Don't Miss!
- Finance
Infosys: ఫ్రెషర్లకు ఇన్ఫోసిస్ ఝలక్..! ఉద్యోగాల తొలగింపు.. ఆ టెక్నిక్ వాడుతూ..
- News
'దుప్పటి మడతపెట్టి' వచ్చిన టీడీపీ సీనియర్లు!
- Travel
వైజాగ్ సమీపంలోని సందర్శనీయ పర్యాటక ప్రదేశాలు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Sports
INDvsAUS : స్పిన్నర్ల ఎంపికపై ఆసీస్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Bigg Boss: షణ్ముఖ్ జస్వంత్‌కు పొంచి ఉన్న ప్రమాదం.. అదే జరిగితే ఎలిమినేట్ అయినా అవ్వొచ్చు!
తెలుగులో సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తూ.. కనీవినీ ఎరుగని స్పందనను అందుకుంటూ బిగ్గెస్ట్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఇండియాలో పలు భాషల్లో ఎప్పుడో మొదలైన ఈ కార్యక్రమం.. ఐదేళ్ల క్రితమే తెలుగులోకి ప్రవేశించింది. ఏమాత్రం అంచనాలు లేకుండానే పరిచయమైన దీనికి తెలుగు ప్రేక్షకులు భారీ స్థాయిలో స్పందనను అందించారు. ఫలితంగా ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఐదో సీజన్‌ను మొదలు పెట్టారు నిర్వహకులు. ఇది కూడా అదే రీతిలో రెస్పాన్స్‌ను అందుకుంటూ దూసుకుపోతోంది. ఇక, ఈ సీజన్‌లో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన వారిలో షణ్ముఖ్ జస్వంత్ ఒకడు. అయితే, అతడికి మాత్రం ఓ ప్రమాదం పొంచి ఉన్నట్లు కనిపిస్తోంది. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!
Recommended Video

అంచనాలకు తగ్గట్లే భారీ స్పందనతో స్టార్ట్
తెలుగులో ప్రసారం అయ్యే బిగ్ బాస్‌కు సామాన్యులే కాదు.. దీనికి సెలెబ్రిటీలు ఫిదా అయ్యారు. ఫలితంగా ఈ షోపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవలే ఐదో సీజన్ అంగరంగ వైభవంగా ప్రారంభం అయింది. ఇక, ఈ సీజన్ అంచనాలకు తగ్గట్లుగానే ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. నిర్వహకులు ముందుగా చెప్పినట్లుగానే సరికొత్త టాస్కులు, గొడవలు, కొట్లాటలు, ప్రేమ కహానీలు, రొమాన్స్ తదితర అంశాలను చూపిస్తూ మజాను పంచుతున్నారు. అందుకే ఐదో సీజన్ ప్రీమియర్ ఎపిసోడ్‌కు 18 రేటింగ్ కూడా అందుకుని రికార్డు క్రియేట్ చేసింది.
ChaySam Divorce: పెళ్లికి ముందే సమంత చైతూ మధ్య ఒప్పందం.. విడిపోయిన తర్వాత అలా చేయకూడదంటూ!

19 మంది వచ్చారు.. వాళ్లిద్దరూ టైటిల్ బరి
తాజా సీజన్‌లో 19 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. అందులో సోషల్ మీడియా ద్వారానో.. బుల్లితెర లేదా వెండితెరపై సందడి చేసే వాళ్లుగానో పలువురు మంచి గుర్తింపును దక్కించుకున్నారు. ఇక, ఈ సీజన్‌లో 19 మంది కంటెస్టెంట్లుండగా.. అందులో షణ్ముఖ్ జస్వంత్ మేల్ కంటెస్టెంట్లలో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగాడు. సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉండడమే దీనికి కారణం. అలాగే, ఆడవాళ్ల నుంచి సిరి హన్మంత్ కూడా టైటిల్ కోసం పోటీ పడే కంటెస్టెంట్‌గానే షోలోకి ఎంటర్ అయింది. దీంతో వీళ్లు ఫినాలేలో ఉంటారని అంటున్నారు.

ఆరంభంలోనే ఆమె సత్తా.. అతడు మాత్రం
సీజన్
ఆరంభం
నుంచే
సిరి
హన్మంత్
ఎంతో
యాక్టివ్‌గా
ఉంటోంది.
ఇప్పటికే
ఆమె
బిగ్
బాస్
ఐదో
సీజన్‌కు
మొదటి
కెప్టెన్‌గా
కూడా
ఎంపికైంది.
దీంతో
టైటిల్
వేటలో
తాను
ఉన్నానని
చాటుకుంటూ
మిగిలిన
వాళ్లకు
హెచ్చరికలు
పంపింది.
టాస్కులు
కూడా
బాగా
ఆడుతూ
వస్తోంది.
ఇక,
షణ్ముఖ్
జస్వంత్
ఆరంభంలోనే
నిరాశ
పరిచాడనే
చెప్పాలి.
ఫస్ట్
వీక్
నామినేషన్స్
టాస్కు
నుంచి
ఇంట్లో
పలు
సంఘటనలు
హైలైట్
అయ్యాయి.
అయినప్పటికీ
అతడికి
మాత్రం
పెద్దగా
స్క్రీన్
స్పెస్
దక్కలేదు.
అయితే,
ఈ
మధ్య
మాత్రం
షణ్ముఖ్
తన
ఆటను
మొదలెట్టాడు.
షర్ట్ విప్పేసి షాకిచ్చిన బిగ్ బాస్ సరయు: బ్రాతో ఘాటు ఫోజులిస్తూ.. వామ్మో చూస్తే తట్టుకోలేరు

