలుసుకోవాలనుకుంటున్న ఒక ప్రశ్నను రాసివ్వమని అడిగాడు. ఆ తర్వాత ఆ ప్రశ్నలకు జవాబులు రాబట్టే ప్రయత్నాలు చేశాడు. దీంతో ఎంతో మంది సీక్రెట్లు బయటపెట్టేశాడు. దీన్ని తాజాగా వచ్చిన ప్రోమోలో చూపించారు.

  English summary
  Bigg Boss 5th Season Running Successfully. In Upcoming Episode.. Akkineni Nagarjuna Questions to All Contestants.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X