For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 5: ఆదిలోనే యాంకర్ రవికి షాక్.. అతడికే ఎక్కువ మద్దతు.. లేడీస్‌లో ఆమెకు!

  |

  తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే షోలలో అన్నింటికీ ప్రేక్షకుల మద్దతు లభిస్తుందన్న గ్యారెంటీ లేదు. అలాంటిది గతంలో ఎన్నడూ చూడని సరికొత్త కాన్సెప్టుతో ప్రసారం అయ్యే షోను అసలు మన వాళ్లు ఆదరిస్తారా అంటే.. అవును ఆదరిస్తారు. దీనికి బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ షోనే ప్రత్యేకమైన ఉదాహరణ. ఎన్నో అనుమానాల నడుమ తెలుగులోకి వచ్చిన ఈ షో సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో నాలుగు సీజన్లను విజయవంతగా పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఐదోది కూడా మొదలైంది. ఈ నేపథ్యంలో ఆరంభంలోనే కొన్ని లెక్కలు షాక్‌కు గురి చేస్తున్నాయి. అసలేం జరుగుతోంది? పూర్తి వివరాలు మీకోసం!

  Bigg Boss Telugu 5 : Anchor Ravi VS Shanmukh Jaswanth || Filmibeat Telugu
   దుమ్ము దులిపేసిన నాలుగు సీజన్లు

  దుమ్ము దులిపేసిన నాలుగు సీజన్లు

  తెలుగులో బిగ్ బాస్ షో నాలుగు సీజన్లను పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఇవన్నీ ఒకదాని కంటే మరొకటి ఎక్కువగా ఆదరణను అందుకుని సత్తా చాటాయి. అదే సమయంలో టెలివిజన్ హిస్టరీలోనే ఎక్కువ టీఆర్పీ రేటింగ్‌ను నమోదు చేశాయి. తద్వారా మన బిగ్ బాస్ షోకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. దీంతో ఈ షోకు మరింత ఎక్కువ ఆదరణ దక్కుతూ వస్తోంది.

  బ్రా ఒక్కటే ధరించి విష్ణుప్రియ రచ్చ: ఇంతకు ముందెన్నడూ చూడనంత ఘాటు ఫోజులతో!

  ఐదో దాన్ని కూడా మొదలు పెట్టారు

  ఐదో దాన్ని కూడా మొదలు పెట్టారు

  బిగ్ బాస్ ప్రియులంతా ఐదో సీజన్ గురించి చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నో అనుమానాలను పటాపంచలు చేస్తూ.. సెప్టెంబర్ 5 అంటే గత ఆదివారం సాయంత్రం బిగ్ బాస్ ఐదో సీజన్ ప్రారంభం అయింది. అక్కినేని నాగార్జునే దీన్ని కూడా హోస్ట్ చేస్తున్నారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ ఎపిసోడ్‌లో కంటెస్టెంట్లు ఆటపాటలతో అందరినీ అలరించారు.

  ఈ సారి రికార్డు స్థాయిలో వచ్చేశారు

  ఈ సారి రికార్డు స్థాయిలో వచ్చేశారు

  గతంలో ఎన్నడూ లేని విధంగా ఐదో సీజన్‌లో ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు నేరుగా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అందులో సిరి హన్మంత్, వీజే సన్నీ, షణ్ముక్ జశ్వంత్, ప్రముఖ నటి ప్రియ, యాంకర్ రవి, నటరాజ్ మాస్టర్, ప్రియాంక సింగ్, లహరి, సింగర్ శ్రీరామచంద్ర, సరయు, జస్వంత్, శ్వేతా వర్మ, మానస్ షా, ఉమాదేవి, ఆర్జే కాజల్, లోబో, హమీదా, ఆనీ మాస్టర్, విశ్వలు ఉన్నారు.

  అషు రెడ్డి ప్రైవేటు పార్ట్‌ను చూపించిన ఆర్జీవీ: పవన్ కల్యాణ్‌ కోసం ఆమెను బుక్ చేసేశాడుగా!