ఎలిమినేట్ అయిన వాళ్లంతా టార్గెట్ చేస్తూ
హౌస్‌లో షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంత్ వ్యవహరిస్తున్న తీరుపై ఆరంభం నుంచీ విమర్శలు వస్తూనే ఉన్నాయి. మొదటి వారం వెళ్లిపోయిన సరయు వీళ్లిద్దరూ ఒకరి కోసం ఒకరు ఆడుతున్నారంటూ నిందించింది. ఇక, బయటకు వచ్చిన తర్వాత కొన్ని వీడియోలను సైతం షేర్ చేసింది. ఆ తర్వాత ఉమాదేవి అయితే వీళ్లిద్దరూ పక్కపక్కనే పడుకుంటారని, అలాంటప్పుడు రావడం ఎందుకని విమర్శించింది. ఇక, లహరి కూడా వీళ్లు జంటగానే ఆడుతుంటారని ఆరోపించింది. దీంతో ఆమెను దూరం పెట్టి.. మళ్లీ దగ్గరయ్యాడు షణ్ముఖ్ జస్వంత్.

శ్రీరామ చంద్రతో షణ్ముఖ్ బ్యాచ్ వాగ్వాదం
బిగ్ బాస్ హౌస్‌లో చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు జరుగుతూ ఉంటాయన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే రెండు రోజుల క్రితం జరిగిన ఎపిసోడ్‌లో కెప్టెన్ శ్రీరామ్.. జెస్సీని కిచెన్‌లో పని చేయమని అనడం.. ఆ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడం కనిపించాయి. ఆ సమయంలోనే శ్రీరామ్ నోరు జారి ఓ మాట అన్నాడు. దీంతో పెద్ద రచ్చ జరిగింది. వెంటనే జెస్సీ స్నేహితులు షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంత్ అతడిపై ఫైర్ అయ్యారు. అంతేకాదు, ఇకపై అన్నం కూడా తినమని చెప్పారు. దీంతో ఇది పెద్ద వివాదంగా మారిపోయింది.
అరాచకమైన ఫొటోలతో షాకిచ్చిన అమలా పాల్: బీచ్‌లో బికినీతో అందాలు మొత్తం కనిపించేంత ఘాటుగా!

హుందాగా ప్రవర్శించిన శ్రీరామ్... వాళ్లేమో
ఇంటి
కెప్టెన్
శ్రీరామ్..
అందరూ
తినే
వరకూ
తినకుండా
ఉంటున్నాడు.
ఈ
క్రమంలోనే
షణ్ముఖ్
బ్యాచ్
నిరాహార
దీక్ష
చేస్తుండడంతో
అతడు
కూడా
తినకుండానే
ఉన్నాడు.
అయితే,
ఉదయాన్నే
లేచి
వాళ్లు
ముగ్గరూ
కంచాలు
పట్టుకుని
కనిపించారు.
అంతకు
ముందు
శ్రీరామ్..
షణ్ముఖ్
దగ్గరకు
వచ్చి
పలుమార్లు
మాట్లాడడానికి
ప్రయత్నించాడు.
ఆ
సమయంలో
'నీకు
26
ఏళ్లు
మాత్రమే.
ఇదంతా
అవసరమా'
అంటూ
షణ్ముఖ్‌ను
ఉద్దేశించి
అన్నాడు
శ్రీరామ్.
ఆ
సమయంలో
సిరి
హన్మంత్
అతడిపై
గొడవకు
దిగి..
ఓ
రేంజ్‌లో
ఫైర్
అయింది.
దీంతో
అంతా
షాకయ్యారు.

షణ్ముఖ్ జస్వంత్‌కు పొంచి ఉన్న ప్రమాదం
వాస్తవానికి షణ్ముఖ్ జస్వంత్‌కు బయట మంచి ఫాలోయింగ్ ఉంది. దీనికి అనుగుణంగానే హౌస్‌లో టాస్కులు ఆడగల సామర్ధ్యం కూడా ఉంది. ఇవి సజావుగా జరిగితే అతడు టైటిల్ విన్నర్ అవుతాడు. ఈ తరుణంలో సిరి హన్మంత్ రూపంలో అతడికి ప్రమాదం పొంచి ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. చక్కగా ఆడేవాడిని తప్పుదోవ పట్టిస్తుందని.. అతడు కూడా ఆమెను గుడ్డిగా ఫాలో అవుతున్నాడని చాలా మంది అంటున్నారు. ఇదే జరిగితే షణ్ముఖ్ ఎలిమినేట్ అయినా అవ్వొచ్చని.. కాబట్టి తన ఆట తాను ఆడుకోవాలని ఫ్యాన్స్ సూచిస్తున్నారు.