For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss: నడవలేని స్థితిలో శ్రీరామ్.. కాళ్లకు కట్లు కట్టిన డాక్టర్లు.. నా వల్లే అంటూ ఏడ్చిన సన్నీ

  |

  ఐదేళ్లుగా తెలుగులో నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఈ మధ్యలో ఎన్నో షోలు పుట్టికొచ్చినా.. దీన్ని మాత్రం బీట్ చేయలేకపోయాయి. అంతలా ఈ రియాలిటీ షో బుల్లితెరపై హవాను చూపిస్తూ దూసుకుపోతోంది. అందుకే తెలుగులో నాలుగు సీజన్లను ఒకదానికి మించి ఒకటి రెస్పాన్స్‌తో సక్సెస్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు నడుస్తోన్న ఐదో సీజన్ కూడా అదే రీతిలో ప్రసారం అవుతోంది. అయితే, తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ఊహించని ప్రమాదం జరిగింది. దీంతో కంటెస్టెంట్ శ్రీరామ చంద్ర నడవలేని స్థితికి చేరుకున్నాడు. అసలేం జరిగింది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం!

  చివరి దశకు చేరడంతో కొత్తగా

  చివరి దశకు చేరడంతో కొత్తగా

  బిగ్ బాస్ ఐదో సీజన్ చివరి దశకు చేరుకున్న విషయం తెలిసిందే. దీంతో షో మరింత రక్తి కడుతోంది. మరీ ముఖ్యంగా గ్రాండ్ ఫినాలేకు సమయం దగ్గర పడడంతో కంటెస్టెంట్లంతా టాప్ 5లోకి చేరుకోడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే బిగ్ బాస్ కూడా చిత్ర విచిత్రమైన టాస్కులు ఇస్తున్నాడు. మొత్తానికి ఇప్పుడు ఈ షో మరింత రంజుగా సాగుతోంది.

  బ్రా కూడా లేని వీడియోతో షాకిచ్చిన పాయల్ రాజ్‌పుత్: ప్రైవేటు పార్టులు చూపిస్తూ దారుణంగా!

  ఫినాలేలో ఒక కంటెస్టెంట్ రాక

  ఫినాలేలో ఒక కంటెస్టెంట్ రాక

  ఏడుగురిలో ఒక కంటెస్టెంట్‌ను నేరుగా ఫినాలేలోకి పంపేందుకు 'టికెట్ టు ఫినాలే' టాస్క్‌ను ఇచ్చారు. ఇది మూడు రౌండ్లలో జరగనుంది. అందులో ఎవరికైతే ఎక్కువ మార్కులు ఉంటాయో వాళ్లు ఇందులో విజేతగా నిలుస్తారు. తద్వారా ఫినాలేలోకి నేరుగా అడుగు పెడతారు. ఈ టాస్క్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగబోతుంది. దీంతో ఇందులో ఎవరు గెలుస్తారో అన్న ఆసక్తి కనిపిస్తోంది.

  ఐస్ ఛాలెంజ్.. అతడే టాప్‌లో

  ఐస్ ఛాలెంజ్.. అతడే టాప్‌లో

  'టికెట్ టు ఫినాలే' టాస్కులో భాగంగా మొదటి రౌండ్‌లో ఐస్ టబ్ ఛాలెంజ్ ఇచ్చారు. ఇందులో కంటెస్టెంట్లు అందరూ ఐస్ టబ్‌లో నిల్చుని ఉండాలి. కాలు బయట పెట్టిన వాళ్ల దగ్గర బాల్స్ కొట్టేయొచ్చు. ఇలా చివర్లో ఎవరి దగ్గర ఎక్కువ బాల్స్ ఉంటాయో వాళ్లకు ఎక్కువ మార్కులు వస్తాయి. ఈ టాస్కులో సన్నీ దగ్గర ఎక్కువ బాల్స్ ఉండడంతో అతడికి 7 మార్కులు వచ్చాయి.

  ప్యాంట్ లేకుండా షాకిచ్చిన అనన్య నాగళ్ల: సినిమాల్లో నిండుగా.. ఇక్కడ మాత్రం అరాచకంగా!

