Don't Miss!
- Lifestyle
వయాగ్రా ఆడవాళ్లు వాడొచ్చా? వేసుకుంటే లాభాలేంటి, నష్టాలేంటి?
- News
నిర్మల పద్దు బీజేపీ పరీక్ష పాసైనట్లేనా ? మధ్యతరగతి టార్గెట్ వెనుక ! 2014, 2019 సక్సెస్ మంత్ర !
- Sports
రేటింగ్ పాయింట్లు కోల్పోయిన సూర్యకుమార్.. ఆల్‌టైం రికార్డు బద్దలు కొట్టేనా?
- Technology
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- Finance
Mukesh Ambani: అదానీని వెనక్కి నెట్టిన అంబానీ.. ఓడలు బండ్లవ్వటమంటే ఇదే..
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Bigg Boss: రవి నిజస్వరూపం బయటపెట్టిన షణ్ముఖ్.. ఆ అబ్బాయితో అసభ్యంగా ప్రవర్తించాడంటూ షాకింగ్‌గా!
సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల కార్యక్రమాలు వస్తున్నాయి.. పోతున్నాయి. అయితే, వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకుల అభిమానాని చూరగొంటూ సత్తా చాటుతున్నాయి. అలాంటి షోలలో బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పరిచయం అయిన బిగ్ బాస్ ఒకటి. అంతకు ముందు ఎన్నడూ చూడని కాన్సెప్టుతో వచ్చిన ఈ కార్యక్రమానికి తెలుగు ప్రేక్షకులు విశేషమైన ఆదరణను అందించారు. ఫలితంగా ఇది సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు ఏకంగా నాలుగు సీజన్లను ఒకదానికి మించి ఒకటి సక్సెస్‌ఫుల్‌గా రన్ అయ్యాయి.
ఈ క్రమంలోనే ఇప్పుడు ఐదో సీజన్ కూడా ప్రారంభం అయింది. ఆరంభం నుంచే ఇది ప్రేక్షకులకు మజాను పంచుతూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో యాంకర్ రవి నిజస్వరూపం బయట పెట్టాడు షణ్ముఖ్ జస్వంత్. అసలు వీళ్లిద్దరి మధ్య ఏం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

ఆరంభంలోనే మెప్పించి.. రికార్డు కొట్టింది
మిగిలిన భాషలతో పోలిస్తే తెలుగులో ప్రసారం అయ్యే బిగ్ బాస్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. సామాన్యులే కాదు.. దీనికి సెలెబ్రిటీలు కూడా ఫిదా అయ్యారు. ఫలితంగా ఈ షోపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవలే ఐదో సీజన్ అంగరంగ వైభవంగా ప్రారంభం అయింది. దీన్ని కూడా కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక, ఈ సీజన్ అంచనాలకు తగ్గట్లుగానే ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. అందుకే ఐదో సీజన్ ప్రీమియర్ ఎపిసోడ్‌కు 18 రేటింగ్ కూడా అందుకుంది. దీంతో ఆరంభంలోనే అరుదైన రికార్డును కొట్టింది.
టాలీవుడ్లో చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్: ఈ ఘనతను అందుకున్న ఏకైక హీరోగా సాలిడ్ రికార్డు

టైటిల్ ఫేవరెట్లలో వాళ్లిద్దరూ ఉన్నారుగా
బిగ్ బాస్ ఐదో సీజన్‌కు కంటెస్టెంట్లుగా ఎంపికైన వారిలో ఎక్కువ మంది పాపులర్ అయిన వాళ్లే ఉన్నారు. సోషల్ మీడియా వల్లో.. బుల్లితెర వెండితెరపై సందడి చేసే వాళ్లుగానో పలువురు మంచి గుర్తింపును దక్కించుకున్న వాళ్లు వచ్చారు. ఇక, ఈ సీజన్‌లో 19 మంది కంటెస్టెంట్లుండగా.. అందులో పలువురు మాత్రమే టైటిల్ ఫేవరెట్లు అనిపించుకుంటున్నారు. అలాంటి వారిలో యాంకర్ రవి, షణ్ముఖ్ జస్వంత్ పేర్లను ప్రముఖంగా చెప్పుకోవాలి. తమ తమ రంగాల్లో చాలా కాలంగా సందడి చేస్తోన్న వీళ్లిద్దరూ ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకుని సత్తా చాటుతున్నారు.

షణ్ముఖ్ క్రమంగా.. రవి మాత్రం గొడవలు
బిగ్ బాస్ ఐదో సీజన్‌లోని టైటిల్ ఫేవరెట్ అయిన షణ్ముఖ్ జస్వంత్ ఆరంభంలో నిరాశ పరిచాడనే చెప్పాలి. ఫస్ట్ వీక్ నామినేషన్స్ టాస్కు నుంచి ఇంట్లో పలు సంఘటనలు హైలైట్ అయ్యాయి. అయినప్పటికీ అతడికి మాత్రం పెద్దగా స్క్రీన్ స్పెస్ దక్కలేదు. అయితే, ఈ మధ్య మాత్రం షణ్ముఖ్ తన ఆటను మొదలెట్టి హైలైట్ అవుతున్నాడు. మరోవైపు, యాంకర్ రవి మాత్రం తరచూ ఏదో ఒక గొడవలతో హాట్ టాపిక్ అవుతున్నాడు. అతడి ప్రమేయం లేకుండానే కొన్నింటిలో చిక్కుకున్నా.. మరికొన్ని సందర్భాల్లో మాత్రం నేరుగా వివాదాల్లో చిక్కుకుంటున్నాడు.
తన ఆల్‌టైం ఫేవరెట్ మూవీ ఏంటో చెప్పిన మహేశ్ బాబు: 'సర్కారు వారి పాట' గురించి షాకింగ్‌గా!