   టైటిల్ ఫేవరెట్లుగా ఆ ఇద్దరు అంటూ

  టైటిల్ ఫేవరెట్లుగా ఆ ఇద్దరు అంటూ

  ఈ సారి బిగ్ బాస్ కంటెస్టెంట్లుగా ఎంపికైన వారిలో ఎక్కువ మంది పాపులర్ అయిన వాళ్లే ఉన్నారు. సోషల్ మీడియా ద్వారానో.. బుల్లితెర వెండితెరపై సందడి చేసే వాళ్లుగానో పలువురు మంచి గుర్తింపును దక్కించుకున్న వాళ్లు వచ్చారు. ఇక, ఈ సీజన్‌లో 19 మంది కంటెస్టెంట్లుండగా.. షణ్ముఖ్ జస్వంత్, యాంకర్ రవి మధ్య టైటిల్ పోరు జరిగే అవకాశాలు ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది.

  ఆ కంటెస్టెంట్‌కే ఎక్కువ మద్దతుతో

  ఆ కంటెస్టెంట్‌కే ఎక్కువ మద్దతుతో

  బిగ్ బాస్ షోలోకి కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చిన వాళ్లందరికీ స్వాగతం పలుకుతూ స్టార్ మా ట్విట్టర్ పేజ్‌లో అందరి ఫొటోలను షేర్ చేసింది. ఇందులో నెటిజన్ల నుంచి ఎక్కువ రియాక్షన్లు (లైకులు, కామెంట్లు, రీట్వీట్లు) అందుకున్నది మాత్రం షణ్ముక్ జస్వంతే. మిగిలిన కంటెస్టెంట్లకు ఏమాత్రం దగ్గరగా లేనంత మంది అతడికి సపోర్ట్ చేస్తున్నారు. దీంతో అతడి రేంజ్ మొదటిరోజే తెలిసింది.

  నిక్ జోనస్‌తో ప్రియాంక చోప్రా రచ్చ: డార్క్ రూమ్‌లో ఒకరిపై ఒకరు.. పర్సనల్ ఫొటో వైరల్!

  ఆదిలోనే యాంకర్ రవికి భారీ షాక్

  ఆదిలోనే యాంకర్ రవికి భారీ షాక్

  సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై యాంకర్‌గా సందడి చేస్తూ కొన్ని లక్షల మంది అభిమానాన్ని కూడా సంపాదించుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతడు బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇవ్వడంతో టైటిల్ ఫేవరెట్ అని అంతా అంటున్నారు. అయితే, అతడికి స్టార్ మా ట్విట్టర్ పేజీలో షణ్ముఖ్ కంటే తక్కువ మద్దతు లభించింది. దీంతో ఆదిలోనే రవికి బిగ్ షాక్ తగిలినట్లైంది.

  లేడీస్‌లో ఆమెకు ఎక్కువగా సపోర్టు

  లేడీస్‌లో ఆమెకు ఎక్కువగా సపోర్టు

  బిగ్ బాస్ ఐదో సీజన్‌లోకి తొమ్మిది మంది ఆడవాళ్లు కూడా కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. వారిలో స్టార్ మా ట్విట్టర్ పేజ్‌లో ఎక్కువ రియాక్షన్లు అందుకున్న కంటెస్టెంట్ సిరి హన్మంతే. ఆమె తర్వాత 7 ఆర్ట్స్ సరయు, ప్రముఖ నటి ప్రియలకు ఎక్కువ రెస్పాన్స్ దక్కింది. అంటే ఆడవాళ్ల నుంచి సిరిని టైటిల్ ఫేవరెట్‌గా భావిస్తున్నారు. మరి ముందు ముందు ఈ లెక్కలు ఎలా మారతాయో చూడాలి.

  English summary
  Bigg Boss is the Telugu Top Rreality TV Series Recently Started 5th Season. In 19 Contestants.. Shanmukh Jaswanth, Anchor Ravi and Siri Hanmanth Got Huge Likes in Social Media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X