  ఐస్ ఛాలెంజ్‌లో వాళ్లకు కష్టం

  ఐస్ ఛాలెంజ్‌లో వాళ్లకు కష్టం

  'టికెట్ టు ఫినాలే' టాస్కులో భాగంగా జరిగిన ఐస్ ఛాలెంజ్ టాస్కులో అపశృతి చోటు చేసుకుంది. ఎక్కువ సేపు ఐస్‌లో కాళ్లు పెట్టడం వల్ల సిరి, శ్రీరామ చంద్ర స్పర్శను కోల్పోయారు. దీంతో వీళ్లిద్దరూ మెడికల్ రూమ్‌లోకి వెళ్లారు. దీంతో డాక్టర్లు వాళ్లకు వైద్యం చేశారు. వీళ్లతో పాటు ప్రియాంక సింగ్, షణ్ముఖ్ జస్వంత్ కూడా చాలా సేపు కాళ్లు పని చేయక ఇబ్బందులు పడ్డారు.

  పింకీ వల్ల శ్రీరామ్‌కు ఇబ్బంది

  పింకీ వల్ల శ్రీరామ్‌కు ఇబ్బంది

  ఐస్‌ టబ్ నుంచి బయటకు రాగానే వేడి నీళ్లు పోయడం హానికరమని బిగ్ బాస్ కంటెస్టెంట్లను హెచ్చరించాడు. కానీ, కొద్ది సేపటి తర్వాత అదేమీ పట్టించుకోని ప్రియాంక... కాళ్లు తిమ్మిరెక్లిన శ్రీరామ్‌కు భామ్ రాసి, వేడినీళ్లు పోసి మసాజ్‌ చేసింది. దీంతో ఉదయాన్నే లేచి కాళ్లు కింద పెట్టలేకపోయాడు. దీంతో మెడికల్ రూమ్‌లోకి తీసుకెళ్లగా డాక్టర్లు రెండు కాళ్లకూ కట్లు కట్టారు.

  Janhvi Kapoor: బటన్స్ విప్పేసి రచ్చ చేసిన జాన్వీ కపూర్.. ముందుకు వంగి మరీ అందాల జాతర

  వెక్కి వెక్కి ఏడ్చేసిన శ్రీరామ్

  వెక్కి వెక్కి ఏడ్చేసిన శ్రీరామ్

  మెడికల్ రూంలో ట్రీట్‌మెంట్ చేయించుకున్న తర్వాత శ్రీరామ చంద్రను వీజే సన్నీ ఎత్తుకుని తీసుకొచ్చాడు. అతడి బెడ్‌పై పడుకోబెట్టి జాగ్రత్తలు చెప్పాడు. అనంతరం ఉదయాన్నే 'గెలుపు తలుపుతే తీసే' అంటూ సాగే పాటను ప్లే చేశారు. దీన్ని తీన్‌మార్ సినిమాలో శ్రీరామ చంద్రనే పాడాడు. ఆ సమయంలో అతడు వెక్కి వెక్కి ఏడ్చాడు. దీంతో కాజల్ అతడిని ఓదార్చింది.

  Recommended Video

  Mahesh Babu To Undergo Surgery | SSMB Response On Akhanda
  తన వల్ల జరిగిందన్న సన్నీ

  తన వల్ల జరిగిందన్న సన్నీ

  సన్నీ ఐస్ టబ్ గేమ్‌లో శ్రీరామ్, సిరి మీదే ఎక్కువ ఫోకస్ చేశాడు. దీంతో వాళ్లిద్దరూ ఐస్‌లో కాళ్లు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత వాళ్లిద్దరికీ ఇబ్బంది కలగడంతో సన్నీ తెగ బాధ పడ్డాడు. తన వల్లే వాళ్లిద్దరికీ ఈ పరిస్థితి వచ్చిందంటూ మానస్ దగ్గర చెప్పుకుని ఏడ్చేశాడు. అనంతరం వాళ్లకు స్వయంగా టిఫిన్ తయారు చేశాడు. శ్రీరామ్ విషయంలో బాగా కేర్ తీసుకున్నాడు.

  English summary
  Bigg Boss 5th Season Running Successfully. Sreerama Chandra Injured in Ticket to Finale Task. Then VJ Sunny Crying for Him.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X