ప్రియ కామెంట్.. లహరి.. రవి పేర్లు కూడా
మూడో వారం నామినేషన్స్ టాస్కులో ప్రియ వంతు వచ్చిన సమయంలో లహరిని నామినేట్ చేసింది. అప్పుడామె'నువ్వు నాతో టైమ్ స్పెండ్ చేయట్లేదు. ఎప్పుడూ అబ్బాయిలతో ఉంటున్నావు. మరీ ముఖ్యంగా వాష్‌రూంలో అర్ధారాత్రి రవిని హగ్ చేసుకున్నావు కదా' అని అనడంతో అది పెద్ద ఇష్యూ అయిపోయింది. ఆ తర్వాత రవి కూడా ఆమెపై ఫైర్ అయ్యాడు. అప్పుడు 'సింగిల్ మెన్‌లు ఉండగా నాతోనే ఎక్కువ ఉంటుంది. యాంకరింగ్ ఛాన్స్‌ల కోసం ట్రై చేస్తుంది' అని రవి అన్నాడని కూడా ప్రియ చెప్పింది. అయితే, తాను అలా అనలేదని రవి బుకాయించేశాడు.

వీడియో చూపించి... మందలించిన నాగ్
గత వారంలో ప్రియ.. లహరి.. రవి మధ్య జరిగిన గొడవ పెద్ద వివాదంగా మారింది. ఒక అమ్మాయిని నేషనల్ టెలివిజన్‌లో వ్యక్తిగతంగా దూషించడంతో ఇది విమర్శలకు తావిచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఏం జరిగింది అనే దానిపై చాలా మందికి క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో లహరిని ఉద్దేశించి రవి చేసిన వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున శనివారం ఎపిసోడ్‌లో స్పందించాడు. ఈ క్రమంలోనే లహరిని పిలిచి వీడియోను చూపించారు. దీంతో రవి తప్పు చేశాడని అర్థమవడంతో ఆమె అతడిని తిట్టేసింది. అదే సమయంలో నాగ్ కూడా యాంకర్ రవిని మందలించాడు.
Love Story Day 1 Collections: చరిత్ర సృష్టించిన నాగ చైతన్య.. ఇండియాలోనే ఫస్ట్ మూవీగా సంచలన రికార్డు

రవి నిజస్వరూపం బయటపెట్టిన షణ్ముఖ్
గత వారం లహరి విషయంలో యాంకర్ రవి వ్యవహరించిన తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో అతడిపై మరో సంచలన ఆరోపణ చేశాడు టైటిల్ ఫేవరెట్ షణ్ముఖ్ జస్వంత్. శుక్రవారం జరిగిన దానిని చూపించిన సమయంలో కాజల్‌తో మాట్లాడుతూ 'రవి.. జెస్సీని లవ్ చేసి ప్రపోజ్ చేయమని లోబోతో చెప్పాడు. అంటే హౌస్‌లో ఉన్నవాళ్లు జోకర్లులాగ కనిపిస్తున్నారా? అతనెవరు ఏ కంటెంట్ చేయాలో డిసైడ్ చేయడానికి? అతను చేసేది రాంగ్. నీ స్కిట్లు నువ్వు బయట చేసుకో' అంటూ నిజస్వరూపం బయటపెట్టాడు.
Recommended Video

జనాలను నమ్మించడానికే అలా చేశాడు
ఇక, బిగ్ బాస్ హౌస్‌లో యాంకర్ రవి.. లోబో జంటగా ఆడుతున్నారని కూడా కాజల్ ఆరోపణలు చేసింది. 'రవి, లోబోలు కలిసి ఆడుతున్నారో.. వేరు వేరుగా ఆడుతున్నారో.. వాళ్ల గేమ్ ప్లాన్ ఏంటో అర్థం కావడం లేదు. ప్రతివారం రవిని లోబో ఎందుకు నామినేట్ చేస్తున్నాడో అర్థం కావట్లేదు. లోబో నేను వెళిపోతా వెళిపోతా అంటాడు. అది రవిని ఉద్దేశించి అంటున్నాడేమో అనిపించింది' అని చెప్పుకొచ్చింది. దీనికి షణ్ముఖ్ 'జనాలను నమ్మించడానికే నామినేట్ చేస్తాడు. కానీ రవిని ఎవరైనా ఏమైనా అంటే లోబో ఊరుకోడు' అంటూ మరో విషయం బయట పెట్టేశాడతను.